వైకుంఠ ఏకాదశి :

Image result for vaikunta ekadasi 2017 images

ఉత్తరాయణ పుణ్యకాలానికి 5 రోజులు ముందు వచ్ఛే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు . ఇది సూర్య చలనం ప్రకారం లెక్కిస్తారు . మనం ముఖ్యంగా ఆంధ్రులు చంద్ర గమనాన్ని బట్టి తిధులు లెక్కిస్తారు .
  శుభ సమయం ప్రాణులకు ముఖ్యం గా బుద్ధి జీవులైన మానవులకు శుభాన్ని చేకూర్చే సమయం గా ,  మన మహర్షులు ఎంతో శ్రమకి ఓర్చి కనిపెట్టారు .
రెండు బిందువులకు  ,రెండు అలలకు ,రెండువిషయాలకు ,రెండు జాములకు , రెండు ఆయనములకు ,రెండు యుగాలకు , అలాగే ఒక కణము రెండుగా విభజన చెందే వ్యవధుల మధ్యన  ఉండే నిశబ్దం ఎంతో శక్తివంత మైనది . ఆ సమయంలో అంతటా పరచు కొని ఉన్న కాస్మిక్ చైతన్యం, వ్యక్త సృష్టి కి కారణభూతమైన పంచ భూత ప్రకృతిలో మరింతగా ప్రతిఫలించే సమయం .
ప్రక్రుతి ప్రశాంతం గా ఉన్న సమయమే శుభసమయం .  ఎందుకంటే అలంటి శాంతికరమైన స్థితిలోనే దైవ చైతన్య ప్రభావం హెచ్చుఁగా ఉంటుంది . పంచభూత ప్రకోపం ,రాజస -తామస గుణాల సంరంభం దైవచైతన్య ప్రవాహాన్ని సాఫీగా సాగనియ్యవు .
అందుకే ఉభయ సంధ్యలలో  (సంధ్యా వందనం )పవిత్రభావనలతో కృతజ్ఞతా పూరితమైన  మంత్రపూతమైన తర్పణం సమర్పణ చేస్తే శరీరంలోని కణ విభజన సవ్యంగా జరుగుతుంది . లేకుంటే జన్యువులలో మ్యుటేషన్ లు వచ్ఛే అవకాశం కూడా ఉందనే వాదం ఒకటి ఉంది . అలాగే రెండు ఆయనముల మధ్యన వచ్ఛే సమయాన్ని మకర సంక్రమణ సంక్రాంతి గా మనం వ్యవహరిస్తాం . సర్వభూత కోటి కి సమర్పణ , సర్వమానవాళికి ఇఛ్చిపుచ్చుకొనే సంప్రదాయం , హరినామ  భజన ఇవన్నీ కూడా కృతజ్ఞతా పూరితమైన భావనలతో చేసేవే !

మన సౌర మండలం, పాలపుంత కేంద్రము  (విష్ణు పాదం /పదం ) చుట్టూ పరిభ్రమిస్తుంది .
సూర్యుడు ధనస్సురాశిలో ఉన్నప్పుడు ధనుర్మాసం అంటాం . ఆ సమయంలో హరిభజన ఎక్కువగా చేయమని ఋషివాక్యం .
మన భూమికి సంబంధించినంత వరకు ప్రత్యక్ష దైవం ఎవరు ?
మనకు వెలుగు ,వేడి ,ఆహరం ,వర్షం ఇచ్ఛే సూర్యుడే !
అంతటి సూర్యుడు ధనస్సురాశిలోని నక్షత్రాలకు అనుకూలమైన కోణం లో చలిస్తున్నప్పుడు పాలపుంత నాభి యొక్క శక్తి తరంగాలు ధనస్సురాశిలోని శ్రవణ ,మూల , కొద్దీ శాతం ఉత్తరాషాఢ నక్షత్రాల మీదుగా పయనించి సౌరమండలాన్ని , దానితోపాటు మన భూమిని  ప్రభావితం చేస్తాయి .
సమస్త మానవాళి యొక్క అభివృద్ధి వారి ఆలోచనా విధానం పైనే ఆధారపడి ఉంటుంది . మన ఆలోచన మన భావనల పైనే ఆధారపడి ఉంటుంది . మనభావనలు మనలోని రాగద్వేషాలపైనే ఆధారపడి ఉంటాయి . ఈ రాగద్వేషాలు మన కర్మ కోశము లోని  ప్రారబ్ద కర్మ భారాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి .
ఇంతటి బలమైన ప్రారబ్దాన్ని కూడా మార్చివేసే శక్తి  దైవప్రజ్ఞా చైతన్యానికే  ఉంటుంది .
అందుకే అంటారు ,మనిషి నుదిటి గీతను మార్చే శక్తి ఆ భగవద్ గీతకే ఉంటుందని !
పాలపుంత  నుండి వచ్ఛే చైతన్యం, మనలోని ఆలోచనలను ప్రదీప్తం చేస్తాయి . కాబట్టి ఆ సమయంలో మనలోని ఆలోచన ల తీరుతెన్నులేవైతే ఉంటాయో అవి బలపడి స్థిర పడతాయి . అందుకే మహర్షులు ఈ ధనుర్మాస శుభసమయం లో హరికీర్తన చేస్తే ,మను షుల ఆ ధ్యాత్మిక పు రోగతి  సవ్యం గా సాగుతుందని భావన చేశారు . ముఖ్యం గా
ఏటా 24 ఏకాదశులు వస్తాయి .  ప్రతి ఏకాదశి సమయం కూడా శుభకరమైనదే ! కానీ ధనుర్మాసంలో ని ఈ ఏకాదశి అత్యంత ప్రభావశీల మైనది . అంతే కాదు , ఈ రోజున మనభూమి ఉత్తరధ్రువమ్ నుండి మనం చూస్తే (చూడగలిగితే ) సరాసరి మన దృష్టి పాలపుంత కేంద్రాన్ని చూస్తుంది .
అంతే కాదు, మానవశరీరానికి ఉత్తరధ్రువం మన శిరస్సు . శిరస్సులోని ఆజ్ఞా చక్రం ద్వారా మనచూపు ని సహస్రారం పై నిలిపి ధ్యానం చేస్తే మనకు కలిగే ఆత్మదర్శనమే ఉత్తరద్వార దైవ దర్శనం !
తామస ,రాజస గుణాలతో భవరోగముతో ,భవ బంధాలలో చిక్కు కున్న వారిని తరింప చేయడానికి ,కనీసం ఇలాంటి పర్వదినాలలో నైనా మనస్సుని ఆధ్యాత్మిక చింతన వైపు మరల్చి , వారిని పునీతులను చేయాలని మహర్షుల సంకల్పం .
జ్యోతిర్వేదం ,జ్యోతిష్యం , భౌతిక ఆధ్యాత్మిక శాస్త్రముల మేళవింపే మన భారతీయుల పర్వదినోత్సవాలు !
శుభసమయాలను ఉత్సవాలుగా నడుపుకోవడం అందరూ లబ్ది పొంది సంతోషం గా ఉండాలనే తాపత్రయం మన పెద్దవారిది .
వేకువ నే హరి దాసు కీర్తనలు , వాకిట్లో బియ్యపు పిండి ముగ్గులు , ఆవు పేడ తో గొబ్బిళ్ళు ,వాటి లో గుచ్చిన బంతి ,గుమ్మడి పూలు ,సాయంత్రం సందె గొబ్బెమ్మ పాటలు  - ఒక విధం గా జ్యో తిర్వేదాన్ని సామాన్యుల ముంగిటికి చేర్చడమే !  ఇవన్నీ మన సంప్ర దాయం . 

ఆకాశంలో ఏముందో దానినే మన వాకిట్లో వేసి కొలవడం భారతీయత !
మనస్సు ని ,తనువుని పవిత్రం చేసుకొని చూపుని విష్ణుపదం పై నిలిపి స్వాతంత్రం పొందడం మనిషి బాధ్యత . 

ఇవన్నీ మన పిల్లలకు నేర్పుదాం .


Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి