అంతా చేసింది నువ్వే ...
ఈ సృష్టి భగవంతుని రచనా ? లేక యాదృచ్చికం గా జరిగిందా ? అసలు దైవం అనే శక్తి ఉందా ? లేక మనం భ్రమల్లో ఉన్నామా ? ఏదో పుట్టాం . పెరిగాం . సుఖదు ఖాలు చూశాం . చిరాకు -పరాకు ,అసూయ -అపనమ్మకం ,కోపతాపాలు,అవమానం -ఆక్రోశం ...ఇంకా ఎవేవో అనుభవాలు - అన్ని ప్రాణుల మాదిరిగా నే అనుభూతి స్తున్నాం . కాబోతే తెలివి,ఊహ ,తార్కిక బుద్ది ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా నే అనుభ విస్తున్నాము . ఏది ఎలా ఉన్నా , మనిషి సుఖం గా బతకడానికి జ్ఞానం కావాలి . ఆ జ్ఞానం, సుఖం తో పాటు ప్రశాంతత నివ్వాలి గానీ,ఆందోళన ,ఆవేదన ఇవ్వకూడదు అని వేదం గట్టిగా చెప్పింది . మనిషి గమ్యం ఆనందం . మనిషి కర్తవ్యమ్ కుటుంబ ,దేశ ప్రశాంతత . పాపం,పుణ్యం ,స్వర్గం,నరకం అని చెప్పి ప్రజలకు భయ భక్తులు నేర్ప వలసిన అగత్యం వేద కాలం లో లేదు . ఎందు కంటే ఎక్కువ శాతం ప్రజలు ఆర్ధికం గా హార్ధికం గా సమతుల్యతలో ఉండే వారు . అసమానతలస్సలేమీ ఉండేవి కావు . ఎప్పుడై తే అసమానతలు ఎక్కువ అయ్యాయో అప్పుడే ఘర్షణలు మొదలయ్యాయి . ఆ గొడవలను నియంత్రించి సమాజం శాం తం గా ఉంచటానికి కర్మ ,విధి ,పాపం,పుణ్యం ,స్వర్గం,నరకం అనే...