దైవం అంటే ఒక రూపమో, గుణమో, దృశ్యమో ,శబ్దమో కానేకాదు.
దైవం అంటే ఒక రూపమో, గుణమో, దృశ్యమో ,శబ్దమో కానేకాదు.
మనిషికి కనబడేది, కనబడనిదీ, అవ్యక్తమూ , వ్యక్తమూ స్సర్వమూ దైవమే . అనగా నేనూ, నువ్వూ , మనందరమూ , ఈ సమస్త స్థావర జంగమ ప్రక్రుతి , విష్వఅంతరాళము ,విశ్వము ,అణువు, పరమాణువు, క్వార్క్ లు , శక్తి కాసారము, కంపించేది , కంపనం లేనిదీ ప్రతిదీ దైవమే .
చిన్న విత్తనం లో ఆయా వృక్షం తాలూకు సమస్త సమాచారం(జ్ఞానం) ఎలాగైతే సూక్ష్మ స్థాయిలో ఉంటుందో ఈ బ్రహ్మాండం తాలూకు
ఈ సృష్టి లో కేవలం ఒక్క శాతాన్ని కూడా గ్రహించలేని జ్ఞానేంద్రియాలున్న మనిషి ఏవేవో ఊహిస్తాడు,భావిస్తాడు,ఆలోచిస్తాడు,సిద్ధాంతీకరిస్తాడు , ప్రయోగాలు చేస్తాడు , ఆ క్రమంలో ఎన్నెన్నో సాంకేతిక టూల్స్ ను వినియోగిస్తాడు , పదిమందీ ఒప్పుకొంటే అదే నిజమని ఉద్ఘాటిస్తాడు , గ్రంధాలు రచిస్తాడు ,భాష్యాలూ, కారికలు ,సూక్తులతో వివరిస్తాడు కూడా !
ఒక విధమైన 3- డైమెన్షన్ లో వ్యక్తీకరింపబడిన ఈ భూ -భువః -సువర్లోకలుగా చెప్పబడే సౌరమండలం ,పాలపుంత లో ఎన్నెన్నో రకాల జీవులు ఉన్నాయి. మనకు తెలియని డైమెన్షన్లు ఎన్ని ఉన్నాయో?
నిర్గుణ నిరాకార నిరామయ నిర్లేపం ,అచలం గా ఉన్న సత్ చిద్రూప తత్త్వం లోని ఓ పిసరంత భాగం త్రిగుణాలతో చంచలమై కామ లోభ క్రోధాలతో కొట్టుమిట్టాడుతూ ఉండటమే సంసారం.
అలలతో ,కల్మషం తో ఉన్న నీరు అలలు మణిగి కాలుష్యరహితం గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది.
ఆకలి,నొప్పి,బాధ,అవమానం,భయం,ఆందోళన ,అసంతృప్తి అనేవి కంటికి కనబడకపోయినా మన దేహం వాటిని ఎలాగైతే అనుభవానికి తెచ్చు కొంటుందో , అలాగే ' అచలమైన ప్రశాంత ఆనంద పరితృప్తమైన స్థితిని కూడా అనుభవానికి తెచుకోగలదు .
కామానికి విరుగుడు దమము , లోభానికి దానం ,క్రోధానికి దయ వ్యతిరేకమైన వృత్తులు . ఈ వృత్తులనే నిరంతరం అభ్యసించడం సాధన.
అగ్నికి ఉష్ణ గుణ మనేది ఉన్నదంటే అది ఎప్పుడూ దాని నంటి పట్టుకొనే ఉంటుంది. అలాగే త్రిగుణాత్మకమైన ఒకానొక శక్తి ఆ పరమాత్మ నంటి పట్టుకొని ఉంటుంది.
ఆ శక్తి జగత్ ను చూపిస్తే దానిని మాయ అంటాం.
ఆ శక్తి సత్ చిద్ తత్వాన్ని చూపిస్తే పరాశక్తి అంటాం.
జన్మ ప్రయోజనం / లక్ష్యం - జ్ఞాన ఫలాన్ని సాధించటం కోసమే తప్ప మరి వేరే ప్రయోజనం లేదు.
ఏమిటా జ్ఞానం?
ఈ సృష్టిలో ఎంతెంత ఉన్నదో అదంతా ఒకే ఒక తత్త్వమని తెలుసుకోవడమే కాదు, అనుభవానికి తెచ్చు కోవటమే యధార్థమైన జ్ఞానం.
సర్వ వ్యాపకమైన తత్త్వమే ఈ కనిపించే ప్రపంచమంతా. దానికి విలక్షణంగా అందులో అణు మాత్రం కూడా లేదని నిత్యమూ చూడగలిగితే దానికి ప్రపత్తి అని పేరు. ఇలాంటి సర్వాత్మ భావన పట్టుపడిన వాడే మహాత్ముడు. మిగతావాళందరూ , భూతాత్మ-దేహాత్మ-విజ్ఞానాత్మ మాత్రమే. ప్రత్యగాత్మ గాదు.
కాబట్టి స్థూలపదార్ధాలుగా ,జీవం ఉన్న వాటిగా, ఏవో కొన్ని శబ్దాలను , ఏవేవో కొన్ని దృశ్యాలను, లీలలను ,కధలను మాత్రమే దైవం అని సరిపెట్టుకోవడం వాటినే బాహ్యం గానూ ,ఆంతర్యంలోనూ భక్తి ప్రపత్తి తో కొలవడం పరమపదానికి కేవలం మొదటి మెట్టు మాత్రమే !
Comments
Post a Comment