ఆత్మవిచారణ

 ఆత్మకి ఉన్న ధర్మాలు - స్వేచ్చ ,కరుణ ,ప్రేమ  

స్వేచ్చ అంటే ఏమిటి ?
నీ (ఆత్మ)ధర్మాన్ని నిర్భయం గా వెల్ల డించ డ మే స్వేచ్చ.

సంకల్పం -ఆలోచన-ఆచరణ అన్నీ ఒకే విధం గా ఉండి , ఆనంద స్థితి చెదర కుండా  ఉండటమే ఆత్మ ధర్మం .
మనిషికి ఆనంద మనేది కొత్తగా తెచ్చి పెట్టు కొనేది కాదు . ఎప్పుడూ స్వత  సిద్దం గా ఉండేదే .
ప్రక్రుతి విరుద్ధ మైన మనో వాక్ కర్మల వలన  ఆ ఆనందాన్ని కప్పివేసే గందరగోళం తో  సత మవుతూ ఉంటాడు మనిషి . ఆ విధం గా స్వేచ్చ నూ కోల్పోతాడు . అనగా అహం అనే తత్త్వం ఉన్నంత వరకూ మనిషి కి స్వేచ్చ ఉండదు .
ఈ  అహానికి మరో పేరు " మిధ్యా నేను". (Mythical 'I')
మిధ్య అంటే అబద్దం అని కాదు . పూర్తి  వాస్తవం కాదు .
Myth means twisted truth or illusion or half-truth.
తాడు ని చూసి పాము అని భ్రమ చెందడం ...  మనకు పాము గురించి తెలిసి ఉంటేనే ఆ భ్రమ కలుగుతుంది .
మరి " పూర్తి  వాస్తవం" ఏమిటి ?
దీనికి మరో పేరు సత్యం - ప్రజ్ఞ - ఆనందం - ప్రకాశం .
ఆ సత్యం మనస్సుకి -అనగా తర్కానికి  అందేది కాదు .

Man can control body physiology through exercises( ఆసన - ముద్ర -బంధాలు )
Man can control pranic movement and control pranic energy. (ప్రాణా యామం )
man can suppress the six evil streaks in mind complex and overcome the duality.(యమనియమాలు)
Man can use his intellect to analyse,memorise and do Karma in dharmic way.(ప్రత్యాహారం -సత్గ్రంద పటన,సత్సాంగత్యం ,సత్కర్మాచరణ )
But,As long as  Ego is there , man never detached.

మరి,అహం పోవాలంటే ఏమి చేయాలి ? 
వివేక వైరాగ్యాలను శ్రద్ధతో,ఓర్పుతో నిరంతరం --- అనగా, ప్రతి సంఘటనలో,రోజువారీ మనం చేసే పనులలో అమలు చేస్తే నే అహం కరిగి పోతుంది .వివేకం లేని వైరాగ్యం పతనానికి దారి తీస్తుంది .

కారణ శరీరం లోని వాసనా కర్మలతో అరిషడ్వర్గాలు విజ్రుమ్భించి వైకల్యం చెందిన మనస్సు - సర్వ అనర్ధాలకు కారణం .
మనస్సు కూడా రసాయనిక శక్తి రూపాంతరమే .
మనస్సు అటు శరీరం తో ప్రాణం ద్వారా , ఇటు ఆత్మ తో అహం ద్వారా కలిసి ఉంటుంది .
జ్ఞానేం ద్రియాలతో మనకు కలిగే అనుభవాలకు ఆధారం మనస్సు . దీనినే మనో నేత్రం అంటాం .
చిత్తం, మానసం,బుద్ధి ,అహంకారం, ఇవన్నీ వివిధ స్థాయిలలో స్పందించే మనః శక్తి ప్రవాహపు స్థితులు .

సనాతన భారత ధర్మం అంటే సత్యా న్వేషణ . 
ఎలా అన్వే  షించాలి ?
ధ్యాన - జ్ఞాన మార్గం ? గీతలో చెప్పిన పలు మార్గాలు ? 
  • మన జీవ నాన్ని , ఆత్మకు ,లేదా దైవానికి లేదా మహాత్ములు లేదా సద్గురువులకు పూర్తిగా సమర్పణ చేసుకోవడం - అనగా సంపూర్ణ శరణా గతి (భక్తి). 
  • మనం చేసే పనులను -కర్మలను - ఎటువంటి ఆపేక్ష లేకుండా చేయడం (కర్మఫల సన్యాసం ). 
  • observe as witness with out any assumptions,presumptions,opinions and judgments : ఎలాంటి అభిప్రాయాలు,తీర్పులూ  ఏర్పరచు కోకుండా గమనించడం -  - శరీరం లో కలిగే వేదనలను ,స్పందనలను,బయట జరిగే విషయాలను ,నిత్య జీవితం లో ఎదురయ్యే అనుభవాలను ,అలాగే ఆలోచనలు,సంకల్పాలు ఎక్కడి నుండి పుడుతు న్నాయో గమనించడం . 
Attachments - బంధాలు :
సంబంధ బాంధవ్యాలు , వస్తువుల పై వ్యామోహం , ఇంద్రియాల ద్వారా అందే సమాచారం పై మోహం ఇవన్నీ మనిషి కున్న బంధాలు . ఈ బంధాల గట్టిదనం మనిషి చిత్త  సంస్కారం , బుద్ది కుశా గ్రత ,ఆయా సామాజిక స్థితి గతులు మొదలగు అంతర - బాహ్య విషయాల పై ఆధార పడి ఉంటాయి . 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి