Posts

Showing posts from August, 2014

ఏది సుఖం ?

Image
ఏది సుఖం ? కొందరికి నిధి చాలా సుఖం . మరి కొందరికి రాముని సన్నిధి సేవ సుఖం .  ముందుగా ఓ విన్నపం .  ఏది సుఖం, ఏది దుఖం అనే చింతన జిజ్ఞాసువు కే గానీ , అటు ఎలాంటి మానస శోధన   లేని అజ్ఞానికి ,ఇటు అప్పటికే జ్ఞానం తో పండిన జ్ఞానికి అవసరం లేదు .  ముందు సుఖం గా ఉందనే భ్రమ కలిగించి తర్వాత దుఖానికి కారణ మయ్యె ప్రతిదీ  మనిషికి పనికి రానిదే .  కోరికలే  మనిషి కష్టానికి కారణం అని ఋషి వాక్యం .  వస్తువుల పైన ,విషయాల పైన మనిషికున్న వ్యామోహం ,దానితో మనలో కలిగే అలజడి ఆ కోరిక తీరడానికి పడ  వలసిన శ్రమ ,కష్టం ఇవన్నీ మనిషిని ఆందోళనకు గురి చేస్తాయి . నిజానికి కోరిక మనలో లేనప్పుడు మనిషి శాంతం గా ,సుఖం గా నే ఉంటాడు . ఎప్పుడైతే ఓ ప్రే రేపణ ,ఓ కోరిక , ఓ వ్యామోహం మనస్సులో మెదిలిం దో అప్పుడే మనస్సు కి సుఖం ఉండదు . ఆ కోరిక తీ రేంత  వరకు  ప్రశాంతత ఉండదు . కోరిక తీరి, కావలసింది దక్కిన తర్వాత మనస్సు పూర్వ స్థితి ,అనగా మునుపటి ప్రశాంత ,ఆనంద స్థితి కి వస్తుంది .  వస్తువు దక్కడం వలన ఆనందం వచ్చిందని అందరం అనుకొంటాం . కానీ ,నిజ...

లోకకల్యాణా నికి నాంది......

Image
ఓం గం గణపతయే నమః      బ్లాగ్  పాట కులకు వినాయక జన్మదిన శుభాకాంక్షలు .  గణపతి ఆరాధన సమస్త నాగరికతలకు అత్యంత ముఖ్యమైన పండుగ . సృష్టి ఆరంభం కాక ముందు ,అనగా చైతన్యం (పురుష), శక్తి కలిసి ప్రక్రుతి గా (సృష్టి గా ) మారక ముందే గణపతి ఆవిర్భావం జరిగింది . గణపతి లేదా 33కోట్ల దేవతలు - ఇవన్నీ "చైతన్య -శక్తి" స్పందనలు , అనగా వేర్వేరు  పౌన పున్యా లున్న(frequency)  శక్తి తరంగాలు . ఈ తరంగాలు ఎలా ఉంటాయో మన ఇంద్రియాలకు అందదు . ఈ శక్తి తరంగాల స్పందనను ఒక శబ్ద తరంగం లా, ప్రతిధ్వని లా (Resonance) వినడానికే ద్రష్టలు మంత్ర శబ్దాలను మనకిచ్చారు . అందుకే "మంత్రాధీనం దేవతా "  అని అంటారు మంత్ర వేత్తలు . అంటే అర్ధం , ఆయా దేవతా శక్తులు ఆయా మంత్రాల తరంగాలకు ఆకర్షింప బడతాయి . "గం ...... " అనే శ బ్డా న్ని  శ్రద్దగా  జపం చేస్తూ ఉంటే  గణపతి శక్తి మన నాడీ  శరీరం లోకి ప్రవే శిస్తుం ది . కానీ , ఒక షరతు -మన శరీరం ,నాడులు అన్నీ శుద్ది గా ఉండాలి . లేకుంటే ధనాత్మక శక్తులకు ,మనలో పేరుకు పోయిన ఋణాత్మక శక్తులకు ...

అమాయకత్వ మే ఆనందం

Image
  చైతన్యం అనగా శుద్ద సత్యజ్ఞానం . దానికి శక్తి తోడైతే అప్పుడు సృష్టి జరుగుతుంది . జ్ఞానం లేని శక్తి అత్యంత ప్రమాదకరం . అలాగే శక్తి లేని జ్ఞానం నిరుపయోగం .  సహస్రారం నుండి జ్ఞాన ధార పడుతూ ఉంటే శక్తి సక్రమ మైన పంధాలో పయ నించి లోక కల్యాణం  జరుగుతుంది .  అంటే మానవ సమాజం, ఈ భూమండలం ,ఖగోళ అంతరిక్ష మండలం ,సమస్త ప్రక్రుతి సమతుల్యత లో ,ఓ విధమైన సుఖ స్పందనా స్థితిలో ఉంటాయి . మూలాధారంలో నిద్రాణం లో ఉన్న శక్తిని మేల్కొలిపి దానిని ఊర్ధ్వ ముఖం గా పయనింప చేయడమే సాధకుని కర్తవ్యం . మన మూలం అమాయకత్వం . పుట్టినప్పుడు మనిషి చాలా అమాయకం గా ఉంటాడు . చేసే పనుల్లో ఎలాంటి స్వార్ధం ఉండదు . సమాజం ,పరిస్థితులు ,కోరికలు మనిషిని కరకు కసాయి గా మార్చి వేస్తాయి . మూల శక్తి కేంద్రం చుట్టూ ఒక దుర్భేధ్యమైన అహంకార పూరిత కోట నిర్మింపబడి ఉంటుంది . విశ్వ శక్తి లో ని భాగమైన భూ కుండలినీ మనిషి మూలం లోకి చొచ్చుకు  వెళ్ళా లంటే చుట్టూ పేరుకొన్న కరడు గట్టిన కోరికల స్వార్ధపు కోట బద్ద లవ్వాలి . మనిషి-ధర్మ, మో క్షాలను  నిర్లక్ష్యం చేసి ,కేవలం అర్ధ ,కామాల కోసం వెంపర్లా డుతూ...

మత దోపిడీ

ప్రజలను,సంఘాన్ని,దేశాన్ని  మతం పేరుతో చీల్చి వేస్తున్నారు .  మానవ సంబంధాలకు ,దేశ ప్రగతికి మతం ముడి పెట్ట కూడదు అని రాజ్యాంగం లో వ్రాసుకొని అడు గుఅడు గు నా అదే మతాన్ని అడ్డు పెట్టు కొని చేసే అన్యాయపు చర్యల వలన ప్రజలలో మత పర మైన ఘర్షణలు ,విద్వేషాలు రోజు రోజు కీ పెరిగి పోతున్నాయి . అమాయక ప్రజలు బడా రాజకీయుల చేతిలో కీలు బొమ్మలై , వారు వేసే సంక్షేమ  బిచ్చానికి  ఎదురు చూసే విధం గా సామాన్యుల బుర్రలను వాష్ చేస్తున్నారు . ఏ మతాన్ని ఐనా నిజం గా ఆచ రించే వారు ఎప్పుడూ  సద్బుద్ధి తో నే ఉంటారు . కానీ, మత పెద్దలు ,  రాజకీయ పార్టీలు...   డబ్బుకి అమ్ముడు పోయే  అమాయక ప్రజల పేదరికాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు ,ఉగ్రదాడులు చేయిస్తున్నారు . అలాగే ,మానవ హక్కుల పరిరక్షణ పేరుతో ఉగ్రవాదులకు  ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాచమర్యాదలు,కారుణ్య వరాలు కురిపిస్తున్నారు .  మూగజీవాలకు ఉన్నపాటి రక్షణ మన దేశం లోని ఆడు వారికి లేనప్పుడు ,ఈ మానవ హక్కుల సంఘాలు  ఏం చేస్తున్నాయ్ ? పార్టీలకు అతీతం గా మనదేశం లో జరు...

Is astrology a real science?

Image
                                తారా తెర పై గ్రహాలు ఆడించే నాటకానికి మనుషు లే పాత్రధారులు. కారణ  కోశం లోని సవా లక్ష కర్మలలో (సంచిత కర్మ )చాలా కొద్ది శాతం ప్రారబ్ద కర్మ గా  నిర్ణయింప బడి ,దానికి అనుగుణ్యం గా శరీరం,సామాజిక వ్యవస్థ,కుటుంబం  ఎన్నిక చేయ బడుతుంది . ప్రారబ్ద కర్మలను అనుస రించే మన "మానసం " అభివృద్ధి చెందుతుంది .  "బుద్ది కర్మాను సారిణి " అని రుషి వాక్యం .  మానసానికి హార్డ్ వేర్ మెదడు . ఆపరేటింగ్ సిస్టం (OS)సాఫ్ట్ వేర్ కారణ కోశం .  మానసం అంటే అది ఓ గతితార్కిక వ్యవస్థ . దానిలో వివిధ అంతరాలు (Levels)ఉంటాయి . చిత్తం అనేది "ROM"(read only memory) లాంటిది . అందులో నే ప్రారబ్ద కర్మ కి అనుగుణ్య మైన సహ జాతాలు (inherent traits) ఉంటాయి . అలాగే మెమొరి ఉంటుంది . ఆలోచన చేసే మనస్సు (algorithmic processor)ఉంటుంది.  ఆలోచనలు మంచివా  చెడ్డవా ?పాప పుణ్య హేతువులా ?  సమాజానికి చెరపు  చేస్తాయా ?- అనే విచక్షణ చేసే బుద్ది(gatewa...

ఏంటి మనిషి గొప్ప ?

Image
కీటక జన్మకి ఏ గమ్యం ఉందో మనిషికీ అంత  కంటే గొప్ప గమ్య మేమీ లేదు . ఏంటి మనిషి గొప్ప ? కాస్త దానికి కూస్త దానికి కొంచెం ఎక్కువ మోతాదులో గందరగోళం పడి  పోయే మనస్సు తప్ప . ప్రతి విషయాన్నీ ముందుగా నే ఉహించు కోవడం ,ప్రతి మాటలో తన దృక్పధానికి అనుగుణ్య మైన అర్ధాన్ని వెతుక్కోవడం , ప్రతి దృశ్యం లో తన అభిరుచి ని మాత్రమే గుర్తించ గలగడం - ఇవన్నీ మనిషి కి వరాలు -శాపాలు . నిజాన్ని గ్రహించ నివ్వ కుండా చేసే ఈ మాయ కి కారణం ఎన్నో చిక్కు ముళ్ళు ఉన్న మనస్సే . మనిషి జాతి ఒక్కటే మహోన్నత మైనది.  పరిణామం లో మనిషి ఎన్నో మెట్లు ఎత్తున ఉన్నాడు , మనిషి జన్మకి లక్ష్యం ఉంది -- ఇలా ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి . తరచి చూస్తే ఈ సృష్టి లో ప్రతి ప్రాణికీ ప్రాధాన్యత ఉంది . ఏది లేక పోయినా సృష్టి అసంపూర్ణమై , ప్రక్రుతి సమ తుల్యత దెబ్బ తింటుంది .  తనొక్కడి కోసమే ఈ సృష్టి అని, మనిషి విర్ర వీగుతూ ప్రకృతిని, తోటి ప్రాణులను అతలా కుతలం చేస్తున్నాడు . అవును చేస్తున్నాడు . ఎందుకు చేస్తున్నాడు ?  ఏ  ప్రాణి అయినా తన జాతిని విస్తరింప చేసు కొంటుంది . దానిలో తప్పొప్పులు ...

మానవ సంబంధాలు

Image
మనిషి(ఆత్మ) జీవితం ఓ వ్రుత్తం(పూర్ణం).  మనకు వ్యవహారికం గా పైకి కనిపించే వి- పుట్టుక, జీవనం,మరణం మాత్రమే. చావు పుట్టుకల మధ్య నున్న కాస్త జీవనం ఎన్నొ అవసరాలతొ ముడిపడి ఉంటుంది. ఇచ్చి పుచ్చు కోవడాలు అందులో అత్యంత ముఖ్య మైనవి. మానవ సంబంధా లన్నీ వీటి పై ఆధారపడి ఉంటాయి.మానవ సంబంధాలు మానవ సంబందా లన్నీ హార్దిక సంబంధాలు కావు,అవి కేవలం ఆర్ధిక సంబంధాలే "  అన్నాడు మార్క్స్ . ఏవైనా ప్రాణి  ఇంకో ప్రాణి  పై ఆధార పడ వలసిందే . పరస్పర సహకారం అత్యంత అవసరం . ఎందుకు మనిషి కి ఇవన్నీ? అన్ని ప్రాణుల లాగా నే మనిషికి కూడా కనీస అవసరాలు ఉంటాయి . అవి తీరా లంటే మిగతా వాటి సహకారం అవసరం . మిగతా ప్రాణుల కంటే ,మనిషికి భావ తృప్తి ,ఆలోచనా వ్రుత్తి , బుద్ది బలం  ఎక్కువ . కాబట్టి , మనిషిలో మనస్సు చేసే హడావిడి ఎక్కువ . ఎందు కంటే తన నిజ రూప మైన ఆత్మ ఒక సంపూర్ణ ఆనంద స్థితి అనే సత్యం తెలియక, మనిషి మనస్సు నిరంతరం ఏదో ఒకటి కావాలని కోరు కుంటుంది. తను అసంపూర్ణం గా ఉన్నానని తలుస్తుంది. తను పూర్ణ స్థితి కి చేరు కొని ఆనందానుభూతి పొందా లంటే తనలోని అసంపూర్ణత లేకుండా పో...

దేవుడు చెప్పిన కధ .(God's Story)

Image
                                                       ఓం గణపతయే నమః నేను దైవాన్ని అయినా,  మనిషి నమ్మకానికి విలువ ఇచ్చి తొలుత గణేశు ని తలచి , నా కధ చెబుతున్నా . నా స్థితి , అనంత మైన శక్తి తో అనంత మైన ప్రజ్ఞ తో, దేశ కాలా లకు అతీత మైన ఎలాంటి గుణములు లేని స్థితి. అనంత  చైతన్యంతో, కేవలం ఎరుకతో ఉన్న " నేను"   ఓ సంకల్పం తో శక్తిని ఉద్భవింప చేశాను . ఈ శక్తి సంచయాన్ని జగన్మాత అని మీరు పిలుస్తారు . శక్తి ఒక్క సారిగా విస్ఫోటనం చెంది క్రమం గా పదార్ధం గా మారడం మొదలు పెట్టింది . శక్తి తునకలు పర పరమాణు వులుగా(sub atomic particles &waves) , తర్వాత పరమాణువులు గా(atoms) , ఆ తర్వాత  అణువులు గా(molecules) , పెద్ద పెద్ద అణు  సముదాయాలుగా(crystal,mineral aggregations), విస్తరిల్లుతూ అంతరిక్ష ప్లాస్మా గా, ఖగోళ ,నక్షత్ర గ్రహ మండలాలను , వాయు ధూళి ధూసరిత నెబ్యూలాలు గాను ,క్వాజర్ లు గా విస్తరిల్లుతూ ...

progressive expansion of consciousness.

Image
మనిషి చిన్న పిల్ల వానిగా ఉన్నప్పుడు  శరీర గత ఎరుకే ఉంటుంది . శరీరం  తప్ప మరేదీ తెల్వదు. ఆకలి,నొప్పి లాంటి శరీర గత బాధలు తెలుస్తాయి .  సిగ్గు , ఎవరైనా చూస్తార నే జంకు , బిడియం లాంటి మానసిక భావాలు ఉండవు . కొంచెం పెద్దైన తర్వాత ఎరుక మానసిక స్థాయికి,ఆ తర్వాత విద్యాబుద్దులు నేర్చిన తర్వాత ఎరుక, "బుద్ది" గత మవుతుంది. అప్పుడే సిగ్గు,లజ్జ, బిడియం ,ఎవరే మను కొంటారో  అనే భావాలు పొ ట మ రిస్తాయి . మనస్సులొ కలిగే భావాలను గుర్తించి,వాటి పై ఆలోచన చేయడం ,అవసర మైన వాటిని సాధించు కోవడానికి బుద్దిని ఉపయోగించడం చేస్తారు.ఆ పైకి ఎరుక వెళ్ళదు. ఎందు కంటే ,అప్పటికే బాహ్య పర మైన ఆకర్షణలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి . ఆకర్షణ తో బంధాలు ఏర్పడ తాయి . ఎరుక విస్తారం చెందా  లంటే , దానికి అంతర్యానం,అంటే మనస్సుని సూక్ష్మ తరం చేయాలి . అంటే మానసిక స్పందనలను చాలా తక్కువ చేయాలి. అనగా ఆలోచన లేకుండా మనస్సుని ఆధీనం చేయాలి. మనస్సు లొ ఆలొచన రాకుండా చేయాలీ అంటే,ఎలాంటి సంకల్పాలు ఉండ కూడదు. మనిషికి సంకల్పాలు ఎందుకు వస్తాయి? అంతర్గతం గా ఉన్న (కారణ కోశం )వాసనా గుణాల వలన ల...

పరివర్తన

వడియం చాలా ఆందోళనగా ఉన్నాడు . దగ్గర లోనే ఉన్న డాక్టర్ ని సంప్రదిస్తే మందులిచ్చి మళ్ళీ వారానికి రమ్మని సలహా ఇచ్చాడు . అలా చాలా వారాలు గడిచినాక ,ఆందోళన తగ్గక పోయేసరికి,ఏదో గాలో ధూళో ఐ ఉండొచ్చు భూత వైద్యుణ్ణి కలవ రాదా అని  ఎవరో చెబితే భూత నాధ్ ని కలిసి సమస్య వివరించాడు . భయం పోయే విధం గా నాలుగు మాటలు చెప్పి ,నమ్మకం కలిగే విధం గా  తాయెత్తు కట్టి, అవసర మైతే పెద్ద పూజ చేయాలని చెప్పాడు . అలా కొన్ని రోజులు గడిచాయి . ఆందోళన కొన్నిరోజులు తగ్గుతుంది . కానీ మళ్ళీ వస్తుంది . ఈ లోపల  ఎవరో స్వామి గుళ్ళోకి వచ్చారని చెబితే వెళ్లి ఆయనను కలిసాడు . స్వామీ అడిగాడు,దేని వలన ఆందోళన పడుతున్నావు?దేని కోసం ఆందోళన పడుతున్నావు ? అని .  ప్రతి విషయానికి ఆందోళన వస్తుంది . అనుకొన్నది జరగక పోయినా, కొత్త వారితో కలవాలన్నా , ఎవరే మన్నా  ఆందోళన గా  ఉంటుంది . రేపెలా ఉంట దో అనే బెంగ గా ఉంటుంది -చెప్పాడు వడియం . జరిగి పోయిందీ  ,జరగ బోయే దానిని గురించి ఆలోచన మానేయ్. ఇవ్వాళ ,ముఖ్యం గా ఇప్పుడు ఈ క్షణం గురించి మాత్ర మే ఆలోచన చెయ్ . ఆలోచన అంటే రెండు విధాలు గా ...

అవిద్య

Image
సనాతన ధర్మ సూత్రం ఒక్క పరా విద్యే కాదు,అపరా విద్య ని కూడా ఎలా ఆచరిం చాలో చెప్పింది . అపరా విద్య అనేది ఇహ లోక సంతోషాలకు ,శాంతికి ,పుష్టికి , స్వస్థతకు పని కొచ్చే విజ్ఞానం . సనాతన జ్ఞాన వాహిని లో ఉన్న ప్రతి అక్షరానికి వ్యావహారిక ,ఆధ్యాత్మిక ,తాంత్రిక అర్ధాలు -వీటినే అధిభౌతిక ,అధిఆత్మిక ,ఆధిదైవిక  వ్యాహృతులు ఉంటాయి . మనం ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోవాలి - మన ప్రపంచ మంతా  "సత్యానికి" వేసిన మేలి ముసుగు. ఆ ముసుగు కి ,మన ఆలోచనా అనుభూతులను బట్టి రకరకాల పేర్లు  పెట్టి ఆ ముసుగు నే మనం "నిజం" అనుకొ ని దానితో మమేక మై పోతాము . ఈ మమేక మవ్వడం కూడా మనుషులలో వివిధ విధాలుగా ఉంటుంది . అందరూ ఒకే రకం గా ఆలోచించరు . అందరూ ఒకే రకం గా మమేక మవ్వరు . అంటే మనుషులలో అమాయకత్వం , అహంకారం ఒకే విధం గా ఉండదు . అమాయకత్వానికి ఒక ఉదాహరణ : హైడ్రోజన్ ,ఆక్షిజన్ అనే రెండు మూలకాలు కలిసిఉన్న అణువుని మనిషి నీరు అని అంటున్నాడు . సామాన్య మానవుడు చూసేది నీటినే గానీ ,ఆ రెండు మూలకాలను కాదు . దీనినే శాస్త్రజ్ఞులు అమాయకత్వం(ignorance) అని ,తత్వ వేత్తలు మాయా ముసుగు (veil)అని అంటారు . ఆ...

యోగ చింతన

Image
అనంత మంతా ప్రారంభ మయ్యింది ఒక్క బిందువు నుండి . దీనినే శాస్త్రజ్ఞులు  BigBang  అంటారు . పరిణామం సాగుతూ నే ఉంటుంది . మనిషి శారీరకం గా కంటే మానసికం గా ఎక్కువగా పరిణామం చెందే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు . అంటే,మిగతా అవయవాల కన్నా , మనిషి మెదడు ఎక్కువగా పరిణామం చెందడానికి అవకాశం ఉంది . కండరాలు, నరాలు అనేవి ముఖ్యం గా రసాయన విద్యుత్ పై ఆధారపడి పనిచేస్తాయి . మన కణాలు ఆక్సిజన్ ,కార్బన్,హైడ్రోజన్,నైట్రోజన్  ల పై అమితం గా ఆధార పడి  ఉంటాయి . ఈ భూమి మనందరి కన్నతల్లి . ముందు యుగాలలో ఏ  భూమి మన తల్లి అవుతుందో తెలియదు . ఈ సృష్టి ఆగేది కాదు . మనిషి మనస్సు కూడా అంత  తేలికగా ఆగేది కాదు . మనిషి మనస్సులో ఆలోచన ఉన్నంత వరకే ఈ మాయా ప్రపంచం . ఒక్కసారి ఆలోచన ఆగిం దీ అంటే మాయ పటా పంచ లవుతుం ది . మనిషి సంతోషం గా ,సంఘం ప్రశాంతం గా ,దేశం సుభిక్షం గా ఉండాలంటే ఏం చేయాలి  ? ప్రతి వ్యక్తీ కొన్ని నియమాలు పాటించాలి . కొన్ని బాధ్యతలు మోయాలి . దేశ  సంపద సరి సమానం గా పంచే వ్యవస్థ ఉండాలి . సమాజం లో పాడి, పంట, వినోదం, విహారం ---ఇవన్నీ స...

ఆత్మ సంవాదం

సత్యాన్ని ఎవరు ధరిస్తారు? ఎవరైతే తన నిజ స్థితిని గ్రహించి,జరిగేవన్నీ ప్రక్రుతి చేస్తుందని, తన నిజరూపమైన ఆత్మ నిమిత్త మాత్రమని   నమ్ముతారో వారే సత్యధరులు.   ప్రక్రుతి అనగా ఏమిటి? మార్పు చెందే ది ప్రక్రుతి. అనగా పదార్ధ రూపం లో ఉన్నవన్నీ -శరీరం,మనస్సు,సంఘం   ఇవన్నీ ప్రక్రుతే.   ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టాయి ? శక్తి నుండి .   శక్తి ఎక్కడినుండి పుట్టింది ? చైతన్యం నుండి .   చైతన్యం ఎక్కడినుండి పుట్టింది ? చైతన్యానికి పుట్టుక అనేది లేదు . అది నిరంతరం ఉండే అజరామర మైన స్థితి .   దానికి ఆది అంతము లేవు కాబట్టి దానిని "సత్యం " అని అంటారు .   చైతన్యం - నిత్య సత్యం - సచ్చిదానందం    - దైవం -పురుష -పరబ్రహ్మ ---- ఇవన్నీ పర్యాయ పదాలు .   ఆత్మ ఎలా ప్రక్రుతి కి బందీ ఐయింది ? ఆత్మ బందీ అవ్వడం కాదు . ఆత్మే ప్రకృతిని పరివేష్టింప చేసు కొంటుంది .   ఒక విధం గా అవగాహన చేసు కోవాలంటే, ఆ రెండూ ఒక్కటే - కాబోతే భిన్న వ్యాహృతులు .   "అర్ధ నారీశ్వ   రం   -వాక్ అర్ధాలు - శి   వశ   క్తులు -లింగయోనులు ...