ఆధ్యాత్మికత(spirituality) - మతం(religion) .

నేడు హిందూ మతం గా మనం చెప్పు కొంటున్న ది సనాతన ధర్మం(ancient wisdom) లో ఓ చిన్న భాగం . 
నిజం చెప్పు కోవాలంటే ఆధ్యాత్మికత(spirituality) వేరు - మతం(religion) వేరు .

మనిషి కన్నా బలమైన శక్తులు గురించి ఆలోచనలు చేసి ఒక ఉహా సిద్దాంతాన్ని నిర్మించేది తత్వ శాస్త్రం(philosophy) . ఇది మనస్సు తోనే కాక హృదయం తో ముడి పడి ఉంటుంది .

ఆయా సిద్ధాంతాలలో హేతుబద్దత ఉందా అని చూసేది థియాలజీ -తర్క శాస్త్రం  (rational logic). ఇది మన జ్ఞానేంద్రియా లైన మనస్సు ,బుద్ది , వివేకం తో ముడి పడి ఉంటుంది .

సనాతన ధర్మం మనిషికి ఎలాంటి నిబంధనలు విధించ కుండా  సర్వ స్వతంత్రం గా,అంతటా ఏక సూత్రం గా  ఉన్న ఏకైక సత్యం (the truth) గురించి ఎవరికీ వారు అన్వేషణ చేసి ఆ సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలని చెబుతుంది .

ఆర్యావర్తం నకు బయట ఉన్న దేశాల పండితు లు,తత్వ వేత్తలు ,  సనాతన ధర్మ సిద్దాంతాలను కొన్నింటిని సేకరించు కొని వారి వారి  దేశాల కాల మాన పరిస్తితులకు , ఆయా దేశ ప్రజల మానసిక స్థాయి  కి అనుగుణం గా , ఒక గ్రంధం తయారు చేసుకొని దానినే "దేవుడు చెప్పిన ఆజ్ఞలు" గా ప్రచారం చేసు కొంటూ సమాజ సమతుల్యతకు పాటు పడ్డారు .

శారీరక ఇంద్రియాలకు ,మానవ సహజాతాలకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చే  స్థాయిలో ఉన్న సమాజానికి  ఒక నిక్కచ్చి నియంత పంధా ని ఏర్పాటు చేస్తే నే ఆ ప్రజలు క్రమశిక్షణ తో ఉంటారు .
అబ్రహం మతాలు చేసిన , చేస్తున్న పని అదే . 

ఏ  మత ప్రవక్త ఐనా, ఆయా సమాజాలకు మంచి చేయాలనే తలంపు తో ఒక మత గ్రంధం తయారు చేసి,ఆయా సూత్రాలకు అనుగుణం గా ప్రజలను దారి మళ్ళించి  సంఘానికి మేలు చేయాలని సంకల్పిస్తాడు .
ఆ మహనీయుల సంకల్పం ఎప్పుడూ  మంచిదే .

కానీ ఆ తర్వాత కాలా ల్లో ప్రజలు తమ స్వార్ధం కోసం , కొన్ని ప్రయోజనాల కోసం ఆ గ్రంధా న్ని  ఒక కటోర శిలా సూత్రం గా మార్చి వేసి అందరినీ ఆయా సూత్రాలకు బద్దులు గా మారమని బలవంతం చేస్తారు . దాష్టీకం చేస్తారు . యుద్దాలు చేసి క్రూరమ్ గా మారణ హోమం చేస్తారు . స్వార్ధానికి అనుగుణం గా కొత్త కొత్త సూత్రాలను పాత మత గ్రంధం లో ప్రక్షేపించి కొత్త కొత్త శాఖలు ఏర్పాటు చేస్తారు .


"Abraham religions are Dogmatic, sectarian and exclusivistic which promote various conflicting & contradictory ‘-isms’ ". if sanatan dharma also twisted and construed as dogmatic theory,it also be devoluted as another ism'.

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి