తొలి ఏకాదశి . పేలాల పండుగ
శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!! పరమాత్ముడికి ఐదు విభూతులు అని పేరు. అందులో మొదటిది వైకుంఠంలో ఉండే ఆ శ్రీమహవిష్ణువుది పర అంటారు.ఈ స్వామి యోగనిద్రలోకి వెళ్ళి మన తప్పుఒప్పులను లెక్కలువేసి మన తదుపరి జన్మను నిర్ణయించే తత్త్వం . రెండోది క్షీరసాగరంలో వాసుకి మీద శయనించి ఉండే ఆ పరమాత్ముడిది, దీనినే వ్యూహం అంటారు. మూడోది అవతారాలలో ఉండే స్వామి అంటే రాముడు, కృష్ణుడు..వీరిని విభవము అంటారు. నాలుగోది, సర్వ జీవుల హృదయాలలో ఉండే స్వామిని అంతర్యామి అంటారు. ఐదోది మనము రోజు ఇంట్లో పూజించే స్వామి, అర్చ్యామూర్తీ అంటారు. మనము విన్నవించే విన్నపాలు, మన పూజలు స్వీకరించేది మన ఇంట్లో ఉండే అర్చ్యామూర్తీ.కనుక నిస్సందేహంగా ఆయనను పూజించి మీరు తెలిసితెలియక చేసిన తప్పులకు ఆయనను క్షమించమని మనస్పూర్తిగా వేడుకుని, మంచి జన్మను ప్రసాదించమని వేడుకోండి. మనందరం జీవులం. జీవుడికి,దేవుడికి తేడా ఏమిటో తరచి చూడండి. నేను నా పొట్ట అనుకొనే జీవదశ నుండి అంతానేనే అనే మహత్తర లోకోత్తర స్థితిలో స...