Posts
Showing posts from April, 2020
శ్రీరామ జయరామ జయ జయ రామ‘
- Get link
- X
- Other Apps
శ్రీరామ అని నాంది పలకనిదే ఏ పనీ చేయనంతగా పెనవేసుకున్న నామం శ్రీరామ నామం. ప్రతి అక్షరము బీజాక్షరమే ప్రతి పదము మంత్రసమానమే ! కానీకొన్ని అక్షరాలలో ,పదాలలో మరింత మహత్తర లోకోత్తర శక్తి దట్టించి ఉంటుంది . అలాంటి తారకమంత్ర రాజమే శ్రీరామ నామం! శ్రీరాముడు అవతరించక మునుపే శ్రీరామ మంత్రం శక్తి గా విశ్వమంతటా వ్యాపించిఉంది. అలా వ్యాపించి ఉండటమే విష్ణుత్వం! వ్యాపించిన శక్తి ఆకృతి దాల్చడమే అవతరణ! శ్రీరామ మంత్రం ఆకృతి దాల్చిన వేళావిశేషాన్ని మానవాళి పవిత్ర పర్వదినం గా సంబురాలు జరుపుకోవడం అనూచాన మైన ఆచారం! "శ్రీరామ రామ రామ - శ్రీమానసాబ్ధి సోమ" సర్వ భావనలు, ఆవృత్తులు , వాక్కులు, కర్మలు సమస్తం శ్రీరామ మయం సర్వ జీవులు , స్థావరములు సమస్తం శ్రీరామ జయం! శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు అనగా అభిజిత్ లగ్నం లో జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.కా ...