భౌతిక -ఆధ్యాత్మిక చింతన
మానవ జీవన విధానం ,మానవ పరిణామం
, పురుషార్ధములు , మోక్షము ,
కర్మ చక్రము , జనన మరణ ములు ,ఇహలోక -పరలోకములు
,
చైతన్యము ,ఆత్మ నిత్యత్వం , -ఇవన్నీ భౌతిక ,ఆధ్యాత్మిక వాదుల మధ్య విబేధాలు
కలిగించే వాదనలు .
"భౌతిక పదార్ధ -శక్తి శాస్త్రం" అవిద్య అని ఆత్మ నిత్య వాద మే
అసలైన సత్యమని,
ఆత్మ స్థితికి చేర్చే శా స్త్రములే (పరా
విద్య ) అని ఆధ్యాత్మిక వాదులు అంటారు .
ఆధ్యాత్మిక సాహిత్యం అంతా ట్రాష్ అని భౌతిక వాదులు తెగనాడతారు .
పురుషార్ధాలు నాలుగు అని చెప్పినా ,మనిషి జన్మ లక్ష్యం మోక్షం ఒక్కటే
!
సరే, దైవం మానవ జన్మ ఇచ్చింది దేని కోసం ?
వనరులను అంది పుచ్చుకొని అనుభవించడ మే గమ్యమని భౌతిక వాదులు ,
ధర్మ చట్రం లో నే వనరులను అనుభవిస్తూ మోక్ష సాధన చేయాలని ఆధ్యాత్మిక
వాదులు అంటారు .
ఆధ్యాత్మిక వాదం -
మానవ శరీరం ని తొడుక్కున్న జీవాత్మ అనేక
విధములైన కర్మలతో నిండి ఉంటుంది .
ఆయా కర్మల భారాన్ని తగ్గించు కోవడమో ,పూర్తిగా తొల గించు కోవడమో చేయాలి
.
ఈ కర్మలను పూర్తిగా భస్మం చేసు కోవాలీ అంటే సత్కర్మల ద్వారా నే సాధ్య
పడుతుంది .
అటు దేవతా రూపములలో గానీ ,ఇటు చీకటి
లోకపు స్థితుల తో గానీ
కర్మలను తుడిచి వేసు కోవడం సాధ్య పడదు .
కర్మ లను తగ్గించు కోవడం లో మనిషి
గమనం రెండు రకాలు -ఒకటి సన్యాసం ,రెండోది గ్రహస్థు .
ఎవరైతే బతకటం కోసం ఆహరం తింటారో ,
ఎవరైతే ఆకలి అయినప్పుడే ఆహరం వెదుక్కొం టారో ,
ఎవరైతే ఒకే చోట 3 రోజు ల కంటే ఎక్కువ గడపరో ,
ఎవరైతే మనోవాక్ కర్మల పరం గా మౌనం గా ఉండ గలరో
ఎవరైతే వివేక విచక్షణ లతో వైరాగ్యాన్ని అభ్యసించ గలరో - వారే
సన్యాసానికి అర్హులు .
గృహస్థు లు తమ బతుకు ప్రశాంతం గా గడపుతూ మోక్షం పొందా లీ అంటే ,
తప్పనిసరిగా ధర్మ విధానం లో అర్ధ కామా లను అనుభ వించాలి .
గృహస్తు కి ధర్మ ఆచరణ తొలుత చాలా కష్టం గా ఉంటుంది . చుట్టూ ఉన్నవారు
ఎక్కువ మంది ధర్మ సాధన
చేస్తూ ఉంటే మనమూ ధర్మం గా ఉండ టం తేలిక . కానీ , ఎక్కువ మంది అధర్మ
పరులు ఉంటె
ధర్మం గా నడవడం కత్తిమీద సామే !భౌతిక విషయాల పై మోహం ,
మానవ సంబంధాలపై మమకారం -ఇవన్నీ మనిషి అహంకారానికి గుర్తులు .
అహాన్ని భస్మము చేసు కోవడం గృహస్తు గా మనిషి
గమ్యం .
ఆ గమ్యం చేరడానికి ఉన్న మార్గాలు కర్మ ,భక్తి ,జ్ఞాన ,ధ్యాన యోగ
పద్దతులు .
దైవం , గురువు ,శాస్త్రం పై ఎడతెగని శ్రద్ధ వాటికి తొలి
మెట్టు .
కానీ భౌతిక వాదులు దీనికి ఒప్పు కోరు . ఈ విశ్వం లో ఉన్న వనరులు
,ప్రాణులు పరిణామ
పరం గా వృద్ది పొందినవే . బలాన్ని బట్టి ఈ వనరులను వాడు కోవడం
ప్రాణుల
పుట్టుక కాలం నుండీ జరుగుతుంది .
యుక్తి , బలం, ఉన్న ప్రాణులు పెంపొంది వర్ధిల్లు తాయి .
మంచి -చెడు అనేవి ప్రశాంతత కోసం మన
సమాజం ఏర్పరచు కొన్న నియమాలు .
ధీ శక్తి , తద్వారా సాంకేతిక శక్తి ని ఉపయోగించడం లో మనిషిని మించిన
వారు లేరు .
చెట్లు , జంతువులూ మరణించి మట్టిలో కలిసి పోయినట్లే ,మనిషీ అంతే !
పునర్జన్మ,కర్మ చక్రం అనే వి మానవ మెదడు ఊహిమ్చు కొన్న ఓ
సిద్దాంతం .
ఆ సిద్దాంతం సరైనదో కాదో భౌతిక పరం గా ఇంతవరకు నిరూపించ లేదు .
అభౌతిక విషయాలను అభౌతికం గా నే గ్రహించాలని ఆధ్యాత్మిక వాదుల
వాదన !
భౌతిక వస్తువు అభౌతిక మవ్వడం మరణించి నప్పుడే సాధ్య పడుతుంది .
సిద్దులు అనేవి కూడా అత్యంత అభివృద్ధి చెందిన మానవ శక్తి యుతులే
గానీ ,
దైవ శక్తికి సంబంధం లేనివని యోగులే చెబుతున్నారు .
దైవ శక్తి ఈ విశ్వం నకు చోదక శక్తి అని ఆధ్యాత్మిక వాదులు
చెబుతున్నారు .
ఈ సృష్టి నిర్వహణకు , ఏదో ఒక శక్తి ఉండాలని భౌతిక సిద్దాంతం
కూడా ఒప్పు కొంటుంది .
కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటీ అంటే, వెనుకనున్న ఆ శక్తికి కూడా మనిషి కి
ఉన్నట్లే
మనస్సు కూడా ఉంటుందని ,ఆ మనస్సు కి వెనక చైతన్య స్థితి ఉంటుందని ,
అది నిత్య ఆనంద ప్రశాంత ప్రజ్ఞాన స్థితి "
అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్న సిద్దాంతం
నిరూపణ చేయ లేదు .
విశ్వం లోని గ్రహ నక్షత్రాలకు ,అనగా పదార్ధానికి కూడా అత్యంత సూక్ష్మ
స్థాయిలో
మనస్సు , చైతన్యం ఉంటాయని ఆధ్యాత్మిక వాదులు అంటారు .
చైతన్యము ---->శక్తి ------> పదార్ధము -ఇది ఆధ్యాత్మిక వాదుల
సమీకరణం .
చైతన్యం అనేదానిని భౌతిక వాదులు ఒప్పుకోరు .
శక్తి -పదార్ధ నిత్యత్వ సూత్రాన్ని మాత్రమే ఒప్పు కొంటారు .
మానవ శరీరం లో బాగా వృద్ది పొందిన మనస్సు, బుద్ది ఉండి , వివేకాన్ని
,విచక్షణ ను పెంచు కొనే
సామర్ధ్యం ఉంటుంది . మిగతా జంతువులూ, కీటకాలు మొదలగు ప్రాణులకు వివేక
విచక్షణా సామర్ధ్యం
అత్యంత తక్కువగా ఉండే శరీర నిర్మాణం ఉండటం వలన ఇది సత్కర్మ ,అది
దుష్కర్మ అనే విచక్షణ ఉండదు .
వాతావరణం ,ఋతువులు , శరీరం లోని హార్మోన్ ల పైన వాటి ప్రవర్తన
ఆధార పడి ఉంటుంది .
మానవ శరీరం కూడా జంతువుల మాదిరిగా నే ఋతువులకు, వెలుగు -చీకటికి
,హార్మోన్ లకు
లోబడి పని చేస్తుంది . కానీ బుద్ది అనే మానసిక విభాగం పరిణామం
చెందడానికి అనువుగా ఉంటుంది .
పర్యావరణానికి ,హార్మోన్ లకు ,లొంగి ఉన్న శరీరము ,చిత్తము పూర్వపు
కర్మల భారానికి
కూడా లొంగి ఉంటుంది .
"చర్య -ప్రతిచర్య " అనేది ఏ శరీరానికైనా ఉండే సాధారణ మైన
క్రియ .
సమాచార గ్రహణం(cognizance) ---> విజ్ఞానం (Knowledge)
--> విచక్షణ ( Discrimination)-->వివేకం(Wisdom)---> ప్రతిచర్య
(Reaction). ఈ ప్రతిచర్య అనేది 3స్థాయిలలో ఉంటుంది .
ఆలోచన ,వాక్కు ,క్రియ . ఇవన్నీ కూడా ప్రతి ప్రాణికీ ఉంటాయి .
కానీ మనిషి బుద్ది జీవి . మనిషిలో ఈ 3 క్రియలు అత్యంత హెచ్చు స్థాయి
లో ఉంటాయి .
సాహిత్యం, నాట్యం , సంగీతం మొదలుకొని 64 కళలు వృద్ది పొందడానికి
మూల కారణం పరిణితి చెందిన బుద్ది .
ఈ విశాల విశ్వం లో ఇప్పటివరకు మానవ బుద్ది ని పోలి
ఉన్న జీవులను మనం చూడలేదు .
కానీ , అంతటి బుద్ది ఉన్న ప్రాణులు విశ్వం లో ఉంటాయని అందరి నమ్మకం .
మన మనుషు ల్లోనే ఈ బుద్ది అనేది , అందరికీ ఒ కే విధం గా
వృద్ధి చెంది ఉండదు .
కర్మల భారం అనేది స్తితి శక్తి రూపం లో ఉన్న జీవ కాంతి . దీనికి రుణ
విద్యుత్ ఆవేశం ఉంటుంది .
ఈ ఋణ ఆవేశాన్ని న్యూట్రల్ చేయడానికి ధనాత్మక ఆవేశపు శక్తిని పొందాలి
.
మనస్సు లో కలిగే సంకల్పాలు ,ఆలోచనా వృత్తులు ఋణ శక్తిని
పెంచుతాయి .
అందుకే సంకల్ప రహితం, ఆలోచనా రహితం కావాలని ధ్యానసాధనలో అది తొలి
మెట్టని చెబుతారు .
ధ్యానం లో సాక్షీత్వం మాత్రమే ఉంటుంది . సాక్షిగా ఉండటాన్ని అభ్యాసం
చేయడానికి ఎంతో
ఓర్పు, ఏకాగ్రత ఉండాలి . సాక్షి గా గమనిస్తున్నప్పుడు ఎలాంటి
ముందస్తు
అభిప్రాయాలు(presumptions) గానీ, తీర్పులు(judgmentary) గానీ
లేని స్థితిలో ఉండాలి .
ధ్యానం ద్వారా ధనాత్మక ఆవేశము ఉన్న దైవ శక్తి మనలోకి ప్రవహిస్తుంది .
అనగా మానవ శరీరము దైవానికి వాహకముగా మార్పు చెందుతుంది .
ఋణాత్మక శక్తి ఉన్న ప్రక్రుతి(nature forces), ధనాత్మక
ఆవేశము ఉన్నదైవ శక్తి(divine energy),
ఈ రెండూ తటస్థ దైవ చైతన్యానికి(Divine consciousness) రెండు
పార్శ్వాలు .
శక్తి తటస్థ మై నప్పుడు మాత్రమే ఋణాత్మక కర్మ
భారం నెమ్మదిగా మాసి పోతుంది .
జీవాత్మ దైవ చైతన్య స్థాయికి తిరిగి చేరు కొంటుంది .
భౌతిక వాదులు కూడా ఇక్కడ వరకు ఒప్పు కొంటారు . పదాలు తేడా
. భావం ఒక్కటే !
ధ్యానం వలన మానసిక "చర్య -ప్రతి చర్యల " హడావిడి తగ్గు
తుంది . దానితో మానస సంచలనం ,ఆలోచనా తరంగాలు బాగా తగ్గి మనస్సు ఓ ప్రశాంత స్థితిని
చేరు కొంటుంది . దానినే ఆత్మ గత సమాధి అని ఆధ్యాత్మిక వాదులు అంటున్నారు . .
ఇక మోక్షం ,జన్మ రాహిత్యం , కర్మ చక్రం నుండి విముక్తి ---ఇవన్నీ
ఆధ్యాత్మిక వాదులు వాడే పడికట్టు పదాలు .
ఎందుకంటే జన్మ రాహిత్యాన్ని ఇంతవరకు నిరూపణ చేయ లేక పోయారు .
మనిషి నాగరికత అభివృద్దికి మూలకారణం కోరికలు .
అలాంటి కోరికలవలన ఎక్కువ మందికి నష్టం జరిగినప్పుడు కోరికలను
తగ్గించు కోవలసిందే .
నీకున్న కోరికల వలన నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న వారికి
కష్ట నష్టాలు కలిగితే
ఆ కోరికలను మనస్సులో నుండి తుడిచి వేయ వలసిందే !
దీనికోసం దేవుడు, జన్మరాహిత్యం అనే భావాలు ప్రచారం చేయ నక్కర లేదు .
మనిషిని క్రమశిక్షణలో ఉంచడానికి ప్రభుత్వం ఒక పక్క ,మతం ఒక పక్క
ఉన్నాయి .
మతం ,ఆధ్యాత్మికత వేర్వేరని అందరికీ తెలిసిన విషయమే !
భౌతిక వాదులైన ,ఆధ్యాత్మిక వేత్త లైనా వారి గమ్యం శాంతి .
కాబోతే , ఇహం లోనే కాదు పరం కూడా నిజమని , ఆ పరంలో కూడా
శాంతి అవసరమని ఆధ్యాత్మిక వేత్త ల సూచన .
Comments
Post a Comment