మనిషి ప్రతిభావంతం గా ఉండా లంటే ఏం చేయాలి ?

జీవితానికి అర్ధం పరమార్ధం ఉండాలంటారు పెద్దలు . 
అర్ధం తెలుకోవడానికి ఎవ్వరూ ఇష్ట పడరు . తోచిందేదో చేయడమే తప్ప , ఓ నిర్దిష్ట లక్ష్యం , పధక రచన , కార్యాచరణ అనేవి 90% మందికి ఉండవు . అంతా గాలివాటం !
భగవంతుడు మనిషికి తార్కిక శక్తిని ఇచ్చింది  మంచి -చెడు కి తేడా తెలుసు కోవదానికే తప్ప అనవసర మైన ఉసు పోక విషయాలను విస్లేశించ  మని మాత్రం కాదు .
మనిషికి ఉహ శక్తిని ఇచ్చింది సామర్ధ్యానికి అనుగుణ్య మైన కలలు కనమని ... అంతే గానీ మన సామర్ధ్యానికి అందుబాటులో లేని పగటి కలలు కనమని మాత్రం కాదు .
సాధారణ మానవుడు తన విజ్ఞానానికి ఏ  మాత్రం సంబంధం లేకుండా చేయగల అత్యంత ముఖ్య మైన కార్యం .... తన శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుకోవడం , తన మనస్సుని సంతోషం గా మిగుల్చు కోవడం ....తన బుద్ధిని పదునుగా అంటే వివేకం తో ఉంచుకోవడం .
యుక్తా - అయుక్త విచక్షణ అనేది సంఘ సంక్షేమానికి  సంబంధించిన విచక్షణ .
ధర్మ -అధర్మ విచక్షణ అనేది ప్రక్రుతి  కి సంబంధించిన వ్యవహారం ...
మనిషి జన్మకి అర్ధం ఏమిటి ?
అర్ధ , కామాలను సాధించు కోవ డ మే మనిషి జన్మకి అర్ధం !
అవి ఎలా సాధించు కోవాలో తెలుసు కోవడమే మనిషికి ,మృగానికి తేడా !
తెలుసు కొన్న దానిని నమ్మి ఆచరించడ మే సామాన్యుడికి ,ప్రతిభావంతుడికి ఉన్న తేడా !
అర్ధం అంటే అష్ట  ఐశ్వర్యాలు .
కామం అంటే  విషయాలపైన , మనుషుల పైన , సంఘటనల పైన కోరికలు .
అంటే , అర్ధ కామాలను పొందడానికి మనిషికి ఉన్న బలాలు ( ఆయుధాలు) ,బలహీనతలు ఏమిటి ?
రాగ ద్వీషాలు , అరిషడ్ వర్గాలు మొదలగు గుణ సంపత్తి  మనిషి బలహీనతలు . ఇవే బలహీనతలు మృగాలకు ,కీటకాలకు , పిపీలికానికి .... అంతెందుకు ప్రతి జీవ కణానికి ఇవన్నీ వేర్వేరు స్థాయిలలో  ఉంటాయి . మనుగడ సాగించడానికి వాటికి ఉన్న బలము - బలహీనత ఇవే !
కానీ మనిషికి,  భగవంతుడు లేదా ప్రక్రుతి కొన్ని సంపదలు ఇచ్చింది .
అవే  తార్కిక -విచక్షణ -వివేక సామర్ధ్యం ;
 సమాచార బట్వాడా  కోసం మాట,ఆట,  పాట , సంగీతం, తాళం , నాదం ,  సంజ్ఞా , లిపి ,భాష ...
జ్ఞాపక శక్తి ; ఉహా శక్తి ;
ఇవి మనకు తెలిసి , మనిషికి మాత్రమే ఉన్న మానవ సంపదలు !
ఈ మానవ సంపదలను ఏకాగ్రతా చిత్తం తో ,ఇష్ట పూర్వకం గా ,నైపుణ్యం తో ఉపయోగించు కొంటూ కార్యాచరణ చేసే వాడే ప్రతిభావంతుడు !

 జీవితానికి ఒక మిషన్ ' ని ఏర్పరచు కొని దానిని సాధించ దానికి కావలసిన  పధకాల ను చిన్న చిన్న విషయాలను కూడా వదిలి పెట్టకుండా ... కూలంకుషం  గా ఆలోచించి సిద్ధం చేసుకోవాలి . ఒక పధకం పనిచేయకపోతే రెండో పధకాన్ని కూడా ఆలోచించి సిద్ధం చేసుకోవాలి .
పధకం సిద్ధమైన తర్వాత వెంటనే .... ఏమాత్రం ఆలస్యం లేకుండా అమలు పరిచే చర్యలు ఆరంభించాలి .
విమర్శలు ,సలహాలు ,...ఎన్ని వచ్చినా పధకం ప్రకారం దూసుకు పోవాలి తప్ప వెను కడుగు వేయకూడదు . ఎందుకంటే ఆ పధకం లో ఉన్న సాధక బాధలు , ఆ పధకం వెనక ఉన్న లక్ష్యం పై నీ కంటే వేరెవ్వరికీ అవగాహన ఉండదు .
అవసరం లేని చోట , అనవసర మైన విషయాలలో తలదూర్చి సమయం వృధా చేసుకోవడం సామాన్యుల విషయం లో జరుగుతుం ది  . కానీ ప్రభావ శీలురు , ప్రతిభా వంతుల లో -  అనవసరమైన వారి కి , పనికి రాని   పనులకు  "లేదు " అని చెప్పగల సత్తా  ఉంటుంది .
పని  పై ఏకాగ్రత ఒక్కటే సరిపోదు . పని పై ఆత్మ వంచన లేని ఇష్టం ఉండాలి . లేని ఇష్టాన్ని నటించినా నష్ట పోయేది మనమే . ఏకాగ్రత తో పాటు, చేసే పనిలో నిపుణత లేక పోతే ఫలితం రాదు గదా ?
అంటే ఒక పని  ,సఫలీ కృత మవ్వా లంటే ,  ఏకాగ్రత ,ఇష్టత , నిపుణత .... ఈ మూడూ ఉండాలి . ప్రతిభావంతులకు ఇవన్నీ ఉంటాయి .
మనం చేసే పనిని సాధించు కోవడానికి మన పధకాలను అమలు చేసు కోవడానికి ఎలాంటి అభ్యంతరాల నైనా మనకు అడ్డు రానీయ కూడదు .
తొందర పాటు ఉండ కూడదు . సరైన సమయం కోసం వేచి ఉండే ఓర్పు ఉండాలి .
ప్రతి దాంట్లో వేలు పెట్ట కూడదు . అలా పెడితే ,ఎందులోనూ ఫలితం సాధించ లేము .
మన చుట్టూ  కూడా ప్రతిభా వంత మైన వాతావరణం ఉంచు కోవాలి . స్నేహితులు ,పుస్తకాలు ... ఎవరైనా ఏదైనా మన లక్ష్యానికి సాయం చేసే వారు మాత్రమే ఉండాలి .
సంగీత సాహిత్యాలు మన లను ఉత్తేజ పరచాలి . సకారాత్మక  ఉత్తేజం అందించే వ్యవస్థని మన చుట్టూ మనం నిలబెట్టుకోవాలి .
కొంత మంది ప్రతి సలహాకి విలువ ఇవ్వడానికి ప్రయత్నించి , చివరకు అంతా కలగా పులగం చేస్తారు . వీరికి విజయం దక్కదని  వేరే చెప్ప నక్కర లేదు . మరి కొంత మంది అందరినీ  తృప్తి పరచడానికి ప్రయత్నం చేసి చివరకు ఎవ్వరినీ సరిగ్గా తృప్తి పరచ లేక పలుచన అవుతారు .
కొంత మంది రాబోయే విషయాల గురించి , జరిగి పోయిన సంఘటనల విశ్లేషణ ల గురించి తెగ చెప్పేస్తా ఉంటారు .
ప్రతిభావంతులు భూత భవిష్యత్ విషయాలను వారి లక్ష్యానికి అనువుగా  అవసర మైనంత వరకు వాడుకొంటారు . అంటే గతం లో జరిగిన తప్పులు మళ్ళీ చేయరు . గతం లో జరిగిన విషయాల నుండి తనకు కావలసినంత వరకు విజ్ఞానాన్ని వాడు కొంటారు . అలాగే భవిష్యత్ లో తన పధకాల తీరు తెన్నులను ఇప్పుడే ఉహించి దానికి తగ్గ విధం గా తన పనిని , పని చేసే నిపుణతను మెరుగు పరచుకొంటారు .
 కల లు కనడం వేరు . పగటి కల లు కనడం వేరు .
కల మన ద్రుక్ఫదానికి , మన సామర్ధ్యానికి అనువైన దై ఉండాలి . అంటే, మన బలం ,బలహీనతలు మనకు తెలిసి ఉండాలి . ఎదుటి వాడి  బలాబలాల కంటే ముందే, మన సామర్ధ్య మేమిటో మనకు అవగాహన ఉండాలి . మానసిక పరమైన అవగాహన ఒ క్కటే సరిపోదు . పనిచేస్తూ ఉంటేనే మనకు ఎక్కువ అవగాహన కలుగుతుంది . ఎక్కడ తప్పులు చేస్తున్నామో , ఎవ్వరి వలన ... ఎ విషయాల వలన ఆయా తప్పులు జరుగు తున్నాయో  అప్పుడే బాగా అర్ధం అవుతుంది .
కొంత మంది రాబోయే మార్పులు గురించి తెగ వాగుతా ఉంటారు .
 ప్రతిభా వంతులు ఆ మార్పే తామవ్వుతారు ! ఆ మార్పుని వీళ్ళే పట్టు కొస్తారు . ఆ మార్పుతో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ నే ఉంటారు .

మరి , మనిషికి పరమార్ధం  ఏమిటి ? 
 తన కర్మ ఖాతాలో ఉన్న కర్మలను భస్మం చేసుకోవడానికే మనిషి ఈ భూమి పై పడ్డాడు .
ఇది పరమార్దానికి చెందిన విషయం .
మనిషి కి ప్రశాంత మైన నిత్యానంద స్థితి కావాలీ అంటే ,ఈ మానవ సంపదలు సరి పోవు .
వేరే సంపదలు కావాలి .
శుచి - శౌ చ్యమ్ , దైర్యం ,నమ్మకం, శ్రద్ధ ,కరుణ ,ప్రేమ ,సేవా నిరతి ,దయ , దానం -ఇవే మనిషి  సాధించు కోవలసిన బలాలు . వీటినే మానవీయ సంపదలు లేదా సాధనా సంపత్తి అంటారు . ఎందుకంటే అభ్యాసం తో సాధించు కోవలసిన మానసిక లక్షణా లివి ! సాధనతో సమ కూరే సంపదలివి .
మానవీయ సంపదలకు ఆధారం ధర్మం ! మానవీయ సంపదలకు ఆకారం సత్యం !
దీనినే సనాతనులు - " సత్యం వద ... ధర్మం చర " అని సూక్ష్మం గా  చెప్పారు .
అర్ధ , కామాలను ధర్మ బద్ధం గా  పొంద డానికి మానవీయ సంపదలు సాధించుకోవాలి . దీనికి రెండు మార్గాలు . అవే , ప్రవ్రుత్తి (గృహస్థు ) మరియు నివృత్తి ( సన్యాసం ) మార్గాలు .
బాహ్య పరమైన పూజలు ,నామ సంకీర్తనలు ,రాజసిక దాన -తపో -యజ్ఞ కర్మలు ఇవి మొదటి మెట్టు ....
శరణాగతి , ప్రార్ధన , భక్తీ ,జ్ఞానం ,ధ్యానం , సాత్విక కర్మ ఫలసన్యాసమ్ అనేవి కొంచెం పై మెట్టు పైన ఉన్న మార్గాలు .
మెట్టు మెట్టు గా సాగిపోయి కాన్షస్ ను విశ్వ వ్యాపితం చేసుకొంటూ  అపరోక్షాను భూతి చెందడమే జీవిత పరమార్ధం. వీరే ద్రష్టలు,స్రష్టలు, మహర్షులు, జీవన్ముక్తులు  గా విఖ్యాతి పొందుతారు. 
స్వస్తి.. 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి