శ్రీరామ జయరామ జయ జయ రామ‘
శ్రీరాముడు అవతరించక మునుపే శ్రీరామ మంత్రం శక్తి గా విశ్వమంతటా
వ్యాపించిఉంది. అలా వ్యాపించి ఉండటమే విష్ణుత్వం! వ్యాపించిన శక్తి ఆకృతి దాల్చడమే
అవతరణ! శ్రీరామ మంత్రం ఆకృతి దాల్చిన వేళావిశేషాన్ని మానవాళి పవిత్ర పర్వదినం గా సంబురాలు
జరుపుకోవడం అనూచాన మైన ఆచారం!
"శ్రీరామ రామ రామ - శ్రీమానసాబ్ధి సోమ"
సర్వ భావనలు, ఆవృత్తులు , వాక్కులు, కర్మలు సమస్తం శ్రీరామ
మయం
సర్వ జీవులు , స్థావరములు సమస్తం శ్రీరామ జయం!
శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు
పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు అనగా అభిజిత్ లగ్నం లో జన్మించారు.
ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.కా లాతీత
విఖ్యాతుని ఒక కాలానికే పరిమితం చేయడం మన అమాయకత్వం.
ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
పైనున్న పచ్చని తాటాకు పందిరి లో నుండి నులివెచ్చని నీరెండ శత సహస్ర కిరణాంబుధి రాముని పాదాలను అభిషేకిస్తూ ఉన్నవేళ, అభిజిత్ ముహూర్తాన శ్రీసీతారాములకు కళ్యాణం చేసి, దోసిట తలంబ్రాలను అభిషేకించి, పానకం, వడపప్పు ,అరటిపళ్ళు శ్రీసీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీహనుమద్ సహిత శ్రీరామచంద్రునికి నివేదించి గానీ ఏ కార్యమూ చేయం. నిశాచర హరునికి ,వాతహరమైన ప్రసాదాన్ని నివేదనచేసి అందరికీ సాదరం గా పంచే లోకకల్యాణ కారకమైన పవిత్ర పర్వదిన సంరంభం కమ్మని అమాయకత్వ మే తప్ప మూర్ఖత్వంకాదు.
ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||
ఓం మహా గణపతయే సమః || ఓం || అనే గణపతి ఆవాహనతో ప్రారంభించి ,
పైనున్న పచ్చని తాటాకు పందిరి లో నుండి నులివెచ్చని నీరెండ శత సహస్ర కిరణాంబుధి రాముని పాదాలను అభిషేకిస్తూ ఉన్నవేళ, అభిజిత్ ముహూర్తాన శ్రీసీతారాములకు కళ్యాణం చేసి, దోసిట తలంబ్రాలను అభిషేకించి, పానకం, వడపప్పు ,అరటిపళ్ళు శ్రీసీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీహనుమద్ సహిత శ్రీరామచంద్రునికి నివేదించి గానీ ఏ కార్యమూ చేయం. నిశాచర హరునికి ,వాతహరమైన ప్రసాదాన్ని నివేదనచేసి అందరికీ సాదరం గా పంచే లోకకల్యాణ కారకమైన పవిత్ర పర్వదిన సంరంభం కమ్మని అమాయకత్వ మే తప్ప మూర్ఖత్వంకాదు.
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః
శుభం భవతు.నాలుగు సముద్రాల పర్యంతం వ్యాపించిఉన్న సమస్త భూమండలం లోఉన్న గో బ్రాహ్మణులు శుభంగా వర్ధిల్లాలి.
అయ్యవారికి,అమ్మగారికి కళ్యాణం జరిగితేనే అనగా సత్ , చిత్ కలిసి ఉంటేనే శుభస్కరం !
వశిష్ఠ గోత్రోద్భవుడైన శ్రీరామచంద్రునికి , గౌతమస గోత్రోద్భవీ సీతమ్మకు కళ్యాణం ...
అందరూ రావాలి . ఆశీస్సులు పొందాలి. తనువు పులకరించాలి. మనస్సు మురిసిపోవాలి. హృదయం రామరసం తో నిండిపోవాలి .
జానక్యాః
కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితా
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయి తాః౹
స్రస్తాః శ్యామల కాయ కాంతికలితాః యా ఇంద్ర నీలాయితా
ముక్తా స్తా శ్శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః౹
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయి తాః౹
స్రస్తాః శ్యామల కాయ కాంతికలితాః యా ఇంద్ర నీలాయితా
ముక్తా స్తా శ్శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః౹
శ్రీరామ వైవాహికా తలంబ్రాలు , సీతమ్మ యెక్క నిర్మల కమల ములవంటి దోసిట పద్మరాగమణు లై,
రామయ్య తెల్లటి పట్టుతలపాగా పైనబడినపుడు ధవళ
కాంతులతో మెరిసే ముత్యాలుగా జాలువారుతూ , పుంసా మోహనరూపుడైన స్వామి దేహం పై
వర్షిస్తున్నపుడు ఇంద్రనీలమణులుగా భాసిస్తూ ,అందరినీ మైమరిపిస్తూ శుభాలను
వర్షిస్తున్నాయట!
శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన
శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని
శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని
బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు
యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో
ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం
చెబుతోంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో
‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది.
పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా
ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .
కానీ శ్రీరాముని జీవితం పానకం వడపప్పు లాంటి మధురమైన ది అని అనుకొంటున్నారా?
శ్రీ రాముని జీవితంలో దురదృష్టకరమైన
సంఘటనలు చాలా జరిగాయి. అతని రాజ్యం చేజారి పోయింది, అరణ్యవాసం అనుభవించవలసి వచ్చింది,
ఇంకా చాలా కఠినమైన జీవితం గడపలసి వచ్చింది. అతని భార్యను రావణాసురడు అపహరించాడు.
యుద్ధం గెలిచిన తరువాత శ్రీ రాముడు
“నాకు హిమాలయాలకు పోయి తపస్సు చేయాలని ఉంది , ఎందుకంటే నేను గొప్ప పాపం చేశాను. నేను
ఒక పరమ శివ భక్తుడిని, ఒక అసాధారణమైన పండితుని, ఒక గొప్ప రాజుని, ఒక ఉదారస్వభావిని
వధించాను’’ అన్నాడు. మిగిలిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అతని తమ్ముడైనటువంటి
లక్ష్మణుడు “మీరు ఏమంటున్నారు? అతను మీ భార్యను అపహరించాడు” అన్నాడు. అప్పుడు శ్రీ రాముడు
“అతనికి ఉన్న పదితలలలో చాలా గొప్ప విజ్ఞానం, భక్తి కలది మరియు ఉపాసన చేసినది అయిన ఒకతల
ఉంది. దానిని వధించినందుకు నేను చింతిస్తున్నాను” అన్నాడు.
మనం చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని
గుర్తించే బదులు, మనందరం ఆ మనిషినే పూర్తిగా ఖండిస్తాము. అందరికీ
పది లేదా అంతకన్నా ఎక్కువ తలలే ఉన్నాయి. ఒక రోజు మీ తల అంతా అత్యాశతో నిండి ఉంటుంది. మరొక రోజు అసూయతో, ద్వేషంతో,
ప్రేమతో, మోహంతో, అందంతో లేదా వికారంగా ఉంటుంది. లేదా ఒకే రోజు మీలో ఇవన్నీ
ఉండవచ్చు. మీరు ఒకరిని ఒక క్షణం అసూయతో చూసినట్లయితే అతను అసూయాపరుడు అని
నిర్ధారణకు వస్తారు. కానీ నిజంగా, అనేక సమయాలలో, అనేక రకాల తలలు ప్రతివారిలో పని
చేస్తూ ఉంటాయి. ప్రతివారికీ ప్రేమతో నిండిన తల, అలానే అందంతో, ఉదారస్వభావంతో లేదా కరుణతో నిండిన తల
ఉంటాయి. ప్రజలు చేసే తప్పు ఏమిటంటే, ఒక గుణాన్ని గుర్తించే బదులు, ఆ మనిషినే వారు
పూర్తిగా ఖండిస్తారు.
శ్రీ రాముడు
చెప్పేది ఏమిటంటే రావణాసురడు ఎంత ఘోరమైన పనులు చేసినా, అతని యందు బ్రహ్మాండమైన సంభావ్యత కలిగిన
ఒక అంశం ఉంది .
మనందరం ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆచరిద్దాం. –మనం ఎవరిలోనైనా ఏదైనా తప్పు
చూసినట్లైతే ఆ తప్పును ఖండిద్దాం కానీ ఆ మనిషిని కాదు. మనం ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చినప్పుడు, మనం అనవసరమైనటువంటి వాటినుంచి విముక్తులవుతాము. మనం ఇతరులకు ఇలా చేస్తే, మనకు కూడా అదే
జరుగుతుంది.
ఒక గులాబి మొక్కలో గులాబి
పూలకన్నా ముళ్ళు ఎక్కువుగా ఉంటాయి, అయినా మనం దానిని రోజా మొక్కే అంటాము, ఎందుకంటే
మనం దానిలోని అందాన్ని గుర్తించాం కాబట్టి. ఒక మామిడి చెట్టులో పండ్లకన్నా ఆకులే ఎక్కువ
ఉంటాయి, అయినా మనం దానిని మామిడి చెట్టే అంటాము, ఎందుకంటే మనం ఆ పండ్లలోని మాధుర్యాన్ని
గుర్తుంచాం కాబట్టి.
ప్రతి మనిషిలోను కనీసం ఒకటైనా
తియ్యని అంశం ఉంది . ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారి మనస్సు పానకంలా నే ఉంటుంది. ప్రతి మనిషి బుద్ధి వడపప్పు లానే వివేకవంతంగా ఉంటుంది. మనం దానిని ఎందుకు చూడకూడదు?
శ్రీ రాముడు తన భార్యను అపహరించి,
ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసిన వానిని వధించినందుకు తపస్సు చేస్తానన్నాడు. ఇంత జరిగినా,
రాముడు అతని యందున్న ఒక అందమైన తలను చూడగలిగాడు. అతను ఒక్క గొప్ప జ్ఞానం కలవాడు. అందుకే రాముడిని అందరూ
ఆరాధిస్తారు, పూజిస్తారు. అతను జీవితంలో ఎన్నో వాటిలో ఓడినప్పటికీ, అతని ఓటమి ఎన్నడూ
అతని గుణాలను, జ్ఞానాన్నిమార్చలేకపోయింది. జీవితం అతనికి ఏమి చేసినా వాటికి అతను లొంగలేదు.
అందుకే శ్రీరామచంద్రుని ఇలా స్తుతిద్దాం...
" శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్..
ఆజానుబహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి "
మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి
?తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రాలు, మీమాంస గ్రంధాలు ,స్మ్రుతి పురాణాలు చదువ శక్యం
కాకపోయినా బెంగలేదు, శ్రీరాముని జీవితాన్ని అనుసరిస్తే చాలు!ఎందుకంటే రాముడు ధర్మస్వరూపుడు.
నడిచే ధర్మం రాముడు. కురిసే గౌరవం రాముడు. హరిచందనం ,పండువెన్నెల ఏదో కాసేపు ఆహ్లాదాన్ని
పంచుతాయిగానీ శ్రీ రామ
నామం నిరతమూ వెన్నెల వర్షిస్తుంది.
మోవిపై చిరునవ్వు , వాక్కులో ప్రియామోదం , ఆలోచనలో సత్యసంధత
,ఆచరణలో ధర్మ నిబద్ధత వెరసి శ్రీరామ రామం!
ర అంటే అగ్నిబీజం . అగ్ని
అనేది పవిత్రం చేస్తుంది . మ అనేది అమృతం వర్షిస్తుంది. ఏ హృదయంలోనైతే ఈ ద్విదళ బీజం మొలకెత్తి
వృద్ధిపొందుతుందో, పవిత్రామృత
ము ఆర్ణవమై ఆనందాంబుధి గా అవతరిస్తుంది. శ్రీరామ రసం అంటే అనంతానందం . ఈ అనందం వఛ్చి పోయేది
కాదు. స్థిరమై నిలిచేది .
నారాయణ మంత్రం లోని యతి..
నమఃశివాయ మంత్రం లోని యతి ల కూర్పే.. రామ మంత్రం
మంత్రం ఒక తాళం చెవిలాంటిది . ఆ తాళం తో మంత్రాధి దేవత తత్వాన్ని
అనుభూతించడమే మంత్రజప పరమావధి.
జన్మజన్మలుగా ఆత్మను అంటిపెట్టుకుని ఉన్న కర్మఫలాలను దగ్ధం
చేయడానికైనా, శరీరాన్ని వేధించే రోగాల నుంచి ఉపశమనం పొందడానికైనా.... ‘రామ’ అన్న శబ్దంతో
మమేకం అయితే చాలునన్నమాట!
"ఓం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ కష్టం స్వాహా"
రామ మంత్రం శ్రీరామచంద్రపరబ్రహ్మ ను అనుభూతింపచేసే తారకం.
రామ' అనే శబ్ద శక్తికి మరోపేరు సీతమ్మ్మ . సీతామాత ను శ్రీ అంటాం. అందుకే శక్తి పరవళ్ళుతొక్కే శబ్దబ్రహ్మమే శ్రీరామ !
ఓం నమో నారాయణాయ నమ:‘
ఓం నమశ్శివాయ :
ఓం శ్రీ మాత్రే నమ:
ఓం నమశ్శివాయ :
ఓం శ్రీ మాత్రే నమ:

Comments
Post a Comment