Posts

Showing posts from June, 2020

ఏరువాక పున్నమి

ఏరువాకా సాగాలో ... ఏరు నిండే  వాన  కురియాలో  బోదు నిండా పారాలి ... నాగలి కర్రు కదలాలి  చాలు నిండి పోవాలి ... విత్తు మొలకలెత్తాలి  పుడమితల్లికి మొక్కులు మొక్కి  కాడెద్దులకు కసవు వేసి  హలాల నుదుట బొట్టును పెట్టి  కఱును దింపి నేలను దున్ని  ఏరువాకా సాగాలో ... ఏరు నిండే  వాన   కురియాలో ...  రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈనాటి తిథి వివరణకు సంబంధించి వృషభ పూజ, హల ప్రవాహ వంటి పదాలు ఉన్నాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు.  ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజింస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో...