వాకిట ముగ్గు . పాపిట బొట్టు
వాకిట ముగ్గు . పాపిట బొట్టు ముందుగా చెప్పు కొన్నట్లు మన భారత సాంప్రదా యాల వెనుక భౌతిక ( శాస్త్రీయ ),సామాజిక , మానసిక ,ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయి . సున్నం , బియ్యం పిండి తో కలిపి వేసే ముగ్గులు కీటకాలకు ,పక్షులకు ఆహారం గాను , అదే సమయం లో చెడు పురుగులను , సూక్ష్మ జీవులను తీసు కొచ్చే చెడు గాలి ఇళ్ళ లోనికి వెళ్ళ కుండ నిరోధించే శక్తి కలిగి ఉంటుంది .అతిధులను హృదయ పూర్వకం గా ఆహ్వానించే టందుకు ఇంటి ముందు ఆవు పేడ తో కళ్ళాపు చల్లి మంచి మంచి కళా కృతులతో , ముఖ్యం గా ఆకాశం లో కన్పించే చుక్కల అమరిక కు అనుగుణం గా ముగ్గు లేస్తారు . సాధ్య మైనంత వరకు ఆయా ఋతువులలో ఆకాశం లో నక్షత్రాల అమరిక ఎలా ఉంటుందో గమనించి ముగ్గులు దాని కను గుణం గా వేస్తారు . అలాగే అధర్వణ వేదం ,తంత్ర శాస్త్రం ప్రకారం , మనకు కనిపించని దేవతలను ప్రసన్నం చేసు కోవాలనే సదుద్దేశం తో యంత్రాలను అనగా ఆయా దేవతా రూపాలను రేఖా రూపం లో గీసి పవిత్రమైన పదార్దాలైన పసుపు, కుంకుమ,పూలు , ఇంకా ఆవు పేడ , గుమ్మడి పూలు , దోస కాయలు ,దుంపలు , రేగు -బదరీ ప...