"నేనెవరిని ? ఈ జన్మకి గమ్యం ఏమిటి? Who am I ?
"నేనెవరిని ? ఈ జన్మకి గమ్యం ఏమిటి? నేను శరీరం ,మనస్సు ,బుద్ది ,ప్రాణం ఇవేమీ కాదు . మనస్సు మొట్ట మొదట నేను అనే ఆలోచన చేసింది. అదే అహం . ఆ తర్వాత , ఎన్నో రకాల ఆలోచనల తో ఈ ప్రపంచాన్ని నిర్మిస్తుంది . చింతలతో , ఆశా నిరాశల నడుమ ఊగిసలాడే మనస్సుతో ,కాసేపు సంతోషం ఆ వెంటే దుఖం ,ఇంతలోనే నిర్వేదం ,అంతలోనే ఉత్సాహం - ఈ ద్వందాలకు అంతమే లేదా? కష్టాలొచ్చినపుడు ఇంకొకరిపై ఆధారపడి లేదా దేవుని పై భారం వేయటం తాత్కాలిక వైరాగ్యపు ఆలోచనలతో సోమరితనంతో పలాయన వాదాలు చేయటం సమస్యలను దాటవేసి 'నా కర్మ ' అని అనుకోవటం - మనందరికీ మామూలే ! నీ సమస్యలకు సమాధానం నువ్వే వెదుక్కోవాలని కష్టాలు ,సుఖాలు మన మనస్సులోని కండిషనల్ ప్రోగ్రాంస్ అని శక్తి వంచన ,ఆత్మ వంచన లేకుండా కష్ట పడాలని ఎవరి పై ఆధారపడరాదని ,భావ దాస్యం చేయరాదని తెలుసుకొని నమ్మి ఆచరించడమే - మన పని, మన గమ్యం. మనిషి తను ఆనందపడుతూ వీలైతే తోటి వారిని ఆనందంగా ఉంచుతూ , జీవన ప్రయాణం చేయడమే గమ్యం . శక్తి కొద్దీ సత్కర్మలు, స్వకర్మలు చేయాలి. మనస్సుని ఉత్సాహంగా ,సంతోషంగా ఉంచుకోవాలి . పూజ , అంటే అర్ధం ఏమిటి ? ...