Posts

Showing posts from June, 2014

ఆధ్యాత్మికత(spirituality) - మతం(religion) .

నేడు హిందూ మతం గా మనం చెప్పు కొంటున్న ది సనాతన ధర్మం(ancient wisdom) లో ఓ చిన్న భాగం .  నిజం చెప్పు కోవాలంటే ఆధ్యాత్మికత(spirituality) వేరు - మతం(religion) వేరు . మనిషి కన్నా బలమైన శక్తులు గురించి ఆలోచనలు చేసి ఒక ఉహా సిద్దాంతాన్ని నిర్మించేది తత్వ శాస్త్రం(philosophy) . ఇది మనస్సు తోనే కాక హృదయం తో ముడి పడి ఉంటుంది . ఆయా సిద్ధాంతాలలో హేతుబద్దత ఉందా అని చూసేది థియాలజీ -తర్క శాస్త్రం   (rational logic). ఇది మన జ్ఞానేంద్రియా లైన మనస్సు ,బుద్ది , వివేకం తో ముడి పడి ఉంటుంది . సనాతన ధర్మం మనిషికి ఎలాంటి నిబంధనలు విధించ కుండా  సర్వ స్వతంత్రం గా,అంతటా ఏక సూత్రం గా  ఉన్న ఏకైక సత్యం (the truth) గురించి ఎవరికీ వారు అన్వేషణ చేసి ఆ సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలని చెబుతుంది . ఆర్యావర్తం నకు బయట ఉన్న దేశాల పండితు లు,తత్వ వేత్తలు ,  సనాతన ధర్మ సిద్దాంతాలను కొన్నింటిని సేకరించు కొని వారి వారి  దేశాల కాల మాన పరిస్తితులకు , ఆయా దేశ ప్రజల మానసిక స్థాయి  కి అనుగుణం గా , ఒక గ్రంధం తయారు చేసుకొని దానినే "దేవుడు చెప్పిన ఆజ్ఞలు" గా ప్రచా...

రుషి ప్రోక్తం ....

అధౌ ఋషి ప్రోక్తః .....  (....  అని మన సనాతన ఋషులు చెప్పారు ). క శ్యప ,అత్రి, అంగీరస, భ్రుగు, దూర్వాస, వశిష్ట, విశ్వామిత్ర, మైత్రావరణ, కౌండిన్య, అగస్త్య, గౌతమ,  యాజ్ఞ వల్క్య,వేదవ్యాస,వాల్మీకి,శక్తి,పరాశర  మహర్షులు , శుక,శౌనకాది సూత మునీంద్రులు తదాది యోగీశ్వర శ్రీ కృష్ణుడు పెట్టిన  జ్ఞాన భిక్ష మన సనాతన ఆర్యావర్త ధర్మ పధం . సృష్టి ,బ్రహ్మ,అధిభూతం,అధిఆత్మ,అధిదైవం, అధియజ్నం ,కర్మ --- అనగా అర్ధం ఏమిటి ?  ఈ పదాలు భగవద్ గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం లో ప్రముఖం గా వినిపిస్తాయి . సనాతన ఆర్యావర్త  ధర్మ జీవనానికి ఒకే ఒక ప్రామాణిక గ్రంధం ఐన భగవద్గీత శ్రీకృష్ణుని ముఖతః పరబ్రహ్మ పలికిన వాణి  .... గీత లోని కొన్ని పదాలకు సరైన అర్ధం అవగాహన చేసు కొంటే గీతా సారాన్ని మన జీవితాలకు అన్వయించు కోవడం తేలిక అవుతుంది . ఈ సువిశాల విశ్వం కృతి (creation) కాదు .  ఇది అవతరణ (manifestation). విత్తు నుండి చెట్టు రావడం సృష్టి . అదే విధం గా అవ్యక్తం నుండి వ్యక్త మయ్యే ఈ సకల లోకాలు, గ్రహ నక్షత్రాలు ,కాల బిలాల తో ఉన్న విశ్వం నే...

వ్యాస పూర్ణిమ....

Image
ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ,మంచి నీటి సౌకర్యం,పరిసరాల పరిశుభ్రత ,నిరంతర విద్యుత్ ,మరుగు దొడ్డి -ఇవి తప్పనిసరి అవసరాలు.  ప్రతి కుటుంబంలో కనీసం  ఒకరికి ఉద్యోగ భద్రత , ఆరోగ్య భీమా సౌకర్యం , వారి పిల్లలకు విలువలతో కూడిన విద్య ని అందించే పాటశాల; వ్యవహార జ్ఞానాన్ని, బతుకు తెరువుని ఇచ్చే కళాశాల, వారి మనస్సులు అరిషద్వార్గాలతో అతలా కుతల మైనప్పుడు స్వాంతన ఇచ్చే ఆసరా ,సంఘంలో ఉన్న హెచ్చు తగ్గులను సమతుల్యం చేసుకొనే ఆచరణ -ఇవీ ప్రభుత్వాలు చేయ వలసిన అత్యవసర విధులు. దీనికి సాయ పడే వారు సద్గురువులు .  మనిషి కి , సంఘానికి స్వాంతన, సమతుల్యత ఇచ్చే వాటిలో ప్రధాన మైనవి ---- మతం - మత  గ్రంధం, సద్గురువు,సూక్తి ముక్తావళి ,పురాణ కావ్యాలు ,సంప్రదాయ కట్టుబాట్లు ,సంస్కృతి.  ప్రకృతిలోని పంచ భూతాలు , గ్రామ దేవత లు , పాంచ రాత్ర పూజలు -                                    ఇవన్నీ మనిషి భయాన్ని,నిరాశని పోగొట్టే వే .  ఆలయాల నిర్మాణం, ఆగమ -వైదిక క్రతువులు -- ఇవి మరి కొందరికి వెన్ను త...

ఆత్మవిచారణ

 ఆత్మకి ఉన్న ధర్మాలు - స్వేచ్చ ,కరుణ ,ప్రేమ   స్వేచ్చ అంటే ఏమిటి ? నీ (ఆత్మ)ధర్మాన్ని నిర్భయం గా వెల్ల డించ డ మే స్వేచ్చ. సంకల్పం -ఆలోచన-ఆచరణ అన్నీ ఒకే విధం గా ఉండి , ఆనంద స్థితి చెదర కుండా  ఉండటమే ఆత్మ ధర్మం . మనిషికి ఆనంద మనేది కొత్తగా తెచ్చి పెట్టు కొనేది కాదు . ఎప్పుడూ స్వత  సిద్దం గా ఉండేదే . ప్రక్రుతి విరుద్ధ మైన మనో వాక్ కర్మల వలన  ఆ ఆనందాన్ని కప్పివేసే గందరగోళం తో  సత మవుతూ ఉంటాడు మనిషి . ఆ విధం గా స్వేచ్చ నూ కోల్పోతాడు . అనగా అహం అనే తత్త్వం ఉన్నంత వరకూ మనిషి కి స్వేచ్చ ఉండదు . ఈ  అహానికి మరో పేరు " మిధ్యా నేను". (Mythical 'I') మిధ్య అంటే అబద్దం అని కాదు . పూర్తి  వాస్తవం కాదు . Myth means twisted truth or illusion or half-truth. తాడు ని చూసి పాము అని భ్రమ చెందడం ...  మనకు పాము గురించి తెలిసి ఉంటేనే ఆ భ్రమ కలుగుతుంది . మరి " పూర్తి  వాస్తవం" ఏమిటి ? దీనికి మరో పేరు సత్యం - ప్రజ్ఞ - ఆనందం - ప్రకాశం . ఆ సత్యం మనస్సుకి -అనగా తర్కానికి  అందేది కాదు . Man can control body ...