ఓ మనిషీ!
మనిషికి మనస్సు ఒక వరం. నమ్మకం
అనేది మరో గొప్ప వరం. ఇష్టమైనవి పొందాలని,అయిష్టమైనవి పోవాలని మనిషు అనుకొంటాడు.
ప్రగాఢమైన నమ్మకం అనేది ఓ పెద్ద
వరం. నిజానికి, మనుషుల్లో మనస్సు అనగా ఆలోచనా సామర్ధ్యం అనేది ఒక వరం. కానీ ఆ
వరాన్ని మనం శాపం గా మార్చేసుకొన్నాం. గతాన్ని తవ్వుకొంటూ మనకు
భయాన్ని,జుగుప్సను, అవమానాన్ని,బాధను,ఆక్రోశాన్ని,ఆవేదనను ,కలిగించిన సంఘటనలను పదే
పదే నెమరువేసుకొంటూ దుఃఖిస్తూ ఉండటం బాగా అలవాటై పోయింది. అంతేకాదు, భవిష్యత్ లో
కలగబోయే బాధలు,దుఃఖాలు, అభద్రత గురించి ఆందోళన చెందడం కూడా మరింతగా అలవాటైపోయింది.
ఇలా ప్రతిక్షణం ఏడుపుతో కుమిలి కునారిల్లిపోవడం మెజారిటీ మనుషులకు ఒక పెద్ద
అలవాటుగా మారింది. సెక్స్,డ్రగ్స్, ఉప్పు, ఆల్కహాల్ కే కాదు దుఃఖపూరితంగా
ఉండటానికి మనిషి బాగా అలవాటు పడ్డాడు .
జీవితం ఇంత దుఃఖభాజకంగా
ఉంటే దుఃఖపడకుండా ఎలాఉంటామండీ ?
సరిగ్గా పరిశీలిస్తే నిజంగా
దుఃఖాన్ని కలిగించే సంఘటనల కంటే ,దుఃఖాన్ని పదే పదే తలచుకొని కుమిలి పోవడమే ఎక్కువగా
ఉంటుంది. అంతేకాదు, దుఃఖం ముంచెత్తు తుందేమో అనే భయం మనిషిని తడిపేస్తుంది.
మరి సంతోషం కలగడం లేదే? తెచ్చి
పెట్టుకొనే సంతోషం వలన ప్రయోజనమేమిటి ?
ఏదీ కృత్రిమంగా
తెచ్చిపెట్టుకోనక్కరలేదు . ఉన్నది పోగొట్టు కొంటె చాలు. దుఃఖం
లేకపోవడమే సంతోషం.
సంతోషం అనేది ఒక మెరుపులా వచ్చి
పోయేదని మనిషి భావన.
శాశ్వతంగా
ఆనందాన్ని మిగుల్చుకోవచ్చనే సంగతి మనిషి మరచి పోయాడు. ఇది పెద్ద శాపం.
నిరాశా దృక్పధం తోనే జీవితమంతా
గడపడం అలవాటైన మనిషికి ఏదీ తోషాన్నివ్వదు.
దీనికి పరిష్కారం ఉందా?
బేషుగ్గా వుంది . కావలసింది
విస్వాసం .
"మనిషి ఆనంద స్వరూపుడు
" అనే ప్రగాఢ నమ్మకం ఉండాలి.
మనస్సు ని ఒక మంచి మిత్రుడిగా
మార్చుకోవచ్చనే నమ్మకం ఉండాలి .
" కోరుకొంది ఏదో ఒకటి పొందితేనే
సంతోషమనే" నమ్మకాన్ని తుడిచేయాలి.
భయాందోళనలతో ,కోర్కెలు తీరతాయో
లేదో అనే శంకలతో ,చేపట్టినపని త్వర త్వరగా పూర్తిచేయాలనే హడావుడితో ,అనుకున్నవి
అత్యంతవేగంగా సాధించాలనే ఆత్రుతతో , మనిషి నిరంతరం సంతోషానికి దూరమైపోతున్నాడు.
అందుకే శ్రీకృష్ణుడు అన్నాడు,
-“గాలిని పిడికిలితో బంధించడం ఎంత కష్టమో మనస్సుని
నియంత్రిమ్చడం కూడా అంతేకష్టం. అయినా అసాధ్యం కాదు. ప్రతి క్షణం మనస్సుని
పరిశీలించుకొంటూ, వర్తమాన క్షణాలలోనే ఉండేటట్లు
మోడరేట్ అనగా
నిత్యమూ ఎరుకతో (కాన్షస్) పరిశీలిస్తూ
మనస్సుని అదుపులో ఉంచుకోవడం అభ్యాసం చేయాలి. నిత్యమూ
అభ్యాసం చేయాలని చెప్పాడు.
వికృతమైన ఆలోచనావృత్తాలతో
దుఃఖంలో కొట్టుమిట్టాడుతూ ఉండే మనిషి ని ప్రస్తుత క్షణాలలో బతకడం అనగా ప్రస్తుత
పరిస్థితులకు స్పందిస్తూ ఆస్వాదిస్తూ జీవించాలన్నాడు”.
జరిగిపోయిన
సంఘటనల్లో ఏది అవసరమో, ఎక్కడ తప్పులు చేశామో , ఎక్కడ సరిగ్గా ప్రవర్తించామో తెలుసుకొని
దానినుండి జ్ఞానాన్ని పొందడం వరకే భూతకాలాన్ని పరిశీలించాలి తప్ప, అక్కడే,ఆ పాత
విషయాలలోనే మనస్సుని చిక్కుకు పోనీయ కూడదు.
అదే
విధంగా రాబోయేకాలంలో సుఖంగా ఉండటానికి ప్రణాళికలు పకడ్బందీగా రచించుకోవాలి
తప్ప,ఏమవుతుందో ఏమో, అనుకున్నట్లు అవుతుందో లేదో అనే సందేహాలతో,ఆందోళనలతో సతమత మవుతూ
సూక్ష్మపరిశీలనా సామర్ధ్యాన్ని కోల్పోయి భవిష్యత్ పధకరచన లో
పొరపాట్లు చేయకూడదు.
సంతోషంగా
ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం బాగా గుర్తుపెట్టుకో వలసిన
విషయం ఏమిటీ అంటే, మనం ఎల్లపుడూ సంతోషంగానే ఉన్నామని ప్రగాఢంగా అనుభూతి చెందుతూ
,భావిస్తూ మనం చేయవలసిన కర్తవ్యాలను,బాధ్యతలను,కార్యాలను పూర్తిచేయాలి. ఎందుకంటే
ఎపుడూ సంతోషభరితమైన మనస్సుతో ఉంటే, మనం ఏ పనిచేసినా, ఆ పని పూర్తి చేయడం కోసమే
తప్ప సంతోషం కోసం కాదు. మనం ఏ పనిచేస్తున్నా ఆ పనిని సంతోషంగా చేయడమే మనం అభ్యాసం
చేయాలి.
సంతోషంగా ఉండు ...
ఏ పనైనా
సంతోషంగాచేయగలను ...ఏ పనైనా ఉత్సాహంగా చేస్తాను.
మన
బతుకు సంతోషం కోసం చేసే వేట కాదు.ఆనందం కోసం పడే ఆరాటం కాదు.ఒకరిపై పైచేయి సాధించే
పోరాటం కాదు.
సంతోషంగా
చరించడమే మనిషి అభ్యాసం చేయాలి.
అపుడు-
మానవ జన్మ ఓ ఉత్సవం. మానవ జీవితం
ఓ యజ్ఞం. మనిషి బతుకు ఓ ఆనంద తరంగం . మనిషి ప్రవర్తన విశ్వాసపు కెరటం. మానవ
సంబంధాలు అనుబంధాలేతప్ప బంధాలు కావు.
Believe yourself!
Strongly and deeply believe, that you are capable,confident,fearless,abundant,happy,peaceful
and fulfilled.
Be confident
/ be abundant / be satisfied /be happy.
Don’t be always in expectations.
Do believe that you already possessed it.
Don’t be in desire mode- be in fulfillment mode.
Don’t say- if &buts.
Don’t think-if it is there, I will do it”.
Don’t feel that you are dependent on destiny.
Always think-that you can do it what may come and what may
go.
Just say with deep confidence-I can!
Never
say,never feel,never believe- you can’t!
Man kind strongly habituated not to sex, not to drugs,
not to alcohol, not to junk food, or not to salt but deeply habituated to “sorrow,
pain,regret,dissatisfaction and grief”.
These thoughts rooting in fear,insecurity ,desires and
expectations.
These thoughts are emanating from the past incidents and
future expectations.
So,Be
in present moment! Live moment by moment!
Comments
Post a Comment