Posts

Showing posts from January, 2017

వైకుంఠ ఏకాదశి :

Image
ఉత్తరాయణ పుణ్యకాలానికి 5 రోజులు ముందు వచ్ఛే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు . ఇది సూర్య చలనం ప్రకారం లెక్కిస్తారు . మనం ముఖ్యంగా ఆంధ్రులు చంద్ర గమనాన్ని బట్టి తిధులు లెక్కిస్తారు . ఈ    శుభ సమయం ప్రాణులకు ముఖ్యం గా బుద్ధి జీవులైన మానవులకు శుభాన్ని చేకూర్చే సమయం గా ,    మన మహర్షులు ఎంతో శ్రమకి ఓర్చి కనిపెట్టారు . రెండు బిందువులకు   ,రెండు అలలకు ,రెండువిషయాలకు ,రెండు జాములకు , రెండు ఆయనములకు ,రెండు యుగాలకు , అలాగే ఒక కణము రెండుగా విభజన చెందే వ్యవధుల మధ్యన    ఉండే నిశబ్దం ఎంతో శక్తివంత మైనది . ఆ సమయంలో అంతటా పరచు కొని ఉన్న కాస్మిక్ చైతన్యం, వ్యక్త సృష్టి కి కారణభూతమైన పంచ భూత ప్రకృతిలో మరింతగా ప్రతిఫలించే సమయం . ప్రక్రుతి ప్రశాంతం గా ఉన్న సమయమే శుభసమయం .   ఎందుకంటే అలంటి శాంతికరమైన స్థితిలోనే దైవ చైతన్య ప్రభావం హెచ్చుఁగా ఉంటుంది . పంచభూత ప్రకోపం ,రాజస -తామస గుణాల సంరంభం దైవచైతన్య ప్రవాహాన్ని సాఫీగా సాగనియ్యవు . అందుకే ఉభయ సంధ్యలలో   (సంధ్యా వందనం )పవిత్రభావనలతో కృతజ్ఞతా పూరితమైన    మంత్రపూతమైన తర్పణం సమర్పణ చేస్తే శరీరంలోని ...