Posts

Showing posts from December, 2022

ధ ర్మము

  ధృ ణాత్ ధర్మః’ అన్నారు. ధృ ’- ధరించు అను ధాతువునుండి  ధ ర్మము’ అనే పదము ఏర్పడినది. దేనివలన ఈ విశ్వమంతా ఇలా నిలిచి ఉన్నదో, మానవ జాతి సంఘటితంగా మనగలుగుతున్నదో, దానిని ధ ర్మము’ అంటారు. ఏదైనా సరే, దాని సహజ లక్షణములను, అది ఉండవలసిన తీరును దాని ధర్మము అంటారు. మన చుట్టూ ఉన్న గ్రహ ఖగోళ నక్షత్రాలు నియమిత పరిధిలో భ్రమణ-పరిభ్రమణం చేయడం వాటి ధర్మం.     సూక్ష్మ జీవులు , చెట్లు, పశు పక్ష్యాదులు సమస్త జీవజాలం ఒక దానిపై ఒకటి ఆధారపడుతూ బతకడం (యజ్ఞం ) జీవ ధర్మం .  అంతేకాదు ఆకాశం ,వాయువు , అగ్ని ,జలం ,పృథ్వి ఇలా మంచభూతాలు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడే ఉంటాయి. దీనినే పంచభూత ధర్మం అనవచ్చు.  మా నవ జీవిత పరమ ప్రయోజనము-అనగా, మనిషి  జీవిత లక్ష్యమును పురుషార్థ సాధనగా చెప్పారు.    చతుర్విధ  పురుషార్థములు- ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము అని ఋషులు చెప్పారు. నాలుగింటిలోకీ ప్రధానమైనది, ప్రథమమైనది  ధ ర్మము’. ధర్మమును ఆచరించటమువలన అర్థమును, కామమును, మోక్షమును కూడా పొందగలము. అయితే  ధ ర్మము   ’ అంటే ఏమిటి?    ధర్మము అంటే ఏమిటి...