ధర్మ చింతన
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తూనే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండే స్థాయికి చేరాలని సమాజం ప్రయత్నిస్తోంది.ఇదే భారత సనాతన ధర్మం .
ధర్మం అంటే అర్ధం?
నువ్వు దేనితో తయా రయ్యావో దాని గుణాలను వ్యక్తీక రించ డమే నిజమైన ధర్మం . ధర్మం అనగా బాధ్యత .
దేనితో తయా రయ్యావో నీకు తెలిసి ఉంటేనే నీ బాధ్యత నువ్వు చక్కగా నిర్వర్తిస్తావు .
"నువ్వు " దేనితో తయారయ్యావు?
ఎముక,మాంసం,నరాలు,నాడులు ,ఇంద్రియాలు ,మనస్సు,ప్రాణం ,కారణ శరీరం --వీటన్నింటి తోనా ?
పరిశీలిద్దాం ...
గాడ నిద్ర పోయినప్పుడు శరీరం ,మెదడు,మనస్సు ఏమీ పని చేయవు. ఐనా మేలు కోగానే "నేను" బాగా నిద్ర పోయాను ' అని అంటావు . శరీరం ,మెదడు,మనస్సు -ఈ మూడు నువ్వు కాదు అని అంగీక రిస్తున్నావు .
కానీ ప్రాణం పని చేస్తూ నే ఉంటుంది. ప్రాణం అనేది అగ్ని శక్తి . అదే చోదక శక్తి . ఆ శక్తికి నిరంతరం ఇంధనం -అనగా ఆహారం,నీరు,గాలి కావాలి. (కొందరు యోగులు ఇవేమీ లేకున్నా సూర్య శక్తిని గ్రహిస్తూ ప్రాణాగ్ని ని నిలుపు కొంటారు).
ప్రాణం కన్నా సూక్ష్మ మైన స్థాయిలో కారణ శరీరం, దీని కంటే సూక్ష్మ స్థాయిలో ఆత్మఅనేది
ఉంటుందని యోగుల వాఖ్య. (చిత్త శుద్ది తో ధ్యాన సాధన చేసి న వారే ఇది నిజమా కాదా అనేది చెప్ప గలరు).
శరీరం ,మెదడు,మనస్సు - ఇవన్నీ నీకున్న ఆయుధాలు మాత్రమే .
ప్రాణం,కారణ శరీరం స్థూల ఉపాధులు. అనగా ఆత్మ ని శరీరం లో బంధించే సూత్రాలు .
కర్ణుడికి కవచ కుండలాలు ఉన్నట్లు ఇవన్నీ నీతో మమేక మై ఉన్నాయి .
ఆత్మ అసలైన ఉపాధి .
నువ్వు శరీరం కాదు,మనస్సూ కాదు అని తెలుసుకొని చివరకు ప్రాణం , కారణ శరీరం , అహం కూడా అసలైన నేను కాదు ,అది ఒక మిధ్యా నేను ' అని అవగాహన కలిగినప్పుడు మిగిలే అనుభూతి ఏదైతే ఉందో అదే అసలైన నేను. ఆ అనుభూతి కలగడ మే ఆత్మ ఆవిష్కారం.
ఆత్మ అనేది అవ్యక్తం , నిర్గుణం, స్వయం ప్రకాశం, గుణ రూప రహితం, సంప్రజ్ఞ.
ఆత్మ కి ద్వంద స్వభావం ఉండదు .
అనగా సుఖ దుఖాలు ,రాగ ద్వేషాలు లేవు . సమాచార స్వీకరణ లో ద్వందానుభూతి లేదు .
సమతాస్థితి ,సంకల్ప- వికల్ప రహిత స్థితి .కర్మ -అకర్మ స్థితి .
ఈ స్థితికి చేరు కోవడ మే మనిషి గమ్యం .
ఆ ఆత్మ స్థితికి చేర డానికి మనం చేసే ప్రయత్న మే ఆధ్యాత్మిక సాధన .
అంటే ఆత్మ గత ధర్మ మే మన స్వధర్మం .
మన ఎరుక (చైతన్యం ) ఎంత వరకు ఉంటుందో అంత వరకే మన ప్రవర్తన ఉంటుంది .
మన ఎరుక శరీరానికే పరిమిత మైతే ,శరీరానికి ఇంద్రియాల ద్వారా కలిగే అనుభవాలు కావాలి . జ్ఞానేంద్రియాలు -ఎప్పుడూ ఏదో ఒక సమాచారం మెదడుకి పంపుతాయి . మనస్సు ,బుద్ది (విశ్లేషణ -జ్ఞా పక శక్తి -విచక్షణ తో) ఆ సమాచారాన్ని అహం ద్వారా గుర్తించి అవసరాన్ని బట్టి ప్రతిచర్య చేస్తుంది .
మన చిత్తం లో ఉన్న గుణాలను బట్టి మనలో కలిగే భావ స్పందనలకు అనుగుణం గా కోరికలు జనిస్తాయి. మనస్సుకి తనేది కావాలను కొంటుం దో అది దొరికే వరకు మధన పడుతూ ఉంటుంది .
ప్రాణానికి నిరంతరం శక్తి కావాలి .
కారణ శరీరానికి కర్మ భారం తగ్గుతూ ఉండాలి .
అహంకారం తృప్తి కోసం అన్వేషిస్తూ ఉంటుంది .
ఎరుక క్రమం గా ఆత్మ గత మై నప్పుడు ఆత్మ స్థితి లో ఉంటాము .
సామాజిక ధర్మం అనేది ఆయా సమాజాల లో శాంతి , సౌభ్రాతత్వం వెల్లి విరియడానికి ఏర్పాటు చేసుకొన్న కట్టుబాటు .
"ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయవచ్చు. ఒక గ్రామం ప్రయోజనాల కోసం ఒక కుటుంబం మొత్తాన్ని బలి చేయవచ్చు. ఒక దేశ సౌభాగ్యం కోసం ఒక గ్రామం మొత్తాన్ని వదులుకోవచ్చు. విశ్వశ్రేయస్సు కోసం ఒక దేశాన్ని పణంగా పెట్టవచ్చు. తాము ఏర్పరుచుకున్న అంతిమ లక్ష్య సాధనకు ఈ ప్రపంచం మొత్తాన్ని వదులుకోవచ్చు.
ఇలాగే వర్ణాశ్రమ ధర్మం ,రాజ ధర్మం , కుటుంబ ధర్మం , ఇలా పరి పరి విధాలుగా బాధ్యతలు మనిషికి ఉన్నాయి .
జీవితాన్ని -రోజు వారీ జీవ నాన్ని ఆస్వాదించడ మే మనిషి ధర్మం
జీవితంచాలా పరిమితమైన కాలం మాత్రమేనని తెలుసుకుంటేనే మనకు జీవి తం పై ఆసక్తి పెరుగుతుంది .
ప్రస్తుత కాలంలో మనుషులకు తాము అశాశ్వతం అని అర్థం చేసుకోవడానికి ఒక జీవిత కాలం పడుతోంది. వారికది గుర్తు చేయడానికి గుండెపోటో లేదా మరో ప్రాణాంతకమైన గడ్డో కనిపించాలేమో!
ఆధ్యాత్మికత అంటే మనం శాశ్వతం కాదని ప్రతి క్షణం గుర్తెట్టుకొని అలజడికీ, నైరాశ్యానికీ, ఆందోళనకీ, కోపానికీ తావు లేకుండా హాయిగా ప్రేమగా జీవిస్తూ మరణా నంతర జీవితాన్ని(పరం ) గురించి సహజం గా ఆలోచించడం .
అప్పుడే , ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది సహజమైన ఎదుగుదల ప్రక్రియగా మారుతుంది.
ఆధ్యాత్మికత ప్రయత్నపూర్వకంగా చేసేదిగా ఉండదు.
భగవద్ ప్రార్ధన - కైంకర్యం :
ప్రార్థనకు కారణం అత్యాశ, భయం కా కూడదు.
ప్రార్ధన అంటే స్తోత్రాలు ,పద్యాలు పాడట మొక్క టే కాదు,ప్రార్థనాయుతంగా ఉండడం. అంటే మొత్తం మన జీవనాన్నే ఒక అర్పణగా మార్చడం, అది మనంత మనమే అర్పించుకునే ప్రక్రియ.
మనసా వాచా కర్మణా ఆత్మ గత జీవనం సాగించ డ మే శరణాగతి .
ఆత్మ అనగా దైవం
ఈ సృష్టి లో ఒక నీవూ భాగమని అనుకోవడం జీవనం .
నీలోనే ఈ సృష్టి ఉందనే సుస్థిర అనుభూతి కలగడం మోక్షం .

good
ReplyDelete