Re-program your sub-conscious mind!
మీ సుప్తచేతన (sub conscious) కున్న అధ్బుతమైన శక్తి ఎవ్వరూ ఊహించలేరు. 1) మీ సుప్తచేతన (sub conscious) కున్న శక్తి అంతు లేనిది. మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ప్రేరణ కలగజేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. అది మీ జ్ఞ్యాపకాల గోదామునుంచి మీ గత జీవితంలోంచి ఎన్నో దృశ్యాలను వెలికిదీయగలదు. మీ గుండె చప్పుడును, రక్తప్రసారాన్ని అది నియంత్రించగలదు. మీ జీర్ణశక్తిని, తిన్నది ఒంట బట్టించుకోవటాన్ని, బయటకు పంపటాన్నినియంత్రిస్తుంది. మీరో రొట్టెముక్క తినప్పుడు, మీ సుప్తచేతనాత్మక మనసు దానిని – కణజాలం, కండరాలు, ఎముకలు, రక్తం రూపాలలోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని అతి పెద్ద తెలివైన వాడికి కూడా తెలియకపోవచ్చు. మీ సుప్త చేతనాత్మక మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను, శరీరధర్మాలను అదుపులో ఉంచుతుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. మీ సుప్తచేతనాత్మక మనసు ఎప్పుడూ నిద్రపోదు, విశ్రమించదు. అది అన్ని వేళల పనిచేస్తూనే వుంటుంది. దానికున్న అధ్బుతమైన శక్తిని తెలుసుకోవాలంటే ఒక పని చేయండి. నిద్రపోయేముందు దానితో స్పష్టంగా మీరొక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని అనండి మీరు కోరుకున్న ఫలితాని...