తిమిరం తో సమరం . అదే నవరాత్రి ఉత్సవ పరమార్ధం .
సత్వ ,రాజస ,తామస గుణాల కలయిక వలన అపరా ప్రక్రుతి సృష్టింప బడుతుంది .
ఈ మూడు గుణాల వలన సకల స్థావర - జంగమాలు ఎలా ఏర్ప డ్డాయో ,అవే మూడు గుణాలు విభిన్న నిష్పత్తి లో కలియడం వలన పరిణామ పరంగా ఉన్నత జీవులలో అరిషడ్వర్గాలు , మనస్సు ,చిత్తము ,బుద్ది ,అహంకారం ఉద్భ వించాయి .
అమాయకత్వం(innocence) -అజ్ఞానం (ignorance)ఇవి రెండూ వేర్వేరు లక్షణాలు .
రాత్రి అంటే అజ్ఞానం . అనగా అజ్ఞానం తో మసకబారిన మనిషి,తనలోని 3 శక్తులను ఉద్దీ పింప చేసుకొని
ఆ అజ్ఞానాన్ని రూపు మాపు కోవడానికి చేయ వలసిన సాధన కు , ఆశ్వీజ మాస శుక్ల పక్షం సరైన సమయం అని ఋషి వాక్యం .
9 రకాల లంపటాలు - 6 భేద భావాలు (అరిషడ్వర్గాలు ), కల్మష పూరిత మానసం , చిత్తం ,అహం -మొత్తం ఈ 9 రకాల బలహీనతలతో యుద్ధం చేయడమే నవరాత్రి దీక్ష .
ఇచ్చా శక్తికి లక్ష్మి ,జ్ఞాన శక్తికి సరస్వతి ,క్రియా శక్తికి దుర్గ - 3రకాల శక్తి కి ప్రతిరూపా లైన మువ్వురినీ
ఆరాధించడ మంటే , ఆ 3 శక్తులను మన శరీరం, మనస్సు ,ఆత్మ పైకి ఆవాహన చేసు కోవ డమే .
అదే శ క్త్యుపాసన .
ఆత్మ పైకి పరమాత్మని ఆవాహన చేసు కొంటే అది యోగం .
మనస్సు పైకి పరమాత్మని ఆవాహన చేసు కొంటే అది మంత్రం .
శరీరం పైకి పైకి పరమాత్మని ఆవాహన చేసు కొంటే అది న్యాసం .
అంగన్యాస మంటే దైవాన్ని మన శరీరం లోని వివిధ అంగాలపై ప్రతిష్టించు కోవడం .
కరన్యాస మంటే దైవాన్ని మన చేతి వేళ్ళ పై ప్రతిష్టించు కోవడం .
ఈ విధం గా, 3 శక్తులను అంగ న్యాస - కర న్యాస పూరకం గా ,మంత్ర పూరకం తో అనుష్టాన సాధన చేస్తూ
తద్వారా ఆ శక్తులను మన ఆత్మ లో ప్రతిష్టించు కొంటే అదే బ్రహ్మోత్సవం .
ఇదంతా జరగా లంటే శరీరము ,మనస్సు ,ప్రాణము శుద్దం గా ఉండాలి .
సంకల్పం లో , ఆలోచనలో , వాక్కులో, క్రియలో ఎలాంటి కోపం,మోహం ,ఈర్ష్య ,లోభం ,గర్వం లేకుండా ,
సమత ,సమతుల్యత ఉండి ప్రేమైక భావం ,కారుణ్యం పెంపొం దాలి .
అంటే ఈ మూడింటి లో స్పందనలు ఒకే రకం గా ,ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా
సమన్వయం గా ఉండా లి .
అంటే హృదయం లో లక్ష్మీ దేవిని ప్రతిష్టించు కోవాలి . బుద్ది లో సరస్వతి ని నిలుపు కోవాలి .
దేహం లో కి దుర్గా మాతని ఆవాహన చేయాలి . దీనినే త్రిపుర సుందరీ దీక్ష అంటారు .
శక్తి ని గౌరవం గా ,పూజ్య భావం తో చూడాలి .
అంటే మన కున్న ప్రక్రుతి వనరులను ధ్వంసం చేయకుండా మితం గా వాడు కోవాలి .
పంచ కోశ శుద్ది - శక్తి ఉపాసన -ఆత్మ సమర్పణ ( అహాన్ని బలి ఇవ్వడం ) --- ఇదే నవ రాత్రి ఉత్సవాలలోని పరమార్ధం .
బాహ్య క్రియలు -పండుగలు,పూజలు చేయాలి .
కానీ పై పై పటోపాలతో నే, మన సాధన ఆగి పో కూడదు .
Comments
Post a Comment