దైవం అంటే ఒక రూపమో, గుణమో, దృశ్యమో ,శబ్దమో కానేకాదు.
దైవం అంటే ఒక రూపమో, గుణమో, దృశ్యమో ,శబ్దమో కానేకాదు. మనిషికి కనబడేది, కనబడనిదీ, అవ్యక్తమూ , వ్యక్తమూ స్సర్వమూ దైవమే . అనగా నేనూ, నువ్వూ , మనందరమూ , ఈ సమస్త స్థావర జంగమ ప్రక్రుతి , విష్వఅంతరాళము ,విశ్వము ,అణువు, పరమాణువు, క్వార్క్ లు , శక్తి కాసారము, కంపించేది , కంపనం లేనిదీ ప్రతిదీ దైవమే . చిన్న విత్తనం లో ఆయా వృక్షం తాలూకు సమస్త సమాచారం(జ్ఞానం) ఎలాగైతే సూక్ష్మ స్థాయిలో ఉంటుందో ఈ బ్రహ్మాండం తాలూకు ఈ సృష్టి లో కేవలం ఒక్క శాతాన్ని కూడా గ్రహించలేని జ్ఞానేంద్రియాలున్న మనిషి ఏవేవో ఊహిస్తాడు,భావిస్తాడు,ఆలోచిస్తాడు,సిద్ధాంతీకరిస్తాడు , ప్రయోగాలు చేస్తాడు , ఆ క్రమంలో ఎన్నెన్నో సాంకేతిక టూల్స్ ను వినియోగిస్తాడు , పదిమందీ ఒప్పుకొంటే అదే నిజమని ఉద్ఘాటిస్తాడు , గ్రంధాలు రచిస్తాడు ,భాష్యాలూ, కారికలు ,సూక్తులతో వివరిస్తాడు కూడా ! ఒక విధమైన 3- డైమెన్షన్ లో వ్యక్తీకరింపబడిన ఈ భూ -భువః -సువర్లోకలుగా చెప్పబడే సౌరమండలం ,పాలపుంత లో ఎన్నెన్నో రకాల జీవులు ఉన్నాయి. మనకు తెలియని డైమెన్షన్లు ఎన్ని ఉన్నాయో? నిర్గుణ నిరాకార నిరామయ...