ధ్యానం.
మన రుషులు ,ప్రవక్తలు అందరూ తరతరాలుగా చెప్తుంది ఒకే ఒక్కటి. ధ్యానం
చేయండి.అన్నీ సర్దుకుంటాయి.
అంతటా ప్రశాంతత ని అనుభూతి
చెంద వచ్చు.
ధ్యానం.
మనస్సు రకరకాల పౌనపున్యం తొ కంపించే ఒక శక్తి ప్రవాహం.
చుట్టూ ఉన్న కాస్మిక్ శక్తిని మనకు అందనివ్వకుండా ఈ మానసిక శక్తి
ప్రవాహం,ఒక నిరోధం లాగా పనిచేస్తుంది.
ఎప్పుడైతేఈ నిరోధాన్ని మనం తగ్గించగలమో,అప్పుడే కాస్మిక్ శక్తి
మనలోకి ప్రవహించి మన చైతన్యాన్ని విశ్వ స్థాయికి వ్యాపింప చేస్తుంది.
చైతన్యాన్ని మనం శివ అంటాము.
కాస్మిక్ శక్తిని అమ్మా అంటాము.
మనస్సుని
తరంగాలు లేకుండా చేయడ మెలా?
మనస్సు కున్న ఒక లక్షణం అది దేనినైతే చూస్తుందో దాని లా మారిపోతుంది.ఒక
స్వీట్ ని చూసి దనిపై తదేక దీక్ష పెడితే
అది ఆ తీపి మిటాయి లక్షణాలను సంతరించు కొంటుంది. నీరు ఏ పాత్రలో
పొస్తే ఆయా పాత్రల ఆకారాన్ని పొందుతుంది గదా.
అందుకే,మానసిక శక్తి పౌన పున్యాన్ని తగ్గించుకొంటూ శూన్య స్థాయికి
తెసుకెళ్ళాలంటే,శూన్యం పై మనస్సుని కేంద్రీకరిస్తే కొంత కాలానికి మనస్సు శూన్యం లాగా,అంటే
శూన్యమై పోతుంది.
.దేవుడు అనే భావం ఎలా ఉంటుంది?ఎలాంటి లక్షణాలు,వికారాలు లేని అంటే
ప్రకంపనలు లేని భావం.అందుకే సగుణాకార ఆరాధన కన్నా శూన్యారాధన త్వరగా మనస్సుని శూన్య
స్థితికి మారుస్తుంది.
మానసిక శక్తి ధర్మాలు అచ్చం నీటి ధర్మాల లాగా ఉంటాయి.అందుకే జ్యోతిష
శాస్త్రం లో కూడ జలాధి పతి ఐన చంద్రుణ్ణి మనస్సుకి కారకుడు గా వ్యవహారిస్తారు.
మనస్సు ఇంకో శక్తితో కూడ ముడిపడి ఉంటుంది. అదే ప్రాణ శక్తి. మనం
ఒక క్రమ పద్దతిలో ఊపిరి తీస్తూ వదులుతూ నెమ్మదిగా ఊపిరి పై కంట్రోల్ సాధిస్తే,మనస్సు
పై కూడ మనం కంట్రోల్ సాధించ వచ్చు.
ధ్యానం అంటే
ఒక వస్తువు- అది బయట ప్రపంచం లొ ని ఏదైనా కావచ్చు , లేదా అంతర్
ముఖంగా -ఒక అనుభూతి ,ఆలొచన, ఒక ద్రుశ్యం , ఒక మంత్రం ,ఒక భావన ,ఒక స్పందన - ఏదైనా కావచ్చు
, దానిపై మన మనస్సుని ,ఇంద్రియాలతొ సహా లగ్నం చేయటం .
ఏకాగ్రత
,ధారణ ,ధ్యానం -- ఎందుకు ?
ఇంద్రియాలను ,మనస్సు ని కేంద్రీకరించడ మే ఏకాగ్రత . దానిని ఎక్కువ
సేపు అవిచ్చిన్నంగా చేయడ మే ధారణ .
ఒక విషయాన్ని ,అది ఏదైనా సరే ,పరిశీలన ,పరిశోధన , చేసి నిజం రాబట్ట
కలగాలి . అంటే సత్యాన్ వేషణ కోసం ధ్యానం చేయాలి .
మెడీటేషన్
అంటే ఏమిటి ?
మన ధ్యాసను అంటే మనస్సుని ఒక్క విషయం పైన కేంద్రీకరిస్తే దానిని
ఏకాగ్రత అంటాము . ఒక బిందువు మీద గానీ , ఒక వస్తువు మీద గానీ - అంటే ప్రాపంచిక విషయాలు
- తినే పదార్ధం లేదా ఒక వ్యక్తి లేదా ఒక పని
లేదా డబ్బు - వీటి పైన మన మనస్సుని పెడితే దానిని ఏకాగ్రచిత్తం అని అంటాము .
అలాకాక , ధ్యాసని శూన్యం పైన - అంటే ఏమీ లేని -భౌతిక నిర్వచనం లేని
-విషయం పై కేంద్రీకరిస్తే దానిని మెడీటేషన్ అని చెప్పికొంటాము .
భౌతిక వస్తువులలో , విషయాలలో శూన్యాన్ని చూడకలిగితే - అనుభూతిస్తే
-అదీ మెడీటేషనే !
మెడీటేషన్ లో మనస్సుని అంటే ఆలోచనా ధారని తగ్గించుకొంటూ మనస్సు
లేని దశకు చేరుకొని కాల ప్రదేశాలను మరిచి ఉంటాము
.
శూన్యం అంటే ఏమిటి?
పూర్తిగా లేకపోవడం కాదు. ఉన్నదానితో మమేకమవ్వక పోవడం అనగా అహం తో వ్యవహరించ కుండా గమనించడం .
శూన్యం అంటే ఏమిటి?
పూర్తిగా లేకపోవడం కాదు. ఉన్నదానితో మమేకమవ్వక పోవడం అనగా అహం తో వ్యవహరించ కుండా గమనించడం .
రోజుకి 60000 ఆలోచనలు కలిగే మనస్సుని కంట్రోల్ ఎలా చేయాలి ?
శారీరక స్వస్థత
జ్ఞానేంద్రీయాల స్థబ్దత
కర్మేంద్రీయాల నిబద్దత
చిత్త శుద్ది - చిత్త నిరోధం - నిర్మల చిత్తం ---- వీటిని సాధించాలంటే
--- క్రింది నియమాలను అలవాటు చేసుకోవాలి .
నీతి ,నిజాయితీ - అంటే సంఘానికి చెరుపు చేయకుండుట ,ప్రక్రుతి రక్షణ ,
అహిన్స , అపరిగ్రహం ,
- అంటే సంఘానికి మేలు చేయని హింస , పనేమీ చేయకుండ వస్తు స్వీకారం చేయకుండుట
.
సేవ , త్యాగం , వైరాగ్యం - సమ పాళ్ళలో అలవాటు చేసుకొనుట ,
ప్రేమ , సత్యం -ప్రతిఫలమేమీ ఆశించని దానం , అనుభూతి చెందిన దాన్ని మాత్రమే పలుకుట.
అంటే మనిషికి సహజంగా ఉండే అరిషద్వర్గాలను అదుపులో ఉంచి మెల్ల మెల్లగా
వాటిని చిత్తం నుండి తీసివేయాలి .
Comments
Post a Comment