Posts

Showing posts from February, 2018

faithful duty - శ్రద్ధ

ప్రతి   మనిషికీ ఏదో ఒక దానిపై   శ్రద్ధ ఉంటుంది. మనిషికి ఉన్న శ్రద్ధను బట్టి అతని ఆలోచన,కార్యాచరణ,అతని జీవితం ఎలాఉంటుందో చెప్పవచ్చు. అన్నప్రాసన సమయంలో పిల్లలకు వివిధ వస్తువులు ఎదురుగా పెట్టి,వారు దేన్ని పట్టుకొంటారో చూసి,దానిని బట్టి వారి ఇష్టాన్ని తద్వారా శ్రద్ధని చెబుతారు.   ఆ బిడ్డ   యెక్క   ఇష్టాన్ని,శ్రద్ధను చూసి అది బిడ్డ మానసిక   ఎదుగుదలకు, పురోగమనానినికి , ఆధ్యాత్మిక చింతనకు వ్యతిరేకమైనదా , సహాయ కారిగా ఉంటుందా? అనేది    బేరీజు వేసుకొని వ్యతిరేకమైనది అయితే ఆ బిడ్డను సంస్కరించడానికి తల్లితండ్రులు ,   గురువు ప్రయత్నం చేస్తారు . అన్నప్రాశన లో వెనుక ఉన్న పరమార్ధం ఇదే! ఏది ఏమైనా బిడ్డలకి 7 ఏళ్ళు ముగిసే లోపుగానే అనగా వారి మెదడు అభివృద్ధి చెందే దశలోనే,   వారికీ మంచి ఆలోచనలు,సాంఘిక విలువలు, ఆధ్యాత్మిక భావాలు ,పరోపకారం,సహనం,ఆరోగ్య రక్షణ పై అవగాహనా పెంచాలి.    శ్రద్ధ అనేది సంస్కృత పదం.   మనలో   గట్టిగా స్థిరపడిన భావనలను   శ్రద్ధ అంటాం. అనగా ఆ భావనలను మనం గట్టిగా ,బలంగా ఇష్టపడతాం. విశ్వసిస్తాం. కొందరికి చదువు ప...