Posts

Showing posts from October, 2014

మనస్సు -బుద్ది -ఆత్మ

మనస్సుతో సుఖ దుఖాలను అనుభవిస్తాము . అదే మనస్సుతో స్థిత ప్రజ్ఞ నీ సాధిస్తాము . అదే మనస్సు ద్వారా భక్తినీ సాధన చేస్తాము . బుద్ది తో తప్పుడు నిర్ణయాలు లేదా మంచి నిర్ణయాలు తీసు కొంటాం . అదే బుద్ది తో వివేక విచక్షణ లను సాధిస్తాం . బుద్ది తో నే జ్ఞాన మార్గంలో సాధన చేస్తాం . ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా , ఎలాంటి విచక్షణా శక్తిని ఉపయో గించ కుండా కేవలం ఒక భావన -అనగా మనస్సు ,బుద్ది కన్నా సూక్ష్మ మైన స్థాయిలో పశ్యంతి స్థాయి -దానినే యోగ పరిభాషలో హృదయం అంటాం -చేయ డాన్ని ధ్యానం అంటాం. ఏ మాత్రం "అహం" అనే భావం లేకుండా సాక్షిత్వం గా ఉండి పోవడమే ధ్యానం . ఆత్మ అనేది వేరు అనుకోవడం అవిద్య - అదే అహం . ఆత్మ అనేది లేదు అనుకోవడం అజ్ఞానం . ఆత్మ ని మరచి పోవడం అమాయకత్వం . ఆత్మని "నేనే " అని శాస్త్రాల ద్వారా ,గురువుల ద్వారా విని ఓహో ' అని ఉండిపోవడం కుతూహలం . ఆత్మ అనేది నిజమని ప్రగాడం గా నమ్మి శాస్త్రాలు ,గురువులు చెప్పిన దాన ,జప, తపాలు ,షోడశ పూజలు ,స్తోత్రాలు చేయడం ఆధ్యాత్మిక సాధనకి తోలి మెట్టు . ఆత్మ పై అత్యంత శ్రద్ద తో అన్వేషణా పధం లో సద్ గురువు  సమక్షంలో క్రమ బద్దమైన జీవనం చేయడం...

సత్తు ని పెంచుకో ...

 ఏకం గా ఉన్న సత్య చిదానంద చైతన్యం స్వ ప్రేరణ తో శక్తి తరంగ సంపుటి ని కల్పించి రెండుగా మారి , త్రిగుణాల మేళ వింపుతో మాయా సృష్టిని ఆరంభించింది . ఈ మాయా మోహ సృష్టి లో సత్వ -రాజస -తామస "అనే 3 గుణాలు వేర్వేరు నిష్పత్తులలో మేళ వింప బడి రకరకాల తత్వాలు సృష్టింప బడ్డాయి . ఆ తత్వాల నుండి పంచ తన్మాత్రలు ,వాటి నుండి పంచ భూత తత్వాలు ,ఇలా సృష్టి బహుధా విస్తరింప బడింది . చైతన్యము తన శక్తితో మాయా మోహ  సృష్టి ప్రారంభించిన దశలో  త్రిగుణాల లోని సత్వము ఎక్కువగా ఉన్న పరామితులను(matrix or dimensions) ఊర్ధ్వ లోకాలని ,తామసం అత్యంత ఎక్కువ ఉన్న పరా మితులను అధో లోకాలని ఋషులు వర్గీక రించారు . ఈ రెండూ కలిసి రాజస గుణం పుట్టి కర్మ క్షేత్రం గా అవతరించిన దే భూలోకం . రాజసం అంటే కర్మ . ఇలా మూడు గుణాల శక్తులకు మధ్యన కలిగిన ,కలుగుతున్న వైరుధ్యం సంఘర్షణకు దారితీసి అల్లకల్లోలం ఏర్పడుతుంది .  సిస్టం లో సత్వ -తామస గుణ నిష్పత్తిలో విపరీత మైన తేడా నే అధర్మం అంటాము . లోకాలు అల్లాడుతూ ఉండ ట మంటే అదే . వ్యవస్థలో -అది ఈ అనంత సృష్టి కానివ్వండి , లేదా మన సమాజం కానీండి -సత్వ గుణం సరైన...

దైవ వాక్యం

Image
ఓ జీవి ప్రయాణం : పరబ్రహ్మ లోని ఓ శకలం స్వ లేదా దైవ ప్రేరణతో, మాయకు లోబడి ఆత్మ గా తన ప్రస్తానం మొదలు పెట్టింది . దాని గమ్యం "మాయ" ముసుగుని తొల గిమ్చు కొని, తాను అనుభవిస్తున్నట్లుగా భావించిన  త్రిగుణా త్మక మైన " కల " లాంటి ప్రయాణా న్ని ముగించి నిర్గుణ బ్రహ్మలో  .....   మనిషి తన ఇష్టానికి, కష్టానికి లేదా రాగ ద్వేషాలకు లోబడి తనకు తోచిన విధం గా  మాట్లాడతాడు,కర్మలు చేస్తాడు . మరికొందరు కీర్తి కోసం ,డబ్బు కోసం, బంధం కోసం, బాధ్యతల రీత్యా ,ఇతరుల కోసం , ఇతరులు చెప్పినట్లుగా చేస్తారు .  కానీ ,మనిషి దేవుడు చెప్పినట్లు ఎప్పుడు నడచు కొంటా డో అప్పుడే మనిషి సాధకుడు అవుతాడు . దేవుడు చెప్పింది ఇదీ' అని ఎవరు చెప్పారు ? సనాతన ధర్మం ,ఇంకా వివరం గా శృతి స్మ్రుతి పురాణాలు చెప్పాయి . ప్రస్తాన త్రయాలైన ఉపనిషత్ ,గీత ,బ్రహ్మ సూత్రం ' ద్వారా ఇంకా విడమరిచి చెప్పారు ఋషులు . ఏమిటా దైవ వాక్యం ? దైవ వాక్యం ఇదే -సకల సంకల్పాలను ,ఆలోచనలను ,కోరికలను ,కర్మలను కర్తృత్వ భావన లేకుండా(*నేనే చేస్తున్నాను అని కాక ) ,అదే సమయం లో కర్మ ఫలితాలపై ఎలాంటి ఆసక్త...

అంతర పూజ / అంతర్యాగం

ప్రస్తుతం మనిషి బాహ్యపరమైన పూజలకు ,ఆడంబరాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ,ఆయా హోమాలు, వ్రతాలు ,పూజల వెనక ఉన్న అంతరార్ధం పై దృష్టి పెట్టడం లేదు . భావ శుద్ది లేని కర్మలు రాజస ,తామస కర్మల వలనే బంధాన్ని బలపరుస్తాయి గానీ, దైవానికి దగ్గర కానివ్వవు . దానం,జపం,తపస్సు ఇవన్నీ సాత్విక పరమైన భావం తో ఉంటేనే మనిషి జన్మ లక్ష్యం ఐన ఆత్మ సాక్షాత్కారం సిద్దిస్తుంది . అంతర్ పూజ యొక్క ప్రాముఖ్యత నేడు ఏ పూజారులూ విడమరిచి చెప్పడం లేదు . ఆధ్యాత్మిక కార్యక్రమాల వెనక ఉన్న అంతరార్ధం ను ,అంతర్యాగం  యొక్క విశిష్టత ను చాటి చెప్పకుంటే మన సనాతన జ్ఞాన వాహిని  ఎండి పోతుంది . శబ్ద ,కాంతి తరంగ రూపులైన దైవీ శక్తులు  సాత్విక భావ శక్తికి తల వూచి మనిషి ని ఆధిదైవిక మార్గం లోకి ఆహ్వానిస్తాయి . బాహ్య పూజ ,స్తోత్రం ,జపం ,ధ్యానం , నిరంతర అంతర పూజ  -ఇవన్నీ ఒకదానికన్నా ఒకటి ఎంత మేలు చేస్తాయో ఈ చిన్ని పద్యం చూడండి - కోటి పూజ సమం స్తోత్రహ  కోటి స్తోత్ర సమో జపం  . కోటి జమ సమం ధ్యానం . కోటి ధ్యాన సమో లయం .   - లయ మంటే నిరంతర అంతర పూజ. మనిషి తన ...

కాల మహిమ

దేనికైనా కాలం కలిసి రావాలి .  వాడికి ఇంకా టైం రాలేదు . కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు . --- ఇలాంటి సామెతలు కాల మహిమ గురించి చెబుతాయి . 12 నక్షత్ర రాశుల గుండా సూర్యుడు చేసే  గమనం లో ప్రతి రాశిలోకి జరిగే ప్రవేశాన్ని సంక్రమణం అంటారు .  12 నక్షత్ర రాశుల గుండా గురు గ్రహం ప్రయాణం చేసినప్పుడు నదులకు పుష్కరాలు వస్తాయి . కాలాన్ని ,తద్వారా మానవ జీవితాలను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసే వి వివిధ నక్షత్ర రాశులలో  జరిగే సూర్య, గురు, శని గ్రహాల గమనం. సూర్యుడు   అగ్ని స్వరూపమైన బుద్దిని ,చంద్రుడు జల స్వరూపమైన మనస్సును ,గురు గ్రహం వాయు  తత్వా న్ని ,శని గ్రహం పృధ్వీ తత్వా న్ని ప్రభావితం చేస్తాయి . తులా రాశి అన్నింటినీ సమానం చేస్తుంది . శని గ్రహం కూడా యమ ధర్మ రాజు లాగా  అందరికీ సమ న్యాయం అందే టట్లు చూస్తాడు . అందుకే కర్మలతో నిండి పోయిన మానవ జీవితాల పై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది శనిగ్రహం . కర్మ భారం తక్కువ ఉన్నవారిని ,ఆధ్యాత్మిక సాధన అనుష్టానం గా  చేస్తున్న వారిని  శనిగ్రహం అంత  ఎక్కువగా బాధి...

Clean the mind to Clean the world

మన మనస్సులు పరిశు ద్దం గా ఉంటే మనచుట్టూ ఉన్న పరిసరాలు కూడా శు భ్ర పడతాయ్ . మనస్సు శు ద్దం గా ఉన్నప్పుడు పరిసరాలను మనం పాడు చేయలేము .   ఎందు కంటే శు ద్దం గా ఉన్న మనస్సు ప్రతి జీవిని ,చెట్టు పుట్ట,పరిసరా లన్నింటినీ జాగ్రత్తగా కాపాడుతుంది .  మనుషుల్లో ఎప్పుడైతే ఆధ్యాత్మికత తగ్గిందో వాతావరణం ,పరిసరాలపై ప్రేమ కూడా తగ్గిపోతుంది .  అంతర శుద్ది బాహ్య శుద్ది కి దారి తీస్తుంది . 

‘కాడి ఎద్దులతో విద్యుత్‌ ఉత్పత్తి’

Image
‘‘100 చదరపు గజాల స్థలం మధ్యభాగంలో ఒక యంత్రాన్ని ఏర్పాటుచేయాలి. ఆ యంత్రం నుంచి విద్యుత్‌ తీగలను మోటర్‌ లేదా, లైట్లకు అను సంధానం చేయాలి. యంత్రం నుంచి ఒక రాడ్‌ను ఏర్పాటు చేసి దాన్ని ఎద్దులకు కట్టి గానుగను తిప్పినట్లు గుండ్రంగా తిప్పితే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది .  ఎద్దు ,ఒక గంట పాటు తిరిగి  యంత్రాన్ని నడిపితే 9 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది . రైతులు  ఉపయోగించే 5 హెచ్‌పీ మోటర్‌కు గం టకు 4  యూనిట్ల విద్యుత్‌ ఉపయోగించుకోగా, మరో 5 యూనిట్ల విద్యుత్‌ మిగులుతుంది.  నెట్‌మీటరింగ్‌తో గ్రిడ్‌కు అనుసంధానం చేస్తే ప్రతి రోజు ఉత్తత్తి చేసే మిగులు విద్యుత్‌ను అమ్ముకునే అవకాశం.  ఇప్పటి కైనా మన రైతులు, ఆవులను ,ఎద్దులను సాకితే  పాడి పంట కి లోటు ఉండదని సనాతన ధర్మం చెప్పిన మాట నిజ మని నమ్మాలి .