మతం ఎలా పనిచేయాలి ?
ఒక విషయం పైన .. అది గురువు లేదా రూపం లేదా అరూపం దేని పైన అయినా ఓ విశ్వాసం అనేది మనిషికి అవసరం . కొంతమంది కి ... చాలా కొద్ది మందికి మాత్రం, వారి మనస్సే వారికి గురువు ...వారి బుద్ధి పైనే వారికి విశ్వాసం ...వారి కార్య దక్షత పైనే వారికి ప్రగాడ నమ్మకం ఉంటాయి .
మనిషికి ఎంత ప్రగాడమైన శ్రద్ధ ,విశ్వాసం ఉంటాయో అంత భయమూ ఉంటుంది . భయం -భక్తీ అనేవి రెండు ధ్రువాల లెక్క కనిపించే ఒక మానసిక స్థితి !
భక్తీ విశ్వాసాలు ఒక సానుకూల ధ్రుక్పధానికి మళ్ళి నప్పుడు ,అది సంఘానికి ఎంత మంచి చేస్తుందో ,కనులారా చూడాలీ అంటే ,సిక్కు మతస్థుల ఆరోప్రాణ మైన హర్మందిర్ సాబ్ .. అదే బంగారు లోగిలి ... అందులోని లంగర్ హాల్ ...దానిలొ ప్రతిరోజూ జరుగుతున్న భూత యజ్ఞం ... అన్న యజ్ఞం ను చూస్తే మనస్సు ఆర్ద్రతతో ఆర్ణవ మవుతుంది .
రోజుకి లక్ష మందికి కడుపు నింపుతూ ఎనలేని సేవ చేస్తున్నారు సిక్కు లు .
అంతే కాదు ప్రక్రుతి ఉత్పాతాలు వచ్చి ప్రజానీకం తల్లడిల్లుతున్నప్పుడు వారి సేవా వితరణ చూస్తే దేవుడు ఇందుకు కదా మనిషి జన్మ ఇచ్చిందనే జ్ఞానం మనలో ఉదయిస్తుంది .
కాశ్మీర్ వరదల్లో గానీ ,నేపాల్ భూకంప ప్రళయం లో గానీ అప్పటికప్పుడు లక్ష ఆహార పొట్లాలు పంపారు అంటే సిక్కులలో ఎంత దేశ భక్తీ ,పరహితము ఉన్నాయో చూడండి !
దేశ సరిహద్దుల రక్షణ లో ముందుండి స్పూర్తి నింపడమే కాదు ,మత సిద్ధాంతాలను సంఘ హితానికి అనుకూల మైన ధ్రుక్పధాన్ని ఆచరించి చూపడం అనేది సనాతన భారతావని కాలం లో చూశాము ...మళ్ళీ ఇప్పుడు మన సిక్కులలో చూస్తున్నాము .
మతం అనేది .... జనాన్ని ఉత్సాహ పరిచి ,దైర్యం నింపి కార్యోన్ముఖులను చేయాలి గానీ ... మత్తు మందు లా పనిచేసి మన్ను తిన్న పాములా బబ్బొ పెట్టకూడదు.

పరోపకారమిదం శరీరం అనే సూక్తిని ఆచరింప చేయడానికి అనువైన శరీరాన్ని ప్రతి వ్యక్తీ పొందే టట్లు మతం పని చేయాలి .
మనం ఒకరికి సాయం చేయాలీ అంటే ముందు మనం ఆరోగ్యం గా ఉండాలి . శరీర శుద్ధి -మానసిక ,వాచిక శుద్ధి అభ్యాసం చేయడం ద్వారా, సంతులిత ఆహార సేవనం ద్వారా మనం ఆరోగ్యం గా ఉంటాం .
దైవ చైతన్యం ఈ సృష్టిని ఓ లీలగా నడిపిస్తుంది . ప్రతి వస్తువు ,ప్రతి జీవి కూడా ఆ చైతన్యం లో భాగమే కాబట్టి మన జీవితం కూడా ఆ జగన్నాటకం లో ఓ చిన్న పాట లాంటిది !
సంసారం ఓ సంగీతం లాంటిదే !
లయ ,ఉచ్చారణ ,స్వరం,భావం ... తప్పకుండా పాడాలీ అంటే సాధన చేయాలి .
అలాగే సంసారం కూడా స్వరభరితం గా ఉండాలీ ... అంటే , మనిషి సాధన చేయాలి .
మనస్సు ప్రశాంతత కోసమే సాధన . ఎందుకంటే శాంత పూరిత మనస్సే సత్య శోధన చేయగలదు !
ధర్మా అధర్మ విచక్షణ ; నిత్యా అనిత్య విచక్షణ మన మనస్సుల్లో ఇంకే విధం గా మత నియమావళి ఉండాలి .
మత పెద్దలు దాంబికపు పనులు చేయ కుండా ప్రజలకు ఓ స్పూర్తి ప్రదాతలుగా ఉండాలి .
సమాజ సేవ , పరిసరాల పరి శుభ్రత , నీటి సంరక్షణ ,అనాధల ఆదరణ ,చెట్ల పెంపకం .... అనేవి మత సంస్థలకు నిత్య కృత్య మవ్వాలి .
ఒక్క మాటలో చెప్పాలంటే... మతం , సమాజానికి స్వాంతన ఇవ్వాలి .

Comments
Post a Comment