Posts

Showing posts from December, 2012

"నేనెవరిని ? ఈ జన్మకి గమ్యం ఏమిటి? Who am I ?

Image
"నేనెవరిని ? ఈ జన్మకి గమ్యం ఏమిటి?  నేను శరీరం ,మనస్సు ,బుద్ది ,ప్రాణం ఇవేమీ  కాదు . మనస్సు మొట్ట మొదట నేను అనే ఆలోచన చేసింది. అదే అహం . ఆ తర్వాత , ఎన్నో రకాల  ఆలోచనల తో ఈ ప్రపంచాన్ని నిర్మిస్తుంది . చింతలతో , ఆశా నిరాశల నడుమ ఊగిసలాడే మనస్సుతో ,కాసేపు సంతోషం ఆ వెంటే దుఖం ,ఇంతలోనే నిర్వేదం ,అంతలోనే ఉత్సాహం - ఈ ద్వందాలకు అంతమే లేదా? కష్టాలొచ్చినపుడు ఇంకొకరిపై ఆధారపడి లేదా దేవుని పై భారం వేయటం తాత్కాలిక వైరాగ్యపు ఆలోచనలతో సోమరితనంతో  పలాయన వాదాలు చేయటం సమస్యలను దాటవేసి 'నా కర్మ ' అని అనుకోవటం - మనందరికీ మామూలే ! నీ సమస్యలకు సమాధానం నువ్వే వెదుక్కోవాలని కష్టాలు ,సుఖాలు మన మనస్సులోని కండిషనల్ ప్రోగ్రాంస్ అని   శక్తి వంచన ,ఆత్మ వంచన లేకుండా కష్ట పడాలని ఎవరి పై ఆధారపడరాదని ,భావ దాస్యం చేయరాదని తెలుసుకొని నమ్మి ఆచరించడమే - మన పని, మన గమ్యం. మనిషి తను ఆనందపడుతూ వీలైతే తోటి వారిని ఆనందంగా ఉంచుతూ , జీవన ప్రయాణం చేయడమే గమ్యం . శక్తి కొద్దీ సత్కర్మలు, స్వకర్మలు చేయాలి. మనస్సుని ఉత్సాహంగా ,సంతోషంగా ఉంచుకోవాలి . పూజ , అంటే అర్ధం ఏమిటి ? ...

సంపూర్ణ సత్ చిత్ ఆనందం

Image
ఏది జ్ఞానం ? ఈ కనిపించే జగత్తు అంతా "మిధ్య " - { incomplete reality /broken reality} అని తెలుసుకోవడమే జ్ఞానం . ఈ  జగత్ సత్యం కాదు ,మాయ / మిధ్య అని ఎలా చెప్పగలవ్ ? ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని వదిలి పెట్టి ఇంకా ఏదో ఉంది అనే భావం మనిషి కి ఎందుకు వచ్చింది ?    ఈ  విశాల విశ్వమ్ లో ఒక బిందువు , ఒక గీత  ఏక మితి (unidimension) లో ఉంటే , రెండు  గీత ల మధ్య ఉన్న ప్రదేశం రెండు మితులలో (two dimension ) , అదే  ప్రదేశం ఎనిమిది దిక్కులకు వ్యాకో చించినపుడు మూడు మితులలో (three dimension)ఉంటుంది . మనిషికి ఈ  మూడు మితుల జగత్ మాత్రమే అవగాహనకు వస్తుంది . కానీ 14 మితుల (14-dimensioned universe) జగత్ ఉందని ఋషులు చెప్పారు . అందుకే  ఈ   మూడు మితుల     జగత్ ని మిధ్యా జగత్ (incomplete universe/ broken truth) అంటారు . కనపడే జగత్ అంతా  అసంపూర్ణం . చాలా చిన్న కల లాంటి విషయం . అసలైన జగత్ ఇంకా ఎంతో ఉంది . దాని లక్షణం సత్యము , దాని స్థితి ఆనందం .దానికి ఏ రూపమూ ఉండదు .  అలాగే ఇంకో ఉదాహరణ - భూమి మీద ఉన్న మ...

ఆత్మ - పరమాత్మ

Image
ఎందుకు ఆత్మ పరమాత్మ లో కలిసి పోవాలి ? దానిలో ఆనందం ఉందా? అది ఎలా సాధ్య పడుతుంది ? మనిషి ఎందుకు ఆనందం కోసం  వెంపర్లాడు తాడు ? ఎందు  కంటే ఆత్మా ,పరమాత్మ లక్షణం నిరంతర సచిదానందం . ఈ  జగత్ అంతా ఓ నిరంతర నాటకం . ఆడించేది దైవ శక్తి . ఆడే వారు కూడ ఆత్మ లుగా ప్రతి బింబి స్తున్న  దైవమే ! ఆత్మ స్వరూపులైన మనుషులు నిజం (స్వ స్వరూపం ) మరిచి , ద్వంద భావాలతో కొట్టు మిట్టాడ ట మే మాయ అని అద్వైతు లంటారు . ఆత్మ ,పరమాత్మల లక్షణాలు ,సామర్ధ్యం వేరు  వేరు గా ఉంటాయని ద్వైతు లంటారు . ఎలా అవగాహన చేసు కొన్నా ఆత్మ పరమాత్మలు అంతా  ఒక్కటే అన్న అనుభూతి లో  మన హృదయం స్థిర పడట మే మనిషి జీవన పరమావధి . కాంతి ఒక అద్దం ద్వారా ప్రస రి స్తూ ఒక సుస్థిర వేగం తో ప్రయాణి స్తున్నప్పుడు  దాని బింబం చిన్న సూది మొన స్థాయి నుండి పెరిగి పోవటాన్ని విశ్వ ఆవిర్భావం గా అర్ధం చేసు కొంటే , ఆ కాంతి పరమాత్మ గా ,ఆ అద్దం  మాయ గా భావించు కోవచ్చు . నేటి జన్మ లో ఉన్న  సహజాత   లక్షణాలు ,ఆలోచనా  సరళి ,వ్యక్తిత్వం , శరీర నిర్మాణం ...

మన కర్తవ్యం .

మనిషి లో ఎందుకు ఇంత ఆక్రోశం ,కాటిన్యం ,క్రౌర్యం ,ఏహ్యం పెరిగి పెచ్చరిల్లి సమాజాన్ని అతలా కుతలం చేస్తున్నాయి ? మనం ఏం చేయాలి ? కావలసింది దొరకక పోవటం , దొరికింది తృప్తిని ఇవ్వకపోవటం , అది మిగతా వారికి దక్కి  సమాజ అసమానత కు దారి తీయటం , వ్యసనాలకు వివేక విచక్షణలు నశించి విశ్రుంఖలత కు దారి తీయటం , ధన ,మాన ,ప్రాణాల మీద అమితమైన ఆసక్తి , కాంతా కనకాల పై విపరీత అనురక్తి , ---- ఇలా మానసిక  అసమ తుల్యత మనుషులను  పూర్తిగా మృగ స్థాయికి దిగ జార్చు తుంది . నిస్సహాయులపై , స్త్రీ లపై దాడి , మాన భంగాలు మితి మీరి సమాజం  ఆటవిక నికృష్ట త కు ఆలవాలమై పోతుంటే ,ప్రభుత్వం , యువత చేతులు    కట్టుకొని చూస్తుంది .  ధర్మ ,న్యాయ దృక్పధం ఉన్న  నాయకులు కరవై ,  యువత మత్తు పదార్ధాలకు ,సోమరి తనానికి బానిసై , సమాజం లో ధనిక ,పేదల తేడా పదింతలై  , దేశం అవినీతి కూపం లో కునారిల్లు తుంటే  ఎవరో వస్తారని ఎదురు చూడ టం పిచ్చితనం . ఎదురు తిరిగి పోరాడటం మనిష న్న వాడి కర్తవ్యం .

Welcome to Bharat sanskar sampradaya.

 Sanskaras (engraved characters in sub-conscious mind ) are the imprints left on the subconscious mind by experience in this or previous lives, which then color all of our present life, one's nature, responses, states of mind, etc. In Indian philosophy, "Sanskar" is the value in human life. sanskaras in another meaning, conducting rituals at every transition stage of human life.Each important milestone of a Human life is to be celebrated by undertaking a particular Samskara wherein the significance of that milestone is ritualistically conveyed. For Indians, life,way of life and death are events of celebration.  Milestones include transitions from puberty , year 7 to high school, coming of age , marriage and death   As per hindu way of life, 16 Samskaras are used to conduct. The greatness and well all round acceptability of Hindu sanskar is due to  scientific,materialistic and spiritual significance behind  every sanskar   sampradaya ...