పని చేద్దాం ...

మనిషి బలమూ ,బలహీనతా మనస్సే . 
ఎదుటి వాళ్ళు కష్టం లో ఉన్నప్పుడు మనస్సు కదిలి పోవడా న్ని దయ ,జాలి అని అంటాము .
మనమే కష్టాల్లో ఉన్నప్పుడు మనలో కలిగే బాధ ని తలచు కొని కుంగి పోవడం  బలహీనతే(weakness)
 గానీ , అందరూ భావిస్తున్నట్లు సున్నితత్వం కాదు .
సున్నితత్వం (sensitivity)అంటే ఎదుటి వాడి కష్టానికి చలించి సాయం అందించడం .
ఎక్కువ శాతం , మనిషి జాలి(pity) పడతాడు గానీ సాయం(help) చేయడానికి ఉత్సాహం చూపడు .
కొన్నిసార్లు తన కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి సాయం చేస్తాడు గానీ ,పేద వారికి చేయడు .
ఎందు కంటే మళ్ళీ తిరిగి సాయం చేస్తారని .
ప్రతిఫలం లేకుండా మనిషి సాధారణం గా ఏ పనీ చేయడు .
కర్మ ఫలం పై ఆపేక్ష పెంచు కొంటాడు .
ప్రతిఫలం గారంటీ గా వస్తుందని కర్మ సిద్దాంతం చెబుతున్నా మనిషి నమ్మడు .
నమ్మకం లేన ప్పుడే మనిషికి గాభరా ఉంటుంది .
మనిషి కర్తవ్యము పని  చేసు కొంటూ పోవడమే గానీ , కర్మ ఫలం పై ఆపేక్ష ఉండ కూడదని గురు వాక్యం .

సరే, మనిషి పని చేయాలి . సోమరిగా ఏమరు పాటు తో పలాయన వాది  గా ఉండకూడదు .
మరి  ఆ చేసే పని, ఎలా చేయాలి ?

మనిషి పుట్టుక , జీవనం,మరణం  ఓ యజ్ఞం అని  ఊరికే అనలేదు .
 మనిషి పుట్టుక, పెరుగుదలలో లో తలితండ్రుల త్యాగం ఉంటుంది .
మనిషి నేర్చు కొనే క్రమంలో గురువుల సాయం ఉంటుంది .
గృహస్తు గా మారినప్పుడు సంఘం లోని బంధువులు ,  మరి కొందరి సాయం ఉంటుంది .
సమాజాన్ని పోషించే రైతుకి  , పరిశ్రమలో శ్రమించే కార్మికుడికి  , సరిహద్దుల్లో రక్షణ చేసే సైనికుడికి
అలాగే సంఘం ఒక నిర్ణీత పధం లో పురోగమించ డానికి కష్ట పడే ప్రభుత్వానికి ,నాయకులకు ,
అలాగే మన జ్ఞాన , విజ్ఞాన ధార ను అహరహం కాపా డే శాస్త్రజ్ఞులు , ఋషులు,యోగులు,మతాధి పతుల కు
మనిషి ఋణ పడి ఉండాలి .
మూలం వరకు విచారిస్తే , ఈ సకల సృష్టి, వనరులు అందించి మనిషిని పోషించడం లో
ప్రముఖ పాత్ర వహిస్తుంది .
కాబట్టి మనిషి తిరిగి తన వంతు సాయం తిరిగి పైన చెప్పు కొన్న అందరికీ  చేయాలి .
అందుకే మన సనాతన ధర్మం మనిషికి కొన్ని బాధ్యతలను అప్పచెప్పింది .
అవే దేవ, పితృ ,ఋషి ,భూత ఋణాలు . ఈ ఋణాలను మనిషి తీర్చేసు కోవాలి .

యజ్ఞ మంటే అగ్నిలో నేయి ధారగా పోస్తూ స్వాహా చెప్పడమే కాదు .యజ్ఞం భావ ప్రధానం .
కృతజ్ఞతా భావం ఉండాలి . సహజీవన భావం మెదలాలి . సహకారం గట్టి పడాలి .

ఈ ప్రక్రుతి- లో ఉన్న పంచ భూతాలూ ఒక దాని కొకటి ఆలంబన గా ఉంటున్నాయి .
గాలి మేఘ మై జలాన్ని  శో షిం చు కొని పర్జన్య మై సూర్యాగ్ని శక్తితో మట్టి లో జీవాన్ని నింపుతుంది .
జీవ మంటే ప్రాణ శక్తి .
 గాలికి ఉన్న గతిజ శక్తి ,జలానికి ఉన్న  రసాయన శక్తి , మట్టిలో ఉన్న సుప్త చైతన్యా న్ని
 సూర్యాగ్ని ద్వారా  రగిలించి ప్రాణ శక్తిని పుట్టిస్తాయి .
వీటన్నింటి కి లోపలా , బయటా ఉన్న ఆకాశమే వీటన్నింటినీ  ధరించి భరిస్తుంది

వాయు మేఘాలు వర్షం కురిపించి నేలను పులకింప చేసి వి త్తు ని  మొల కె త్తించి పంటని
 పండించి జీవుల ఆకలిని తీరుస్తు న్నాయి .
జలం జీవుల దప్పికను చల్లార్చు తుంది .
అగ్ని సూర్య కాంతి రూపం లో   జీవుల కణ యజ్ఞం  లో జరిగే క్రియలకు శక్తిని అందిస్తుంది .
మనిషి ప్రతి కణం లో జరిగే కణ క్రియలన్నీ యజ్ఞ మే .
యజ్ఞ మంటే కర్మ చక్రం . ఈ చక్రం లో దేని పని అది చేసుకు పోతూ ఉంటుంది .
అన్నీ పని చేస్తూ నే ఉంటాయి . ఏది పని చేయడం మానేసినా సృష్టి అల్ల కల్లోలం
 అవుతుందని వేరే చెప్ప నక్కర లేదు .
ఇక్కడ ముఖ్యం గా చెప్పు కోవలసిం ది ఏమిటీ అంటే , ప్రతి జీవి ,ప్రతి పదార్ధము ,ప్రతి శక్తి శకలము
ఒక దాని పై ఒకటి ఆధార పడి  ఉన్నాయి .
 కాబట్టి మనిషి ఏ పని చేసినా ప్రకృతికి హిత కరం గా ,కృతజ్ఞతా పూరకం గా ఉండాలి .
అదే సనాతన ధర్మ సూత్రం .
 కృతజ్ఞత అనే భావం అత్యంత పవిత్ర మైన భావం . అది మనిషిని వినయ శీలుడిగా ,
అహంకార రహితుడు గా మార్చి వేస్తుంది .
చిన్న వయస్సు నుండి పిల్లలకు ఈ భావం తో పని చేయడం నేర్పితే వాళ్ళ  జీవితమే  మహా యజ్ఞం
అవుతుందని వేరే చెప్ప నక్కర లేదు .
ఉదాహరణకు , కారు ని చూడండి .
కార్బోరేట రు , నాజిల్స్ , వీల్స్ , పిస్టన్ ఇవన్నీ సమ తూకం గా పని చేయ డాన్ని
 కూడా యజ్ఞ మే అన  వచ్చు .

మనిషి ఏమ్ తినాలో , ప్రేగు ల్లో ఉండే బాక్టీరియా నే నిర్ణ యిస్తుంది .
కారం, ఉప్పు ,చేదు ఇలాంటి రుచు ల ఎంపికలో వాటి పాత్రే ఎక్కువ ఉంటుంది .
అంటే వాటి మానసమే  మనిషి మానసాన్ని  ప్రభావితం చేస్తుంది .

మనిషి లో బిలియన్ ల కొద్దీ ఉన్న "కణాల చైతన్యం" , కలిసి సంఘీ భావం తో
పని చేస్తే నే మనిషి ఆరోగ్యం గా  ఉంటాడు .
అలాగే బిలియన్ ల కొద్దీ ఉన్న "వ్యక్తుల  చైతన్యం " సమభావం తో ఉంటేనే సమాజం ప్రశాంతం గా ఉంటుంది .
అదే విధం గా ప్రపంచం, ధర్మ బద్దం గా ఉండా లంటే ,  సృష్టి లో  బిలియన్ ల కొద్దీ ఉన్న
స్థావర జంగమాలు ,పర్వతాలు, సముద్రాల  లోని అణు చైతన్యం అంతా  ఒకే విధ మైన సరళి లో ఉండాలి .
 ధర్మ ప్రతిష్టాపన అంటే అదే . 

the fundamental Rule of universe is Work..work...work...
work with co-ordination & co-operation and
work with mindfulness & thankfulness
Work with love & work to Serve.
work &be happy and Let all be happy...........

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి