మనసా ... ఓ మనసా

ఏక్ నిరంజన్ దగ్గరకు "సందేహం " వచ్చి అడిగాడు ... 
మనస్సు కోతిలాంటి దని మనకు తెలుసు . మరి ఆ కోతిని ఎలా అదుపులో పెట్టాలి ? 
దానికి ఒక తాడు కావాలి . దానినే మనం దైవం అంటాం . సరే తాడు కోతికి కట్టినా ఉపయోగం లేదు .
 అప్పుడు ఆ తాడుని ఒక రాట కి కడతాం . ఆ రాటే మంత్రం లేదా ఒక రూపం -లేదా ఒక భావం .

రోజుకి సుమారుగా 60000 ఆలోచనలు చేస్తుంది మనస్సు . వాటిలో మెజారిటీ ఆలోచనలు ఒకే విషయం గురించి అదీ వ్యతిరేక భావనలు ,రాజస తామస భావనలు ... భద్రతకు , అత్యాశ ,దురాశ కి చెందిన వై
  ఉంటాయి .
వీటన్నింటి నుండి మనస్సుకి విముక్తి కలి గించా లీ  అంటే ,మనస్సుకి ఏదో ఒక్క విషయం మాత్రమే ఇవ్వాలి . అదీ సాత్విక పరమైన అహంకార రహిత మైన భావం ఐతే మంచిది .

సాత్విక ఆలోచనలు అంటే ఏవి ?
నిస్వార్ధం , తృప్తి , సహనం , క్షమ ,కరుణ ,పరోపకారం , పరహితం ,పర్యావరణ హితం ,లోక కళ్యాణ కారకం ...
వీటిని మన రోజు వారీ జీవనం లో అన్వయించు కొని మన " వ్రుత్తి - ప్రవ్రుత్తి -కుటుంబ -సంఘ " బాధ్యతలను
నిర్వర్తించడం . ఇదే కర్మ యోగ మార్గం  .
"దైవం ' అనే భావనలో సాత్వికత ఉంది . ఎలా గంటే, దైవం చెప్పేది వింటాం( మనస్సాక్షి చెప్పేది ) . అదే ప్రార్ధన . ప్రార్ధన అంటే మన కోరికల చిట్టా విప్పడం మాత్రం కాదు . దైవం అంటే సర్వ కాల  సార్వ జనీన భావన .
కష్ట నష్టాలు వచ్చిన ప్పుడు మనిషి కి ఓ తోడు , ఆలంబన కావాలి .
 అలాగే సుఖ సంతోషాలను పంచు కోవడానికి ఒకరు కావాలి .
వీటన్నింటినీ సమర్ధం గా పూరించే భావనే దైవం .
కొందరికి దైవం అంటే విగ్రహం కనబడాలి . మరి కొందరికి దైవం అంటే మంత్ర తంత్రాలు ఉండాలి .
మరి కొందరికి తీర్ధయాత్రలు ,వ్రతాలు ,నోములు ,హోమాలు ఉండాలి .
మనిషి లో ఉన్న వాసన గుణాలను బట్టి వివిధ పద్దతులు ఇష్ట పడతారు .
కానీ ఇవన్నీ, 'అహంకార రహిత మైన శరణా  గతి తో నిర్వర్తించి నప్పుడే సాత్విక మవుతాయి .
దీనినే భక్తీ యోగ మార్గం అంటాం .
మరి ధ్యాన మార్గం అనేది ఒకటుంది గదా ? దాని వివరాలు ఏమిటి ?
కళ్ళు తెరిస్తే కనబడే విషయాలు మనిషి ఆలోచనలను చిందర వందర చేస్తాయి .
కళ్ళుమూసి మనకు ఇష్ట మైన శబ్దం లేదా రూపము పై మన ధ్యాసను పెట్టాలి .
 అది కూడా సంపూర్ణ శర ణా గతి తో ఉన్నప్పుడే  ,ఎలాంటి ఆందోళన లేకుండా ఆ ధ్యాస ఒకే విధం గా ఉండి
ధారణ గా మారుతుంది .
మనస్సుకి ధారణ అలవాటు చేయడం ద్వారా మనస్సుని స్వాధీనం చేసు కొంటాం .
మనస్సుని చంపేయండి అంటే నిజ మైన అర్ధం మనస్సులోని ఆలోచనలను రూపు మాప మని ...
60000 ఆలోచనలు వద్దు . ఒకే ఒక్క సాత్విక మైన ఆలోచన ...
అహంకార రహిత సంపూర్ణ శర ణా గతితో కూడిన భావన .. అది నిలిచే వరకు మనం రోజూ అభ్యాసం
చేయ డమే సాధన .

సరే , ఇలా సాధన చేస్తూ ఉంటే మనస్సు బుద్ది గా ఉంటుందని , మన సాక్షి చెప్పి నట్లు గా
 వింటుందని చెబుతున్నారు . దీని వలన నాకు ధనం వస్తుందా? 
కీర్తి వస్తుందా ?...  సందేహం" అడుగు తూనే ఉన్నాడు . 

అన్నీ వస్తాయి ... అలాగే  ప్రశాంతత , ఆనందం కూడా వస్తాయి . 
మరి ఈ విధం గా ధ్యానం చేస్తూ ఉంటే దైవం కనబడతాడా ?
దైవం అంటే మన జ్ఞానేమ్ద్రియాలతో ,మనస్సుతో ,బుద్ది తో గ్రహించ లేనిది .
మరి నేను "దైవం ' అనే భావనతో ధ్యానం చేస్తున్నా కదా ?ఎందుకని గ్రహించ లేను ?
సత్య మైన(మార్పు లేని ) నిర్గుణ తత్వాన్ని, అంతే  సత్య మైన నిర్గుణ తత్త్వం తో నే గ్రహించగలం .
అది ఎక్కడ ఉంటుంది ? 
అదే ఆత్మ . మన అంతరాత్మ . దానిని గ్రహించిన వారు చెప్పిన పదాలే ఇవన్నీ . వారే మన సనాతన ఋషులు .
 ఆత్మ ద్వారా  పరమాత్మని అవగాహన లోకి తీసు కోవడ మే మోక్షం .

ఆత్మ - పరమాత్మ ల గురించి , ఆత్మ ని ఆవిష్కరిమ్చు కొన్న మహా ఋషులు మాత్రమే చెప్ప వలసిన  ఈ మాటలను  వేరెవ్వరూ చెప్ప కూడదు . చెప్పినా వాటికి సత్య సంధత  ఉండదు .
అందుకే బుద్దుడు మోక్షం ,నిర్వాణం గురించి ,పునర్జన్మల గురించి ఏ ప్రశ్న అడిగినా మౌనం వహించే వారు .
కానీ  శాస్త్ర పరిశీలన , హేతు బద్దత తోనే విషయ నిబద్దత ను నిర్దా రించే ఈ కాలం లో
అందరికీ సనాతన ధర్మ సూత్రం  అర్ధం అవ్వడానికి  ప్రయత్నం చేయ వలసిన బాధ్యత
మనందరిదీ ... 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి