Posts

Showing posts from September, 2014

తిమిరం తో సమరం . అదే నవరాత్రి ఉత్సవ పరమార్ధం .

Image
పరా ప్రక్రుతి కి ఎలాంటి గుణాలు ఉండవు .  సత్వ ,రాజస ,తామస గుణాల కలయిక వలన అపరా ప్రక్రుతి సృష్టింప బడుతుంది . ఈ మూడు గుణాల వలన సకల స్థావర - జంగమాలు ఎలా ఏర్ప డ్డాయో ,అవే మూడు గుణాలు  విభిన్న నిష్పత్తి లో కలియడం వలన  పరిణామ పరంగా ఉన్నత జీవులలో  అరిషడ్వర్గాలు , మనస్సు ,చిత్తము ,బుద్ది ,అహంకారం ఉద్భ వించాయి . అమాయకత్వం(innocence) -అజ్ఞానం (ignorance)ఇవి రెండూ వేర్వేరు లక్షణాలు . రాత్రి అంటే అజ్ఞానం . అనగా అజ్ఞానం తో మసకబారిన మనిషి,తనలోని 3 శక్తులను ఉద్దీ పింప  చేసుకొని ఆ అజ్ఞానాన్ని రూపు మాపు కోవడానికి చేయ వలసిన సాధన కు , ఆశ్వీజ మాస శుక్ల పక్షం సరైన సమయం అని ఋషి వాక్యం . 9 రకాల లంపటాలు - 6 భేద భావాలు (అరిషడ్వర్గాలు ), కల్మష పూరిత మానసం , చిత్తం ,అహం -మొత్తం ఈ 9 రకాల బలహీనతలతో యుద్ధం చేయడమే నవరాత్రి దీక్ష . ఇచ్చా శక్తికి  లక్ష్మి ,జ్ఞాన శక్తికి సరస్వతి ,క్రియా శక్తికి దుర్గ - 3రకాల శక్తి కి ప్రతిరూపా లైన మువ్వురినీ ఆరాధించడ మంటే , ఆ 3 శక్తులను మన శరీరం, మనస్సు ,ఆత్మ పైకి ఆవాహన చేసు కోవ డమే . అదే శ క్త్యుపాసన ...

పని చేద్దాం ...

మనిషి బలమూ ,బలహీనతా మనస్సే .  ఎదుటి వాళ్ళు కష్టం లో ఉన్నప్పుడు మనస్సు కదిలి పోవడా న్ని దయ ,జాలి అని అంటాము . మనమే కష్టాల్లో ఉన్నప్పుడు మనలో కలిగే బాధ ని తలచు కొని కుంగి పోవడం  బలహీనతే(weakness)  గానీ , అందరూ భావిస్తున్నట్లు సున్నితత్వం కాదు . సున్నితత్వం (sensitivity)అంటే ఎదుటి వాడి కష్టానికి చలించి సాయం అందించడం . ఎక్కువ శాతం , మనిషి జాలి(pity) పడతాడు గానీ సాయం(help) చేయడానికి ఉత్సాహం చూపడు . కొన్నిసార్లు తన కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి సాయం చేస్తాడు గానీ ,పేద వారికి చేయడు . ఎందు కంటే మళ్ళీ తిరిగి సాయం చేస్తారని . ప్రతిఫలం లేకుండా మనిషి సాధారణం గా ఏ పనీ చేయడు . కర్మ ఫలం పై ఆపేక్ష పెంచు కొంటాడు . ప్రతిఫలం గారంటీ గా వస్తుందని కర్మ సిద్దాంతం చెబుతున్నా మనిషి నమ్మడు . నమ్మకం లేన ప్పుడే మనిషికి గాభరా ఉంటుంది . మనిషి కర్తవ్యము పని  చేసు కొంటూ పోవడమే గానీ , కర్మ ఫలం పై ఆపేక్ష ఉండ కూడదని గురు వాక్యం . సరే, మనిషి పని చేయాలి . సోమరిగా ఏమరు పాటు తో పలాయన వాది  గా ఉండకూడదు . మరి  ఆ చేసే పని, ఎలా చేయాలి ? మనిషి పుట్టుక , జ...