ధర్మ చింతన
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తూనే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండే స్థాయికి చేరాలని సమాజం ప్రయత్నిస్తోంది. ఇదే భారత సనాతన ధర్మం . ధర్మం అంటే అర్ధం? నువ్వు దేనితో తయా రయ్యావో దాని గుణాలను వ్యక్తీక రించ డమే నిజమైన ధర్మం . ధర్మం అనగా బాధ్యత . దేనితో తయా రయ్యావో నీకు తెలిసి ఉంటేనే నీ బాధ్యత నువ్వు చక్కగా నిర్వర్తిస్తావు . "నువ్వు " దేనితో తయారయ్యావు? ఎముక,మాంసం,నరాలు,నాడులు ,ఇంద్రియాలు ,మనస్సు,ప్రాణం ,కారణ శరీరం --వీటన్నింటి తోనా ? పరిశీలిద్దాం ... గాడ నిద్ర పోయినప్పుడు శరీరం ,మెదడు,మనస్సు ఏమీ పని చేయవు. ఐనా మేలు కోగానే "నేను" బాగా నిద్ర పోయాను ' అని అంటావు . శరీరం ,మెదడు,మనస్సు -ఈ మూడు నువ్వు కాదు అని అంగీక రిస్తున్నావు . కానీ ప్రాణం పని చేస్తూ నే ఉంటుంది. ప్రాణం అనేది అగ్ని శక్తి . అదే చోదక శక్తి . ఆ శక్తికి నిరంతరం ఇంధనం -అనగా ఆహారం,నీరు,గాలి కావాలి. (కొందరు యోగులు ఇవేమీ లేకున్నా సూర్య శక్తిని గ్రహిస్తూ ప్రాణాగ్ని ని నిలుపు కొంటారు). ప్రాణం కన్నా సూక్ష్మ మైన స్థాయిలో కారణ శరీరం, దీని కంటే ...