అసలైన రామ ప్రతిష్ట ఎప్పుడు ?
ధర్మం అంటే ఏమిటి? గతుకుల రోడ్ పైన, కొండల్లో సాగుతున్నప్పుడు మనకి కర్ర ఎలాగైతే సాయపడుతుందో,నిత్యజీవితం లో ధర్మం కూడా అలాగే సాయపడుతుంది. ధర్మాన్ని వదిలేస్తే మిగిలేది శోకము,అశాంతి,అనారోగ్యం ,ఆవేదన,పాప కూపం ! ఒక యంత్రం లో రక రకాల సైజుల్లో ఎలాగైతే చక్రాలు లయబద్ధంగా తిరుగుతాయో,ఈ సృష్టి కూడా అనేకరకాల చక్రాల తో లయబద్ధంగా నడుస్తుంది . కాల ధర్మం , విశ్వ ధర్మం అనేవి పెద్ద చక్రాలు. మనిషి పరిణామం చెందే భూ ప్రపంచం ఓ చిన్న చక్రం. ఎన్నో జాతులుమరెన్నో ప్రాంతాలు,సమాజాలు,దేశాలు,చిన్న చిన్న చక్రాల వంటివి. మనిషి కి కుటుంబం.ఉద్యోగం,వ్యక్తిగత పరిణామం అనే మూడు కర్మ చక్రాలుంటాయి. ధర్మ చక్రానికి అనుగుణ్యంగా కర్మ చక్రాన్ని నడిపించడమే మనిషి కనీస విధి. ధర్మంగా జీవిస్తే అడుక్కు తినాలసిందే అనే నేడు చాలామంది భావించడం చేత అన్యాయం,అవినీతి,పెట్రేగి పోతున్నాయి. ధర్మంగా ఉంటే మొదట కష్టంగా ఉన్నా తర్వాత దాని విలువ ఏమిటో తెలిసివస్తుంది. సుఖసంతోషాల కంటే శాంతి,ఆరోగ్యం ,సత్కీర్తి విలువైనవనే కనువిప్పు కలుగుతుంది. అన్యాయం,అవినీతి,అక్రమాలు మొదట్లో చాలా సుఖాన్ని ఇ...