సదాచారం
సదాచారం అంటే ఏమిటి? ఆచారం అనేది మనిషి తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తాడనే దానిపై ఉంటుంది. అలాగే ఒక కుటుంబం లేదా సమాజం లేదా దేశం లోని మనుషులు దేనికి ఎక్కువ విలువ ఇస్తారో అదే ఆచారంగా మారుతుంది. "సంపద ఉంటేచాలు మాకెవ్వరి సంబంధ బాంధవ్యాలు అక్కరలేదు."---అని కొందరు స్వార్ధపూరితులు . అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తాం . --- మరొకరు. --- తామస త్రాష్టుడు పక్కనోడు ఎండిపోతే చాలు,మేమెలా ఉన్నా ఫర్వాలేదు. ... మాత్సర్యం తో మసకబారిన వాడు. స్నేహం కోసం , పొరుగువాడి కోసం సాయం చేస్తాం. --- సాత్వికుడు ప్రేమకోసం మేమెలా పోయినా ఫర్వాలేదు. ... త్యాగశీలి! దేశంకోసం మా ప్రాణాలు సిద్ధం. ...దేశభక్తులు . ఇలా మనుషులు రకరకాలుగా తాము ప్రగాఢంగా నమ్మేవాటికోసం పాటుపడుతూ ఉంటారు. ఆచారాన్ని బట్టి ఆయా మనుషులు / దేశం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత నిస్తారో అర్ధం చేసుకోవచ్చు. కానీ మహర్షులు సదాచారం అనగా వ్యక్తికీ, సమాజానికి శ్రేయోదాయమైన దే తప్ప మరోటి కాదని రకరకాలుగా ప్రవచించారు. బలమైన సంకల్పం తో నైపుణ్యం జోడించి కృషి చ...