Posts

Showing posts from November, 2018

ఓ మనిషీ!

మనిషికి మనస్సు ఒక వరం. నమ్మకం అనేది మరో గొప్ప వరం. ఇష్టమైనవి పొందాలని,అయిష్టమైనవి పోవాలని మనిషు అనుకొంటాడు.   ప్రగాఢమైన నమ్మకం అనేది ఓ పెద్ద వరం. నిజానికి,   మనుషుల్లో మనస్సు అనగా ఆలోచనా సామర్ధ్యం అనేది ఒక వరం. కానీ ఆ వరాన్ని మనం శాపం గా మార్చేసుకొన్నాం. గతాన్ని తవ్వుకొంటూ   మనకు భయాన్ని,జుగుప్సను, అవమానాన్ని,బాధను,ఆక్రోశాన్ని,ఆవేదనను ,కలిగించిన సంఘటనలను పదే పదే నెమరువేసుకొంటూ దుఃఖిస్తూ ఉండటం బాగా అలవాటై పోయింది. అంతేకాదు, భవిష్యత్ లో కలగబోయే బాధలు,దుఃఖాలు, అభద్రత గురించి ఆందోళన చెందడం కూడా మరింతగా అలవాటైపోయింది. ఇలా ప్రతిక్షణం ఏడుపుతో కుమిలి కునారిల్లిపోవడం మెజారిటీ మనుషులకు ఒక పెద్ద అలవాటుగా మారింది. సెక్స్,డ్రగ్స్, ఉప్పు, ఆల్కహాల్ కే కాదు దుఃఖపూరితంగా ఉండటానికి మనిషి బాగా అలవాటు పడ్డాడు . జీవితం ఇంత    దుఃఖభాజకంగా   ఉంటే దుఃఖపడకుండా ఎలాఉంటామండీ ? సరిగ్గా పరిశీలిస్తే నిజంగా దుఃఖాన్ని కలిగించే సంఘటనల కంటే ,దుఃఖాన్ని పదే పదే తలచుకొని కుమిలి పోవడమే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, దుఃఖం ముంచెత్తు తుందేమో అనే భయం మనిషిని తడిపేస్తుంది. మరి సంతోషం కలగడం ల...