మనిషి ప్రతిభావంతం గా ఉండా లంటే ఏం చేయాలి ?
జీవితానికి అర్ధం పరమార్ధం ఉండాలంటారు పెద్దలు . అర్ధం తెలుకోవడానికి ఎవ్వరూ ఇష్ట పడరు . తోచిందేదో చేయడమే తప్ప , ఓ నిర్దిష్ట లక్ష్యం , పధక రచన , కార్యాచరణ అనేవి 90% మందికి ఉండవు . అంతా గాలివాటం ! భగవంతుడు మనిషికి తార్కిక శక్తిని ఇచ్చింది మంచి -చెడు కి తేడా తెలుసు కోవదానికే తప్ప అనవసర మైన ఉసు పోక విషయాలను విస్లేశించ మని మాత్రం కాదు . మనిషికి ఉహ శక్తిని ఇచ్చింది సామర్ధ్యానికి అనుగుణ్య మైన కలలు కనమని ... అంతే గానీ మన సామర్ధ్యానికి అందుబాటులో లేని పగటి కలలు కనమని మాత్రం కాదు . సాధారణ మానవుడు తన విజ్ఞానానికి ఏ మాత్రం సంబంధం లేకుండా చేయగల అత్యంత ముఖ్య మైన కార్యం .... తన శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుకోవడం , తన మనస్సుని సంతోషం గా మిగుల్చు కోవడం ....తన బుద్ధిని పదునుగా అంటే వివేకం తో ఉంచుకోవడం . యుక్తా - అయుక్త విచక్షణ అనేది సంఘ సంక్షేమానికి సంబంధించిన విచక్షణ . ధర్మ -అధర్మ విచక్షణ అనేది ప్రక్రుతి కి సంబంధించిన వ్యవహారం ... మనిషి జన్మకి అర్ధం ఏమిటి ? అర్ధ , కామాలను సాధించు కోవ డ మే మనిషి జన్మకి అర్ధం ! అవి ఎలా సాధించు కోవాలో తెలుసు కోవడమ...