గీతా జయంతి శుభా కాంక్షలు .
మిత్రులారా !
అందరికీ నమస్సులు .
మన సనాతన భారతా వనిలో ఎన్నో ఆరోగ్య కరమైన సంప్రదాయాలు ,ఆచారాలు ఉన్నాయి .
అయినా , పాశ్చాత్య నాగరికతా మోజులో ,సామాజిక సమాచార మాధ్యమం లో మనవి కాని
సంప్రదాయా లను ఎన్నింటినో నేడు చూస్తున్నాము .
మన యువత కూడా వాటిని ఆచరించ డానికి ఎక్కువ మోజు చూపు తున్నారు .
వాటిని "ఆచరించ వద్దు" అని చెప్ప బోవడం లేదు .
మంచి అనేది ఎటు నుండి ,ఎక్కడ నుండి వచ్చినా స్వీకరించమని గాయత్రి మంత్రం మనకు చెప్పింది .
ఇతరుల సంప్రదాయాల లో మంచి చెడు ల గురించి కూడా ఇక్కడ మనం చర్చించ నక్కర లేదు .
కనీసం మన విలువలను ,ఆచారాలను , సంప్రదాయాలను చూడండి .
వాటిని ఎలా నిల బెట్టు కోవాలో ఒక్క సారి ఆలో చించండి .
స్వచ్చ భారత్ అంటే బయట ఉన్న మకిలి నే కాదు, మనలో గూడు కట్టు కొన్న మకిలిని కూడా
శుభ్రం చేసు కోవాలి .
దీనికి నాంది గా మనందరం రాబోయే గీతా జయంతి సందర్భం గా శుభా కాంక్షలు చెప్పు కొందాం .
సర్వ జనులకు , సర్వ లోకాల కు శుభం జరగా లనే ఆశతో శ్రీ కృష్ణుడు మనకి ప్రసాదించి న
భవరోగ నాశిని -"భగవద్గీత" - లోకానికి వెల్లడైన రోజు -గీతా జయంతి (2-12-2014 ).
మీ అందరికీ గీతా జయంతి శుభా కాంక్షలు .
Comments
Post a Comment