సమ సమాజం - సమదర్సనం
సంస్కృత భాష గురించి సరైన అవగాహన లేని ప్రజా నాయకులు సామాన్య భారతీయుడిని ఎంతగా తప్పు దారి పట్టిమ్చారో తెలుసు కొంటే బాధ ,నిర్వేదం కలుగుతుంది . పెరియార్ లాంటి మహా మేధావి వేదాలను చెత్త కింద తీసిపారేసి తగల బెట్టాలని పిలుపు నిచ్చాడు . పూలే మహాశయుడు తనకున్న అత్యంత మానవతా విలువులున్న మేధతో ఒక అమాయకపు ప్రస్న వేశాడు . అందరికీ మేలు చేసే వేదాలు కేవలం సంస్కృత భాష లోనే ఎందుకు వ్రాశారు ? కానీ ఆయనకు తెలీదా ! అప్పట్లో ,10వేల ఏళ్ల క్రితం జన భాష సంస్కృతమే అని ,మరే ఇతర భాషలు అప్పట్లో లేవని ,అందుకే సంస్కృతం లోనే వాటిని వ్యాస మహర్షి గ్రంధస్తం చేశారని ,గ్రంధస్తం కాక మునుపు,కేవలం గానం ద్వారా నే వేలాది ఏళ్ళు తరతరాలకు ప్రవహించాయని తెలీని అమాయకపు పెద్ద మనిషి ఫూలే ! అంబేద్కర్ గారు వేదాలను పనికిరాని చెత్త అని, అవి గిరిజనులు ప్రక్రుతి నుండి రక్షణ కోసం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రార్ధనా గీతా లని ,వాటికి పూచిక పుల్ల విలువ లేదని గర్జించి చెప్పారు . మనిషిలో మేధస్సు ,మానవతా విలువలు ఉన్నా విజ్ఞాన స్రవంతి పైన ఉపేక్ష ఉంటే,ఆ సమాజానికి, యువతకు ఎంతటి నష్టం జరుగుతుందో...