గీతా గానం -1
వేద శాస్త్రి, వాద
శ్రేష్టి వైవిధ్య
పాలెం ఊరు మధ్య నున్న చెట్టు కింద కూర్చొని బాతాకానీ వేస్తున్నారు. రాబోయే దసరా కి
గుళ్ళో ఉత్సవాలకు కార్యక్రమాలు,పురాణ కాల క్షేపాలు ఏమేమి పెట్టాలా అని శ్రేష్టి
అడిగాడు .
గీతా ప్రవచనం పెడదాం,విని తరిస్తారు జనం అని బదులిచ్చాడు శాస్త్రి.
కుర్రాళ్ళు రికార్డింగ్ డాన్సులు కావా లంటున్నారు,అన్నాడు శ్రేష్టి.
అవన్నీ పాతరొజులు.ఇప్పుడు మన కుర్రజనం కూడ బాగా చదువుతున్నారు. పై
చదువుల కెల్లే వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు భగవద్గీతలో బోలెడు ఉన్నాయి. కాబట్టి
పూర్ణయ్య అవధానిని వెళ్ళి కలుద్దాం. నవరాత్రులుతొమ్మిది రొజులూ నిత్య
జీవితం లో గీతని ఎలా ఆచరణ లోకి తీసుకోవాలో చెప్పమని అడుగుదాం.
సరే అనుకొని , ఇద్దరూ మరి కొందరు గ్రామ పెద్దలతో కలిసి పూర్ణ
అవధానిని కలిసి విషయం విన్నవించగా, ఆయన కూడా సరే నని మాట ఇచ్చాడు .
నవ రాత్రి సంబరాలు మొదలయ్యాయి . పందిళ్ళు ,జంగిడీ జిలేబీలు
,పొంగళ్ళు, అంగళ్లు షురూ ఐనాయ్ .
రాత్రి 7గంటలకు అవధాని గారు ప్రవచనం ప్రారంభించారు .
నిత్య జీవితం లో సంతొషం గా ఉండా లనే ప్రతి మనిషి కోరిక.
ఆ సంతొషం శాశ్వతం గా ఉండా లని అనుకొంటాడు మనిషి.
ఈ ప్రపంచం లో మనిషి కి ఎదురయ్యేవి ఏమిటి?
అనుభవాలు.
అనుభవాలు ఎలా కలుగుతాయి?
వస్తువులు,మనుషులు,జంతువులు,వాతావరణం,పర్యావరణం వలన అనుభవాలు
కలుగుతాయి .
వీటి నుండి వచ్చే స్పందనలను
గ్రహించి,తిరిగి స్పందించడ మే మనిషి చేసేది.
అనగా,స్వీకరించడం,స్పందించడం-దీనినే అనుభవం అని అంటాము.
ఇలా ఎన్నో అనుభవాల కలబోత జీవితం.
ఆ అనుభవాలు సుఖాన్ని ఇస్తే సంతొషం,బాధని కలగ
చేస్తే దుఖం .
సుఖం ఇచ్చే వాటిపై రాగము,దుఖం కలిగించే వాటిపై ద్వేషం.
శరీరానికి సంబంధించిన అనుభవాలను శీతోష్ణము లని ,
మనస్సుకి కలిగే ద్వంద ములను, సుఖ దుఖములని,
అహానికి కలిగే వాటిని మాన అవమానములని గీతాకారుడు వర్గీకరించాడు.
సరే!గీత ఏం చెప్పింది?
గీత చాలా చెప్పింది . మనిషి ఎలా జీవిస్తే ఆనందం గా , ప్రశాంతం గా
ఉంటాడో వివరం గా చెప్పింది .
సహజీవనము ,సమతా భావము మనిషి భౌతికము గా చేయవలసిన కర్తవ్యం .
స్థిత ప్రజ్ఞ , సంతృప్తి మనస్సులో నిలుపు కోవలసిన లక్షణములు .
ప్రశాంత ఆనంద స్థితి అనగా ఆత్మ స్థితి మనిషి చేరు కోవలసిన గమ్యం .
1. ఎల్లప్పుడు ఆనందం గా
ఉండాలి.(బాహ్య స్పందనలతో కలిగే తాత్కాలిక సంతోషం వేరు. ఎలాంటి బాహ్య
ప్రేరణ లేకుండా శాశ్వతం గా ఉండే ఆనంద స్థితి వేరు).ఆనందం గురించి తర్వాత చెప్పు
కొందాం .
2. అన్నింటినీ సమత్వ
ద్రుష్టి తో చూడాలి.-
మానవ సంబంధాలను , వస్తువులను , సంఘటనలను -అవి ఎలా ఉన్నా సమత్వం గా
ఎలా ఉండాలో నేర్పే జీవన శాస్త్రమే భగవద్గీత .
అంటె దేనికిచ్చే విలువ దానికి ఇవ్వాలి. దేనినీ తక్కువగా
చూడకూడదు.దేనినీ ఎక్కువగా చూడకూడదు.మట్టి విలువ మట్టికి ఉంటుంది.బంగారం తో ఇల్లు
కట్టలేము కదా!సూదితోచేసే పని కత్తి పెద్దదని,కత్తితో చేస్తా మా?
అన్ని రకాల స్పందనలను సమత్వం తో స్వీకరించాలి.
సుఖాన్ని, దుఖాన్ని మొదలైన ద్వందాలను సమత్వం తొ చూడటం అంటె ఏమిటి?
సంతోషానికి ఎగరకూడదు . దుఖాలకు చతికిలపడకూడదు.
బంగారాన్ని, మట్టిని సమంగా చూడటం అంటె బంగారాన్ని మట్టిలాగ బయట
పడేయమని కాదు.
మట్టిని ఇంట్లో దాయమని కాదు. ప్రతి దానికీ ఈ స్రుష్టిలో విలువ ఉంది.
ఆ సంగతి గ్రహించి నడచుకోవాలి.
ఒక యోగి పట్టు పరుపు పైనా , మట్టి నేల పైనా ఒకే విధ మైన భావం తో
పడుకో గలడు .
మానవ సంబంధాలను నేడు డబ్బుతో కొలుస్తున్నారు.
డబ్బుకి ఇచ్చే విలువ ,సంబంధాలకు ఇచ్చే విలువ కన్నా తక్కువ ఉండాలి.
ఆ డినామిణేషన్ తప్పితే సంబంధాలు చెడిపోతాయి.
అది వస్తువు కానీ ,మనుషులు కానీ, దేనికి మన జీవితాలలొ సరైన విలువ
ఇవ్వా లనేది
శాస్త్ర ప్రమాణం గా ఆచరించాలి.
అంటె సమత్వం అనేది ప్రతి దాంట్లో ఉండాలి.
వస్తువులు,ఆస్థులు,మానవ సంబంధాలు,పరిస్థితులు -ఏవైనా అన్నింటిలో
సమత్వం ప్రదర్శించమని
చెప్పింది గీత.
గీతా సూత్రాలను మనిషి ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం.
మనిషి రోజువారీ చేసేవి - (perception and reaction)-
సమాచార గ్రహణం: స్వీకరించిన
స్పందనలను మనస్సులొ బేరీజు వేసుకొని సమాచారం గా మార్చు కొని దాని వలన
సంతొషమో,బాధో,విసుగో పొందుతాడు.
బాహ్య స్పందనలను సమాచారం గా మార్చు కొన్న తర్వాత ఏ అనుభూతిని
పొందాలో,నిర్నయం చేసే శక్తిని బుద్దికి ఇవ్వాలి. బుద్దికి ఆ శక్తి ఎలా వస్తుంది?
నిరంతరం గీతా సూత్రాలను పారాయణ , అభ్యాసం,అవగాహన,ఆచరణ,అనుస్మరణ చేస్తా ఉంటె
మనస్సుకు కలిగే అనుభవాలను
బుద్ది నియంత్రించ గలదు.
ఇక్కద జరుగుతుంది ఏమిటీ అంటె,తెలుసుకొన్న విషయాన్ని మనస్సులో బాగా
ఇంకే విధం గా చేస్తున్నాం.కేవలం విషయాలను తెలుసు కొంటె అది మన నడతను మార్చ
లేదు.
విషయ పరిజ్ఞానం వేరు.దానిని ఆచరణలో పెట్టాలీ అంటె ఆ పరిజ్ఞానం
మన మనస్సు
లోతుల్లోకి ఇంకి సుస్థిర మవ్వాలి.
ఉదాహరణ కు , మీరు పళ్ళరసం తాగుతున్నారు.గ్లాస్ పెదాలవరకు
వచ్చింది.అప్పుడు సడన్ గా ఎవరో గట్టిగా అరిచారు,అందులో విషం కలిసిందీ" అని.
అంతె తటాలున ఆగ్లాస్స్ ని పక్కన పెట్టేశారు.
ఏం జరిగింది ఇక్కడ? విషం ప్రాణం తీస్తుందనే పరిజ్ఞానం మీకు ఉంది.
ఆ పరిజ్ఞానం మీ మనస్సులో,బుద్దిలో బాగా ఇంకి ఉంది. అందుకే మీరు
గ్లాస్స్ ని వెంటనే పక్కన పడేశారు.
అదే ఆ పరిజ్ఞానం మీ మనస్సులో ఇంకి ఉండక పోతే,మీరు కొంత పళ్ళ రసాన్ని
తాగేశే వారు.
గీత కూడా అంతె. మనం గీతా వాఖ్యాలను బాగా జీర్ణం చేసుకొని మన
బుద్దికి,మనస్సుకి పట్టించక పోతే ఎన్నిసార్లు పారాయణం చేసినా ఫలితం ఉండదు.
సార్!నేను లక్ష సార్లు గీతని చదివాను,నాకేమీ ఫలితం కనబడలేదు అని
ఒకాయన అంటె,ఓ గురుజి అన్నారు,ఇప్పటి వరకు నువ్వు గీతా పారాయణం చేశావు.
ఇప్పటి నుండి గీతని నీలోనుండి వెళ్ళనివ్వు.
చిన్న ఉదాహరణ - రోజూ పెందర కడ లేచి వాకింగ్ చేద్దామని గట్టిగా అనుకొంటాం.కానీ
మెలకువరాదు. మళ్ళీ మళ్ళీ గట్టిగా మనస్సులొ తీర్మానం చేసుకొంటాం.
కానీ వారం గడిచింది,నెల మారింది. పొద్దునే లేవ లేక పైగా ఎలా
సమర్ధించు కొంటాడు.
అంటె-పొద్దునే లేసి నడిస్తే జలుబు చేస్తుంది,అందుకే చేయ లేక పోతున్నా
అంటాడు.
ఇక్కడ జరిగింది ఏమిటీ అంటె,అతనికి వాకింగ్ చేస్తే ఆరోగ్యం అనే
పరిజ్ఞానం ఉంది.
కానీ, సోమరితనం వలన అతనికున్న పరిజ్ఞానాన్ని కూడ తప్పుగా చేసి సరి
పెట్టు కొంటున్నాడు.
కాబట్టి పైపై పరిజ్ఞానం ఎప్పుడూ పనిచెయ్యదు.
అలాగే మనకి ఎన్నో గడ్డు పరిస్థితులు జీవితంలో ఎదురవ్వుతాయి.
మన కర్మని బట్టి మన తలరాత ఉంటుంది. నా తలరాత అంతె" అని స్థిమిత
పడతారు
కర్మ యోగం ఆచరించే వాళ్ళు.
ఆ దేవాది దేవుడి శరణు పొందాను.ముంచినా,తేల్చినా ఆయనదే భారం" అని
భక్తి
యోగీయులు త్రుప్తి పడతారు.
గడ్డు పరిస్థితులు వస్తే ఈ అనిత్యమైన శరీరానికి వస్తాయి.
నేను ఆత్మను !నన్నేవీ చేయలేవు.బాధనూ పెట్టలేవు,సంతోష పెట్టలేవూ అని
జ్ఞాన యోగీయులు ధైర్యం గా ఉంటారు.
మనిషి వస్తువులను, పరిస్థితులను,జంతువులను బాగా నే ఎదుర్కొంటాడు
.
మనుషులను ఎదుర్కోవడమే అన్నింటి కన్నా కష్టం .
వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు,హేళన చేస్తున్నాడు,వాడి దృష్టిలో
పలుచన అవుతున్నాను ,
వీ డు మొన్నటి వరకు నన్ను మెచ్చు కొన్నాడు,ఇప్పుడేం అను కొంటా
డో ,
పది మందిలో పరువ పోయింది, ఇప్పుడెలా ?
వాడికి కారు ,ఇల్లు, అన్నీ బాగా ఉన్నాయి . నాకు లేక పోవడం కన్నా
వాడికన్నీ ఉండటం బాధ పెడుతుంది ,
ఎదుటి వాడికి పదవీ దక్కింది . నాకేమీ అవకాశ
ము రావడం లేదు .
వాడు, నేను సమానం గా కష్ట పడుతున్నాం . అయినా వాడికే
ప్రమోషన్ వచ్చింది .
వాడిని నమ్మి ఆ పని అప్ప చెప్పాను . వాడి వలన చెడ్డ పేరు వచ్చింది .
వాడు బాగా చూసు కొమ్టాడని పిల్లనిచ్చాను . వాడిట్లా చేస్తున్నాడు .
పెద్దయ్యాక బాగా చూస్తారని ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను చదివించాను
. వాళ్ళు నన్ను చూడటం లేదు .
వాడికి నా కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి . వాడికి డొనేషన్ కట్టకుండా
సీటు వస్తుంది .
నా కర్మ ఇలా కాలింది . -
ఇలా చదువు కునే పిల్లల దగ్గర నుండి ఉద్యోగాలు ,ఇతర వృత్తులు
చేసే వారందరూ
సంఘం లో తాము గొప్ప అనిపించు కోవాలని ఆరాట పడతారు .
సంఘం లో పది మంది ఎక్కడికి ప రు గేడితే ,మిగతా వాళ్ళు అటే
ప రు గెత్తు తారు .
దీనికి పరిష్కారం గీత ఏం చెప్పింది ?
విచక్షణ పెంచు
కోమని ,దానిని అడుగుఅడుగునా ఉపయోగించ మని ,
అన్ని వేళ లా గమనిక తో ఉండమని చెప్పింది . ప్రతి వారు
తగినంత హొమ్ వర్క్ చేయాలి .
మనం ఎందుకు ఆందోళన పడుతున్నాము ? ఎందుకు భయ పడుతున్నాము ?
ఎందుకు బాధ పడుతున్నాము ?
వస్తువుల లేకనా ? పరిస్థితులు సంతోష దాయకం గా లేవనా? సంఘం నవ్వుతుంద
నా ?
అని విడదీసి పరిశీలించు కోవాలి .
మనకేం అవసరం ?
మనం ఎవరిని నమ్మ వచ్చు . ఎవరిని నమ్మ కూడదు ?
మనం ఏం ఆశిమ్చ వచ్చు ? ఏది ఆశిమ్చ కూడదు ?
ఎదుటి వాడికి ఏమేమి ఉంటె అవన్నీ మన కుండా లా ?
మనం కనే కలలు ,ఊహలు నిజం చేసు కోవడానికి మనకు తగిన సామర్ధ్యము,
కష్ట పడే తత్వము ఉన్నాయా ?
ఇలా విచక్షణ తో సంఘటనలను ,విషయాలను ,కోరికలను, నిరాశలను విడమర్చి
చూసు కొంటే
వివేకం పెరుగుతుంది .
ఏది ఎంతవరకు మానవ ప్రయత్నం తో జరుగుతుంది ?
ఎక్కడ వరకు మనం కష్ట పడి పని చేయాలో , ఎవరి నుండి ఎంత వరకు
ఆశించ వచ్చో అర్ధం అవుతుంది .
వివేక జ్ఞానం అంటే ఇదే !
ఇంత విచక్షణా శక్తి లేని వారు ,అన్ని రకాల ఆందోళనలు
కట్టి పెట్టి "దేవుడా ! నీవే శర ణు "
అని శర ణా గతి చేస్తారు .
మరి కొందరు , నా తలరాత అలా వుంది లెమ్మని సరి పెట్టుకొని ,ఇక నుండైనా
శాస్త్రం లో చెప్పిన విధం గా సుకర్మలు చేసి పాప భారమును తగ్గించు కొంటా మని
నిర్ణయం చేస్తారు .
మరి కొందరు ఈ సంసార జంజాటం అంతా శరీరానికి సంబంధించిన వ్యవహారం ,నేను
" శరీరా న్ని కాదు ,ఆత్మని -అనే భావం తో దైర్యం గా ముందుకు సాగుతారు .
ఒకే మనిషి లో కూడా ఈ విధమైన భావాలు వేర్వేరు దశ లలో ఉండవచ్చు .
భగవద్గీత అంటే జీవితానికి ఓ మాన్యువల్ .
మిగతా విషయాలు తర్వాత చెప్పు కొందాం .
Comments
Post a Comment