faithful duty - శ్రద్ధ

ప్రతి  మనిషికీ ఏదో ఒక దానిపై శ్రద్ధ ఉంటుంది. మనిషికి ఉన్న శ్రద్ధను బట్టి అతని ఆలోచన,కార్యాచరణ,అతని జీవితం ఎలాఉంటుందో చెప్పవచ్చు. అన్నప్రాసన సమయంలో పిల్లలకు వివిధ వస్తువులు ఎదురుగా పెట్టి,వారు దేన్ని పట్టుకొంటారో చూసి,దానిని బట్టి వారి ఇష్టాన్ని తద్వారా శ్రద్ధని చెబుతారు.  ఆ బిడ్డ  యెక్క ఇష్టాన్ని,శ్రద్ధను చూసి అది బిడ్డ మానసిక ఎదుగుదలకు, పురోగమనానినికి , ఆధ్యాత్మిక చింతనకు వ్యతిరేకమైనదా , సహాయ కారిగా ఉంటుందా? అనేది  బేరీజు వేసుకొని వ్యతిరేకమైనది అయితే ఆ బిడ్డను సంస్కరించడానికి తల్లితండ్రులు , గురువు ప్రయత్నం చేస్తారు . అన్నప్రాశన లో వెనుక ఉన్న పరమార్ధం ఇదే! ఏది ఏమైనా బిడ్డలకి 7 ఏళ్ళు ముగిసే లోపుగానే అనగా వారి మెదడు అభివృద్ధి చెందే దశలోనే, వారికీ మంచి ఆలోచనలు,సాంఘిక విలువలు, ఆధ్యాత్మిక భావాలు ,పరోపకారం,సహనం,ఆరోగ్య రక్షణ పై అవగాహనా పెంచాలి.  

శ్రద్ధ అనేది సంస్కృత పదం. మనలో   గట్టిగా స్థిరపడిన భావనలను  శ్రద్ధ అంటాం. అనగా ఆ భావనలను మనం గట్టిగా ,బలంగా ఇష్టపడతాం. విశ్వసిస్తాం. కొందరికి చదువు పై శ్రద్ధ ఉంటే, మరికొందరికి సినిమాలపై ఉంటుంది. కొందరికి తాగుడు పై ఉంటే మరికొందరికి ఆరోగ్యం పై శ్రద్ధ ఉంటుంది .

విద్య,రాజకీయం,వృత్తి,ప్రవ్రుత్తి , అలవాట్లు తదితర రంగాల పై  మన ఆంతర్యములో  ఎలాంటి  స్థిరమైన భావనలు ఉంటాయో , ఆయా స్థిరమైన  భావనలనే  శ్రద్ధ అంటాం. చెడ్డ విషయాలపై ఉన్న శ్రద్ధను మంచి విషయాలపై  ధారణ చేయడమే సంస్కరణ. గురువులు చేసేది,చేయవలసిందీ  అదే!
ఏ రంగంలో రాణించాలన్నా , ఆయా రంగం పై శ్రద్ధ ఉండాలి. వైద్యవిద్యార్థికి వైద్య సేవపై శ్రద్ధ ఉంటేనే వైద్యుడిగా  రాణిస్తాడు . అలాగే ఆధ్యాత్మిక సాధకుడు, ఆధ్యాత్మిక విషయాలైన సత్సంగం,సద్గురుసేవ పై శ్రద్ధ ఉంటేనే అనుకొన్న లక్ష్యం చేరుకొంటాడు.
పిల్లవాడి లో  ఉన్న శ్రద్ధను బట్టి అతడు ఏ రంగంలో రాణిస్తాడో చెప్పవచ్చు.
మహర్షులు మనిషి  షోడశ సంస్కారాలు చేసుకోవాలని చెప్పారు. సంస్కరణ అంటే శుద్ధి చేయడం. దేనిని శుద్ధి చేస్తారు.  సంస్కరణ ల వలన పాంచభౌతిక దేహాము  శుద్ధి చేయబడుతుంది. పుట్టినప్పటి నుండి భిన్న దశలలో ఈ సంస్కారాలు చేసుకొంటే మంచిదని మహర్షుల వాక్యం.  ఇలాంటి మూఢమైన సంస్కారాలను చేసుకోము ఇవన్నీ ట్రాష్ అంటూ కొట్టి పారేసేవాళ్ళు ఎందరో ఉన్నారు.  భౌతిక దేహ శుభ్రత కోసం స్నానం చేయడమెలాగో ,మనలోని భావ శరీరము, కారణ శరీర  శుద్ధి కోసం  ఈ సంస్కారాలు.
మరణసమయంలో చేసేది అంతిమ సంస్కారం.
After death of a person, the body is destroyed. But the mind, the intellect and the Awareness that activated the body does not die, but exist as energy thought vibrations.
శ్రద్ధగా చేసే విధిని శ్రాద్ధ కర్మ అంటారు. కృతజ్ఞాభరితమైన కర్మ అది. మనకు జన్మ నిచ్చి ,పెంచి పోషించి అన్నీ ఇచ్చిన  పెద్దలకు   ప్రతి మనిషీ కృతజ్ఞత తో ఉండితీర వలసిందే. అంతేకాదు, మరణానంతరం వారు ( ప్రేతాత్మ -కారణ,మానసిక కోశాల తో ఉన్న ఆత్మ )  చేయవలసిన పయనానికి అవసరమైన భావనా శక్తిని  వారికీ అందివ్వాలి. ఆలా అందించడానికి చేసేదే శ్రాద్ధకర్మ. మనిషి తన భావనా బలంతో ( strong intention with faith) ఏవైనా చేయగలడు. కానీ అదేదో యాంత్రికం గా కాకుండా ఒక పవిత్రమైన విధిగా శ్రద్ధతో చేయాలి. ఎందుకంటే, భౌతిక ప్రపంచంలో మనం ఏ కార్యం చేసినా , అది కరాచరణాదులతో  చేస్తాం కాబట్టి మనకు కనబడుతుంది. కానీ శ్రాద్ధ కర్మ లాంటి కార్యాలు మన భావనా శక్తిని ఉపయోగించి చేస్తాం కాబట్టి దాని పర్యవసానం మనం భౌతికంగా గ్రహించలేము.
కానీ మన మహర్షులు గ్రహించారు.  జీవుడి మరణానంతర ప్రస్థానంలో  సహాయ కారిగా ఉండేవి పుణ్య భావనలే! పుణ్యకరమైన భావనలు ఆ జీవుడి ప్రస్థానాన్ని  పవిత్రం చేసి పుణ్యభరితం చేస్తాయి.
ఉపకారం,కృతజ్ఞత ,కరుణ అనేవి మహత్తరమైన భావనలు . మన హృదయాలలో అవి నిరంతరం వృద్ధి పొందేటట్లు చేసుకోవడమే మన విధి.


Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి