Posts

Showing posts from December, 2020

మానవ జన్మ లక్ష్యం - సాధన

Image
ఓమ్ ...  ప్రణవ నాదం తోనే  సృష్టి ఆరంభం! బిందువుగా ఉన్న సత్య జ్ఞాన ఆనందము , అనంతంగా వ్యాపించి సత్య జ్ఞాన అనంతం బ్రహ్మ గా భాసించడమే సృష్టి!  అలాగే సృష్టిలో ఏది చూసినా అణువు నుండి కణము వరకు,పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఒకే రకమైన నిర్మాణం చూడవచ్చు! సింపుల్ గా చెప్పాలంటే ,సృష్టి విన్యాసానికి ఒక నమూనా చూపాలంటే మానవదేహాన్ని పరిశీలించినా లేదా శ్రీ చక్రాన్ని తరచి చూసినా సరిపోతుంది.  మనం మానవులం కాబట్టి మానవ దృక్పధం తోనే అర్ధం చేసుకొంటాము. నామ రూప క్రియా విశేషాల మధ్యనున్న లావాదేవీలే  ప్రాపంచికం,సంసారం ,లౌకికమూ ! జీవ జగత్ ఈశ్వరుల మధ్యన కదిలే నాటకమే సంసారం ! వెలుగు నీడల సయ్యాట ఈ  లౌకిక ప్రపంచం!  ఏకైక తత్త్వం , చిత్ సత్ అసత్ అనే త్రిపుటి గా భాసించడమే సృష్టి! ఉన్నదొక్కటే తత్త్వం! కానీ మానవ మనస్సు దానిని విడదీసి చూస్తోంది.  విశ్వ స్థాయిలో మాట్లాడే మనిషి తన ఒంటి నీ,ఇంటినీ పట్టించుకోడు. ఇరుగు పొరుగు వారిని చూసి అసూయ పడతాడు. చూసిందల్లా కావాలని వెంపర్లాడుతూ ఉంటాడు.  కోరుకొని  ,కోపగించుకొని గిజగిజ లాడుతూ ఉంటాడు.  కరుడుగట్టిన వాసనల ప్రేరేపణతో ముస...