Posts

Showing posts from 2015

బాబూ ... కళ్ళు తెరవండి ..

విదేశీ మిషనరీల మరియు  ప్రపంచ బాంకింగ్ రంగాన్ని గుప్పిటి లో పెట్టుకొన్న యూదు సంస్థల కీలుబొమ్మలైన మీడియా  చానళ్ళు  , మనదేశాన్ని  నానా  కుంభ కోణా లతో నమిలేసిన  కాంగ్రెస్ పార్టీ వారు ,    దేశాన్ని గబ్బు పట్టించిన కమ్యూ నిస్ట్ పార్టీ వారూ  .... మీ జ్ఞాపక శక్తికి జోహార్లు .  , ఇప్పటికి 13ఏళ్ళు క్రితం   2002   లో  గుజరాత్ లో    రెండు వర్గాల మధ్యన  జరిగిన మారణ కాండ ని పదే పదే గుర్తు చేస్తున్నారు . కానీ చిత్ర మేమిటీ అంటే , అలాంటి దారుణ ....కాదు ,కాదు ...  అంత కన్నా దారుణ రాక్షస మారణ కాండలు మనదేశం లో సుమారు 18 చోట్ల జరిగాయి . అదీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ... కానీ ఈ సంఘటనలు మీకు ఎవ్వరికీ గుర్తుకు రావు .  18 సార్లు  జరిగిన మారణ కాండ లు  ఎప్పుడు ? ఎవరు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి ??  ఏ పార్టీ కేంద్రాన్ని పాలించిన టైం లో జరిగాయో మీ కెవ్వరికీ  గుర్తు కు రావా ? ముంబై మారణ కాండ , మల్లియాన  మారణ క...

కార్తీక దీపం

Image
దీపం జ్ఞాన స్వరూపం . భౌతిక పరం గా చూస్తే ,  ఇంధనాన్ని మండిస్తూ వెలిగే దీపం  కాంతి ని , ఆవిరిని విర చిమ్మే అగ్ని శిఖ . పంచ భూతాలలో అగ్ని మాత్రమే  గురుత్వ ఆకర్షణ ను అధిగమించి ,ని ట్ట నిలువుగా ప్రజ్వలిస్తూ  ఉంటుంది . ఎలాంటి మాలిన్యాన్ని ఐనా భస్మము  చేసి శుద్ధి చేయగల శక్తి దీపానిది . బాహ్య దీపం మనలోని అంతర  జ్యోతికి ప్రతి బింబం.  అంతర జ్యోతిని వెలిగించు కొనే సంకల్పం  ఆధ్యాత్మిక సాధనకు తొలి మెట్టు . సంకల్ప సాధనకు అత్యంత అనుకూల మైన సమయం కార్తీకం . అంతర జ్యోతి ప్రజ్వలన  పంచ కోశాలలో ని దుష్కర్మలు భస్మం అవ్వడానికి ఆరంభం . దీనికి ప్రతీకగా బాహ్య జ్యోతుల జ్వలనం ఒక ఉత్సవం లాగ జరుపుకొంటాం . సాధకుడి ని  భగవంతుడికి అనుసంధానం చేసే శక్తి దీపానిదే . యాంత్రికం గా దీపం వెలిగించడం వలన  చీకటిని మాత్రమే పార ద్రోల గలం గానీ , ఆధ్యాత్మిక శుద్ధి జరగదు . దీపం పరబ్రహ్మ స్వరూపమని , ఆ ఆత్మ దీపం అహంకార నిర్మూలన  చేసి అంతకరణ శుద్ధి చేస్తుందని, దీపం అజ్ఞానాన్ని పోగొడుతుం దనే  భావన చాలా ముఖ్యం . ప్రజ్ఞ ...

బీహార్ లో మరణించిన భారతీయత

  లౌకికవాదం ముసుగులో జాతి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న దేశ ద్రోహులు  మెజారిటీ ప్రజల మనోభావాలు ఏమైనా ఫర్వాలేదు .... గంప గుత్త గా వచ్చే మైనారిటీ ఓటర్లను దువ్వే బడా చోర్ లు, ఛారిటీ  ముసుగులో మిషనరీల ఎజండా ని మోసే విదేశీ తొత్తులు , స్వదేశీ జండాని ,ఎజండాని దునిమాడే జియానిస్ట్ ల కను సన్నలలో మెసిలే  ఖతర్నాక్ చానళ్ళు , మనం ఏం తినాలో ,ఏం చదవాలో ,ఎలా ఉండాలో గొంతెత్తి అరిచే మేధావులనే మేత గాళ్ళు ,  కులాలు రాజ్యమేలుతున్న ప్రజాస్వామ్య యుద్దంలో భారతీయత పై రాళ్ళు విసిరే లుచ్చాగాళ్ళు , ఇంతగా కుళ్ళి కునారిల్లుతున్న దేశాన్ని రక్షించడానికి ఒకే ఒక్కడు ముందు కొస్తే , నల్ల మందు ,నల్ల ధనం తో బలిసి కొట్టు కొంటున్న  ఆయిల్ ,ఆయుధాల వ్యాపార ముటాలు  నేడు భారత జాతీయత పై కాలు దువ్వుతుం టే పగలబడి నవ్వు కొంటున్న ఆటవిక మూక లారా ! ఇంకా ఎన్నాళ్ళు కులాలతో ,మతాలతో కుళ్ళి చస్తారు ? ఇంకా ఎన్నాళ్ళు తెల్లతోలు జియానిస్ట్ ల పాదాలకు మడుగు లొత్తుతారు ?  ఇవ్వాళ బీహార్ ,రేపు ఇంకోటి ... ఆటవిక మూకలకు మీ ఒళ్ళు అప్పచెబుతారు .... ఆ తర్వాత వాతలు తేలాయని ఘొల్ల...

మనం -మన ఆహారం .

మన ఋషులు మోక్ష సాధన గురించే కాదు ,ఇహ లోకం లో  సుఖ సంతోషాలతో ఉండా లంటే ఏం చేయాలో కూడా చెప్పారు .వీటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సూత్రాలు . పాంచ భౌతిక శరీరాన్ని రోగాల బారి నుండి ఎలా కాపాడుకోవాలో చెప్పే సూత్రాలను ప్రతి వ్యక్తీ పాటించాలి . నిజానికి రోగాలలో అత్యధిక శాతం జీర్ణ మండలానికి చెందినవే అయి ఉంటాయి . అందుకే మనం తినే ఆహారం ,త్రాగే నీరు స్వచ్చం గా ,సంతులితం గా ,ఉండాలి . ఆ విధం గా మన ఆహార అలవాట్లను తీర్చి దిద్దు కొంటే 80%జబ్బులు అస్సలు రానే రావు . కాబట్టి ,  ప్రజారోగ్య పరిరక్షణ కేవలం వ్యక్తి త్వ మార్పు ద్వారా నే సాధ్యం . ధర్మ సాధనకు ,కర్మ పరిపాకానికి అత్యంత అవసరమైనది మన శరీరం . దీనిని కాపాడు కోవడానికి కొన్ని నియమాలు పాటించాలి . మనిషి , ప్రక్రుతి కి ఎంత దగ్గరగా ఉంటె అంత మంచిది . అంటే ,ప్రకృతికి విరుద్ధమైన వాటిని మనం ఏమీ తీసుకో కూడదు . అలాంటి పనులు చేయ కూడదు .  ఆహారం ,నీరు ,గాలి , అలాగే మన విహారాలు (-భావాలు ,ఆలోచనలు )- అన్నీ కూడా ప్రకృతికి  అనుగుణ్యం గా ఉండాలి . ప్రకృతికి దగ్గరగా అంటే , పంచ భూతాలను  మనం కలుషితం చేయకుండా చూడాలి . అలాగే ,పాంచ భౌతిక శరీర...

అసురులు

1947 కి ముందు ఎవరైతే దేశ ద్రోహులుగా భారత మాతకి వెన్ను పోట్లు పొడిచారో ,వారే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ భక్తులు ,భారత రత్నలు ,జాతిపితలు ,రాజ్యాంగ నిర్మాతలుగా చెలామణీ అయ్యారు . అలా    గణు తు కెక్కిన   వారి శిలా విగ్రహాలు ,కాంగ్రెస్ గడ్డి' లెక్క భారత దేశ వాడ వాడ లా స్థాపించ బడ్డాయి .   వీరే భరత మాత ముద్దు బిడ్డలని ,వీరే జాతి గర్వించ తగ్గ నాయకులని తమ    కనుసైగలో పనిచేసే మీడియా సాయం తో   ఊదర గొట్టేసి ,భారతీయులను చిన్నప్పటి నుండే తప్పుదారి పట్టించడం లో సఫలీకృతులైన తెల్లోడి తెలివి ఎంత భయానక మైనదో.........   గత 70 ఏళ్ల భారత దేశ రాజకీయ ముఖ చిత్రం ,ముఖ్యం గా కులం పేరుతొ భరత సమాజాన్ని   చీలికలు పేలికలుగా చీల్చి చెండాడుతున్న రిజర్వేషన్ లు ,ఓటింగ్ సరళి , మారణ హోమాలు .... వీ   టిని చూస్తే అర్ధం అవుతుంది . యూనివర్సిటీ ల ని అదిలించి చరిత్ర పుస్తకాలలో తప్పుడు సమాచారాన్ని ముద్రింప చేసి , భారతీయ పిల్ల ల మెదళ్ల   ను పూర్తిగా తమ అధీనం లోనికి తెచ్చుకొన్న ఘనత వారిదే . బలవంతులదే రాజ్యం . అది అడవి ఐనా ,ప్రజాస్వామ్య సమాజ మైనా బల వంతులే పాలకులు ...

what india,where 40crore poor people lives, needs the most?

pumping of foreign funds fall in crude oil prices. lesser demand for gold. Population stabilization. Make people more skilled&more disciplined.  we need fast economic growth.  How it happens?  By creating employment to all workable people. For this to happen,the  govt has to boost infra projects. rail&road net work,ports,power grids,digital net works,mining,manufacturing,etc.... so,for sustainable  economic growth, we have to built projects for which we need   sustained inflow of foreign funds.so we have to attract  Foreign direct investments.  thats our Modi or Chandra babu are doing by parleying with big brother countries and raised the slogan-"Make in India". There is a difference between FIIs(equities,debtswhich are volatile and depends on sensex movement) and FDIs which are stable&long term investment funds.  we need much more FDIs and we need much more remittances from NRI diaspora,for which our prime minister...

అస్థి -నాస్తి సంవాదం

  దేవా ! సమాజం లో నీ పేరిట చెలరేగుతున్న మౌడ్యాన్ని ఎలా అరికట్టాలో చెప్పవా ? ఏముంది నాయనా , నా పేరిట జరిగే అరాచకాలను ,అన్యాయాలను ,అధర్మాలను ,మూర్ఖత్వాన్ని ఎదుర్కోవా లంటే  నా పేరునే రూపు మాపేయ్ !నేను ' లేనని ,చెప్పు . నా పేరిట జరుగుతున్న మూడా చారాలు ,అన్యాయాలు ఆపు .                                   అస్థి -నాస్తి సంవాదం    సదానందం దగ్గర కొచ్చి అడిగాడు   సందేహం . నిజం గా దేవుడున్నాడా ? లేడు . నువ్వనుకొనే   రీతిలో ఒక వస్తువుగా ,ఒక మనిషిగా దేవుడు లేనే   లేడు . మరి ఏ రీతిలో ఉన్నాడు ? అది నేను చెప్పే ముందు దీనికి సమాధానం చెప్పు . నీకు ప్రేమ అంటే తెలుసా ? తెలుసు , అన్నాడు సందేహం . మరైతే దానిని చూపించ గలవా ? ఎలా చూపిస్తాం ? అనుభూతిలోకి తెచ్చు కొని ఇదే ప్రేమని చెప్పు కొంటున్నాం . ప్రేమని   ఒక భావం గా అనుభవించి అది ప్రేమ అని భావన చేసి   మళ్ళీ తిరిగి నువ్వు ప్రేమని పంచుతున్నావా ? పంచుతున్నాను . ఇంద్రియాలతో ,మనస్సుతో అనుభవం లోకి తెచ్చు కొంట...

మంచి రోజులు వస్తున్నాయా ?

                               మోడీ సారధ్యం లో కొత్తగా ఏర్పడిన    కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ... అనగా గత ఏడాది కాలం లో తీసుకొన్న కొన్ని మంచి నిర్ణయాలు ! 1. ప్రస్తుతం మన దేశం లో ఉన్న లక్ష కిలో మీటర్ల హైవే కి ఇరు వైపులా చెట్ల పెంపకం . 2.  పోషకాహార లోపం తో కునారిల్లుతున్న 50కోట్ల మంది స్త్రీలు , పిల్లలకు సెల్ ఫోన్ ల ద్వారా వీడియో ల రూపం లో అవగాహన పెంచి ,సరైన పోషక ఆహారాన్ని , సరైన సమయం లో 'టీ కాలను తీసు కొనే విధం గా ప్రోత్స హించే కార్య క్రమం . మన దేశం లో   ప్రభుత్వాలకే కాదు , ప్రజలకు కూడా     ఆరోగ్యం పై    తగినంత శ్రద్ద లేక పోవడం వలన , స్త్రీలను ,ఆడ పిల్లల ను అన్ని విధాలుగా తక్కువ చూపుతో చూడటం వలన ,   పోషకా హారం పై తగినంత అవగాహన లేకపోవడం వలన    ,   చదువుకొని అవగాహన ఉన్న వారు కూడా పోషక విలువులు ఉన్న ఆహారాన్ని తీసు కోకుండా జంక్ ఫుడ్ కి అలవాటు పడటం వలన, కుర్చీలకి అతుక్కు పోయి టీవీ ,కంప్యు టర్ ల పైనే సగం జీవితాన్ని ఎల మార్...