పుష్కరాల అంతరార్ధం




గోదావరి పుష్కరాల మహోత్సవం .
సనాతన భారతా వని లో మానవ జీవితం ఓ మహా ప్రస్తానం . పంచ భూతాలను పంచ జ్ఞానేం ద్రియాలతో ఆస్వాదిస్తూ , కృతజ్ఞత గా  పంచ కర్మేం ద్రియాలతో కొలిచే సంస్కారమే  భారతీయత .
 పంచ కోశాలు శుద్ది చెంద డానికి అనువైన కాలమే పర్వ దినం,అనువైన ప్రదేశ మే తీర్ధం .
జలం...  అది బయటా  ఉంది , మన  లోపలా ఉంది .అలాగే మిగతా నాలుగు భూత తత్వాలూ !
నీటిలో ని శక్తికి , సృష్టి లోని శక్తులు మరింత గా తోడై ఉండే సమయం పుష్కరం .
మానవ శరీరం కూడా అధిక మొత్తం నీటితో తయా రయ్యిం దే !
 నీటి లోకి విద్యుత్ ని పంపితే నీరు, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ గా విడి పోతుంది .  ఇది ఆక్సి దేషన్  చర్య .
మర ల ఆక్సిజన్ మరియు హైడ్రోజన్  కలిసి నీరు ,దానితో పాటు కొంత విద్యుత్ పుడతాయి .
 ఇది క్షయీ కరణ చర్య .
అపార జలరాశి లోకి మనం విద్యుత్ ని పంపలేము . శక్తిని పుట్టించ లేము . కానీ , మనం చేయ లేనిది  ప్రక్రుతి చేస్తుంది . అలా చేసే సమయమే పుష్కరం .

భరత వర్షం లో అత్యంత ముఖ్య మైన అనగా విశ్వ శక్తులు అత్యధికం గా ప్రసరిమ్చ డానికి అను వైన ప్రదే శాలలో ఉన్న  12 నదుల లో , ఆ విశ్వ శక్తి ఉత్సర్గం చెందుతుంది.
ఏ సమయం లో  ఏయే నదులలో ఆ విధమైన శక్తి ఉత్సర్గం  జరుగుతుందో తెలుసు కోవడానికి కొన్ని సూత్రాలు తెలియ చేశారు మన మహర్షులు .ఒకో నదికి సంకేతం గా ఒకో రాశి ని గుర్తించారు .
గురు గ్రహం ఒకో రాశి లో ప్రవేశం చెందే సమయమే ఆయా నదులకు పుష్కర సమయం  అని రుషి ఉవాచ .
నదికి కొత్త శక్తి ఒన కూడే సమయం . ఇది మానవ కోటికి పర్వ దినం .
సనాతన ధర్మం లో  పర్వ దినాలు  మానవ జీవితాలలో ఓ ఉత్సవం .
 సమాజం  ఓ వసుధైక కుటుంబం లా ప్రవర్తిం చే సమయం  .
 తీర్ధ స్నానం చేసినప్పుడు ,అది పుష్కరిణి లేదా చెరువు ,నది ఏదైనా సరే దానిలోని మట్టి 3 గుప్పెళ్ళు తీసి ఒడ్డున వేయాలి . ఒడ్డు చుట్టూ ఉన్న మట్టి లో ఎలాంటి అశు భ్రత లేనప్పుడు మాత్రమే , మంత్రం జపం చేస్తూ మట్టిని వంటికి రాసుకొని ,ఆ తర్వాత నదీ స్నానం తర్పణ పూరితం గా చేయాలి .
 ఈ   సమయం లో ఆ నదిలో స్నానం చేయడం ద్వారా  శరీరాన్ని  , దానం  చేయడం ద్వారా కర్మ శరీరాన్ని , మంత్ర జపం తో మానసిక శరీరాన్ని శుద్ధి చేసుకొని -
 తర్పణ మిచ్చి   పితృ దేవతలను ,
అంజలి ఘటించి సూర్య భగ వానుని,
స్మరణతో నారాయణుని ప్రార్ధించి , --
నదీమ తల్లి పరిసరాలను కూడా శుభ్ర పరచి ,అర్హులకు .బ్రహ్మ వేత్తలకు ,ఆర్తులకు శక్తి కొలది సాయం చేయాలి .

నది మూలం ,రుషి మూలం గురించి మనం తెలుసు కో నక్కర లేదు . ఆ నదీమ తల్లి తను  పరవశిస్తూ ,తన దారిలో మానవ కోటిని పరవ శింప చేస్తూ  వడి వడి గా ఉరకలెత్తు తూ ఎలా పరవళ్ళు తొక్కుతుం దో చూద్దాం రండి !
సకల తీర్ధాలకు రాజైన పుష్కరుడు ,సకల దేవతలకు గురువైన బ్రిహస్పతి ,బ్రహ్మాది దేవతలు ,పితృ దేవతలు అంతర్లీ నం గా నదీ జలాల లో తన్మయు లై ఉన్న సమయం ఇదే ! తరించడానికి తరలి రండి .
" కృతజ్ఞత - సుహృద్ భావం -భగవంతుడి పై విశ్వాసం - మహా సంకల్పం -శరణాగతి" -ఇవే మనం గుర్తుంచు కోవలసిన వి . మన పిల్లలకు నేర్ప వలసినవీ ఇవే ! ఇదే ఆర్ష ధర్మం ... 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి