Posts

Showing posts from July, 2026

భారతీయ జ్ఞాన ధార

లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన విద్యావ్యవస్థ భారతదేశపు వేల ఏళ్ల జ్ఞాన సంపదపై తీవ్రమైన ప్రభావం చూపిందని అనేక మంది చరిత్రకారులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. గురుకులాలు, సంస్కృత పాఠశాలలు, భారతీయ తత్వశాస్త్రం, ఆయుర్వేదం, గణితం, ఖగోళశాస్త్రం వంటి స్వదేశీ విజ్ఞాన వ్యవస్థలకు క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోయింది. వాటి స్థానంలో పాశ్చాత్య విద్యా విధానం విస్తరించింది. ఫలితంగా భారతీయ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత పట్ల గౌరవం తగ్గి, పాశ్చాత్య ఆలోచనలే శ్రేష్ఠమనే భావన  పెరిగింది . అంతేకాదు పాశాత్యులకు బానిసగా మిగిలిపోవడమే మహాప్రసాదంగా భావించే బానిస మనస్తత్వం పెరిగింది.   అందుకే నేడు ఆధునిక విజ్ఞానాన్ని స్వీకరిస్తూనే, భారతీయ జ్ఞాన సంపద, సంస్కృతి, విలువలు మరియు స్థానిక భాషలకు విద్యా వ్యవస్థలో తగిన స్థానం కల్పించాలని దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్ వ్యక్తమవుతోంది.   అందుకే,  భారతీయ జ్ఞాన ధార లోని గొప్పతనాన్ని సామాన్యులు  కూడా అర్ధం చేసుకొనే విధంగా   ఈ ప్రయత్నం - భారతీయ ఆరు ప్రధాన దర్శనాలు (షడ్ దర్శనాలు) సమన్వయం, పోలిక, సమగ్ర అవగాహన భారతీయ తత్వశాస్త్రంలో “షడ్ దర్శన...