వ్యాస పూర్ణిమ....

ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ,మంచి నీటి సౌకర్యం,పరిసరాల పరిశుభ్రత ,నిరంతర విద్యుత్ ,మరుగు దొడ్డి -ఇవి తప్పనిసరి అవసరాలు. 
ప్రతి కుటుంబంలో కనీసం  ఒకరికి ఉద్యోగ భద్రత , ఆరోగ్య భీమా సౌకర్యం , వారి పిల్లలకు విలువలతో కూడిన విద్య ని అందించే పాటశాల; వ్యవహార జ్ఞానాన్ని, బతుకు తెరువుని ఇచ్చే కళాశాల, వారి మనస్సులు అరిషద్వార్గాలతో అతలా కుతల మైనప్పుడు స్వాంతన ఇచ్చే ఆసరా ,సంఘంలో ఉన్న హెచ్చు తగ్గులను సమతుల్యం చేసుకొనే ఆచరణ -ఇవీ ప్రభుత్వాలు చేయ వలసిన అత్యవసర విధులు. దీనికి సాయ పడే వారు సద్గురువులు . 

మనిషి కి , సంఘానికి స్వాంతన, సమతుల్యత ఇచ్చే వాటిలో ప్రధాన మైనవి ----
మతం - మత  గ్రంధం, సద్గురువు,సూక్తి ముక్తావళి ,పురాణ కావ్యాలు ,సంప్రదాయ కట్టుబాట్లు ,సంస్కృతి. 
ప్రకృతిలోని పంచ భూతాలు , గ్రామ దేవత లు , పాంచ రాత్ర పూజలు - 
                                  ఇవన్నీ మనిషి భయాన్ని,నిరాశని పోగొట్టే వే . 

ఆలయాల నిర్మాణం,ఆగమ -వైదిక క్రతువులు -- ఇవి మరి కొందరికి వెన్ను తట్టి
 ఒక సకారాత్మక దృక్పధం ఏర్పర చేవే . 

కర్మ సిద్దాంతం ,పునర్జన్మ ,నిర్యాణం ... ఇవి సనాతన భారతీయతకు ఇరుసులు . 

నమ్మకం- విశ్వాసం,శరణాగతి ,శ్రద్ద ,తితీక్ష ,
పంచ కోశ శుద్ది - యోగ సాధనలు -సత్సంగం ,సద్గ్రంధ పారాయణం 
మనస్సుకి నచ్చిన మార్గం లో ఆధ్యాత్మిక సాధన 
మానసిక స్థాయిని అనుసరించి ధ్యాన - భక్తి -కర్మ -రాజ యోగాలలో ఒక దానిని ఆచరించడం. --- ఇవన్నీ మన గురువులు నేర్పిన సుద్దులే . 

అబ్రహాం మతాలైన ముస్లిం క్రిస్టియన్ మతాలకు ,ఇంకా అనేక మతాలకు వారి వారి మత ప్రవక్తలు చెప్పిన  ఒకే ఒక ప్రామాణిక గ్రంధం ఉంటుం ది . 
కానీ హిందూ మతానికి ప్రామాణిక గ్రంధం అనేది లేదు . మత ప్రవక్త లేడు . మనకున్నది ఋషి సంపద . ఆర్యావర్తం ,అంటే అటు ఓల్గా నుండి ఇటు గంగ మీదుగా గోదావరి,బ్రహ్మ పుత్ర వరకు ;
పడమర యుఫ్రటిస్ -టైగ్రిస్ నదీ మైదానాల నుండి ఇటు తూర్పున ఉన్న మెకాంగ్ నదీ మైదానా ల వరకు వర్ధిల్లిన సనాతన నాగరికత లో  ఎందఱో మహా ఋషులు. వారు  తమ తపస్సులో దృశ్య మానం గా , శ్రవణ పేయం గా  అనుభూతించిన విశ్వ రహస్యాలను వేదాలుగా పలికారు . 

ఆయా వేదాలకు అర్ధం పరమార్ధం విడమర్చి చెప్పడానికి ఉపనిషత్ లు,
సామాన్యుడికి కూడా అర్ధం అయ్యే విధం గా పురాణ కావ్యాలు ,
తరతరాల వారు మరిచి పోకుండా నిత్య జీవనం లో ఆయా నిజాలను నిబిడీ కరించి  ఆచార సంప్రదాయాలుగా  పర్వదినాలుగా ఏర్పరచిన వారు ---  ముని పుంగవులు . 

ధర్మ శాస్త్ర కర్తలు, న్యాయ మీమాంస సూత్ర కర్తలు , మనకున్న  కోశా లను శు ద్ది చేసి చైతన్య పరచు కోవడానికి 
ఆయుర్వేదం,రసవాదం,హటయోగం ,యోగ శాస్త్రం ,ఇంకా 64 కళలు,ఇలా చెప్పు కొంటే మన సనాతన ఆర్యావర్త నాగరికత జ్ఞాన సర్వస్వం మనలను ఆశ్చర్య పరుస్తుంది . 
  
ఎందు కంటే ప్రతి అడుగులో వేదం అనే నాదం తప్ప మరేదీ ప్రత్యేక గ్రంధం లేని నిత్య జీవన స్రవంతి హిందూ సనాతన ధర్మం . 
ఎలా బతకాలో ,జీవితానికి గమ్యం ఏమిటో ," సత్యాన్వేషణ - ఆత్మావిష్కారం ' అనే ఉత్కృష్ట భావ పరంపరను ప్రతి అణువులో ,ప్రతి గడపలో ,ప్రతి అడుగులో నింపిన సదాచార జీవన విధానమే ఆర్యావర్త జంబూ ద్వీప భరత వర్ష ప్రామాణిక జీవన గ్రంధం . 
ప్రతి సనాతన ధర్మ పరుడూ నడిచే ఒక పవిత్ర గ్రంధం . 

వేదాలకు అర్ధం విడమరిచి చెప్పే ఉపనిషత్ ల సారం భగవద్గీత . (Gita is concise edition of vedic essence).
పురాణ కావ్యాలు వేద మనే చెట్టుకి పోసిన పూలు . గీత ఆ చెట్టుకి కాసిన ఫలం . 
మనిషి  చిత్త శుద్ది పొందినప్పుడు గీత తనంత తాను వాణిగా వినిపిస్తుంది . మనిషి మానసం సిద్దం గా లేనంత వరకు జ్ఞాన,ధ్యాన మార్గం కన్నా భక్తీ మార్గం సులువుగా ఉంటుంది . అప్పటి వరకు పూలను వాసన చూడటమే తప్ప పండుని తినే యోగం ఉండదు . 

మాయదారి లోకం : 
ఈ లోకమంతా స్పందన ల తో ఉండే  "పదార్ధం -శక్తి" అనే స్థితులలో ఉన్న చైతన్య స్రవంతి . 
"కాలము -ప్రదేశము"  అనేవి మనిషి వ్యావహారికం గా ఉహించు  కొంటున్న కొ ల బద్దలు . 
ఈ విశ్వంలో ఎన్నో మితులు ఉన్నాయని (multi dimensional universe) మనిషి నమ్మకం . 
అది వాస్తవమో కాదో తేల్చ వలసింది శాస్త్రజ్ఞులు . 
ప్రతి ఆచరణ కి కారణం ఉంటుంది . దానినే కర్మ - విధి అని అంటాము . 
ఇది ఒక కార్య -కారణ  కర్మ చక్రం . 

చైతన్యం పాంచ భౌతిక ముసుగు(అహం) వేసుకొంటే  -జీవుడు . 
ముసుగు తొలగితే ఎల్లెడలా అనంతం గా ఉన్న చైతన్య మే - దేవుడు . 
ఈ వాస్తవం తెలిసీ, మళ్ళీ మళ్ళీ అరిషద్వర్గాలకు లోబడి పోవడమే మాయ . 
మాయ ని చేదించ డమే మోక్షం . 

ఆ మోక్షానికి దారి చూపించి మనిషి మనస్సుని సంపూర్తిగా అంతర్ముఖం గావించ డమే
" మతం - ప్రవక్త  -గ్రంధం " కర్తవ్యం . 
ఆ కర్తవ్యాన్ని పూర్ణ త్వం తో పూరించిన మహనీయులలో మహనీయుడు వేద వ్యాసుడు . 
వ్యాస పూర్ణిమ నాడు వ్యాస భారతంలోని గీతా మకరందాన్ని  జీవితాలలో చల్లుకొని పునీతుల వ్వాలని కోరుకొంటూ ........ 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి