Posts

Showing posts from September, 2013

ధ్యానం.

మన రుషులు ,ప్రవక్తలు అందరూ తరతరాలుగా చెప్తుంది ఒకే ఒక్కటి. ధ్యానం చేయండి.అన్నీ సర్దుకుంటాయి. అంతటా  ప్రశాంతత ని అనుభూతి చెంద వచ్చు. ధ్యానం. మనస్సు రకరకాల పౌనపున్యం తొ కంపించే ఒక శక్తి  ప్రవాహం. చుట్టూ ఉన్న కాస్మిక్ శక్తిని మనకు అందనివ్వకుండా ఈ మానసిక శక్తి ప్రవాహం,ఒక నిరోధం లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతేఈ నిరోధాన్ని మనం తగ్గించగలమో,అప్పుడే కాస్మిక్ శక్తి మనలోకి ప్రవహించి మన చైతన్యాన్ని విశ్వ స్థాయికి వ్యాపింప చేస్తుంది. చైతన్యాన్ని మనం శివ అంటాము. కాస్మిక్ శక్తిని అమ్మా అంటాము. మనస్సుని తరంగాలు లేకుండా చేయడ మెలా? మనస్సు కున్న ఒక లక్షణం అది దేనినైతే చూస్తుందో దాని లా మారిపోతుంది.ఒక స్వీట్ ని చూసి దనిపై తదేక దీక్ష పెడితే  అది ఆ తీపి మిటాయి లక్షణాలను సంతరించు కొంటుంది. నీరు ఏ పాత్రలో పొస్తే ఆయా పాత్రల ఆకారాన్ని  పొందుతుంది గదా. అందుకే,మానసిక శక్తి పౌన పున్యాన్ని తగ్గించుకొంటూ శూన్య స్థాయికి తెసుకెళ్ళాలంటే,శూన్యం పై మనస్సుని కేంద్రీకరిస్తే కొంత కాలానికి మనస్సు శూన్యం లాగా,అంటే శూన్యమై పోతుంది. .దేవుడు అనే భావం ఎలా ఉంటుంది?ఎలాంటి లక్షణాలు,వికారాలు...