మంచి రోజులు వస్తున్నాయా ?

                              మోడీ సారధ్యం లో కొత్తగా ఏర్పడిన  కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ... అనగా గత ఏడాది కాలం లో తీసుకొన్న కొన్ని మంచి నిర్ణయాలు !
1. ప్రస్తుతం మన దేశం లో ఉన్న లక్ష కిలో మీటర్ల హైవే కి ఇరు వైపులా చెట్ల పెంపకం .
2.  పోషకాహార లోపం తో కునారిల్లుతున్న 50కోట్ల మంది స్త్రీలు , పిల్లలకు సెల్ ఫోన్ ల ద్వారా వీడియో ల రూపం లో అవగాహన పెంచి ,సరైన పోషక ఆహారాన్ని , సరైన సమయం లో 'టీ కాలను తీసు కొనే విధం గా ప్రోత్స హించే కార్య క్రమం .
మన దేశం లో  ప్రభుత్వాలకే కాదు , ప్రజలకు కూడా  ఆరోగ్యం పై  తగినంత శ్రద్ద లేక పోవడం వలన ,
స్త్రీలను ,ఆడ పిల్లల ను అన్ని విధాలుగా తక్కువ చూపుతో చూడటం వలన ,
 పోషకా హారం పై తగినంత అవగాహన లేకపోవడం వలన  , 
చదువుకొని అవగాహన ఉన్న వారు కూడా పోషక విలువులు ఉన్న ఆహారాన్ని తీసు కోకుండా జంక్ ఫుడ్ కి అలవాటు పడటం వలన,
కుర్చీలకి అతుక్కు పోయి టీవీ ,కంప్యు టర్ ల పైనే సగం జీవితాన్ని ఎల మార్చడం వలన - షుగర్ , రక్త పోటు , ప్రసవ సంబంధ రోగాలు , శిశు మరణాలు , మొదలైన జబ్బులతో దేశ ప్రజల ఆరోగ్యమే కాదు ,ఆర్ధిక వ్యవస్థ కూడా చిన్నా భిన్నం అవుతుంది . 
దీనికి విరుగుడుగా  నిత్యమూ “ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలను” ప్రజలకు ప్రసారం చేయ వలసిన అగత్యం అవసరమూ ఉంది . 

3. పరిశుభ్ర భారత దేశం .
మన దేశం లోని 20కోట్ల కుటుంబాలలో 10 కోట్ల కుటుంబాలు ఆరుబయలు ప్రదేశాలను పాడు చేస్తూ తమ ఆరోగ్యమే  కాక ఇతరుల ఆరోగ్యాన్ని కూడా చిధ్రం చేస్తున్నారు . దీనికి విరుగుడు - సుమారు కోటి మరుగు దొడ్లు కట్టించే ఏర్పాటు . 

వందలాది పల్లెల ,పదుల కొద్ది పట్టణాల మురుగు ,వేలాది ఫాక్టరీ ల వ్యర్ధాలు గంగ ని కాలుష్యం తో అతలా  కుతలం చేస్తున్నాయి . అందరినీ శుద్ధి చేసే గంగమ్మ ని పవిత్రీక రించు కోవలసిన అవసరం  ఎంతో ఉంది . దీ నికి సమాధానం -గంగా శుద్ధి కార్యక్రమం . 

4. అభివృద్ధి చెందిన దేశాలలో 90 శాతం మందికి బాంక్ ఖాతాలు ఉంటాయి . కాని మన దేశం లో కేవలం 35 శాతం మందికి మాత్రమే ఖాతాలు ఉండటం వలన నల్ల ధనం నిరాఘాటం గా ప్రవ హిస్తుం ది . కాబట్టి ,  అందరికీ బాంక్ ఖాతాలు . కూటికి ,గుడ్డకి , నీడకి కరువులేని వారికి -  కూడ బెట్టే అలవాటు , ఎలాంటి పరపతి లేని వారికి 5000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ,ప్రమాద భీమా ,  రుణ మదింపు కి వెసులు బాటు, తద్వారా అట్టడుగు వర్గాలకు ఆర్ధిక స్వాలంబన

5 . ఆర్ధిక స్థితి కి సంబంధం లేకుండా , అకాల మరణం నుండి కుటుంబాలకు ధీమా కలగ చేసే భీమా సదుపాయం .

6.  మందులు , ఖరీదైన వైద్య పరికరాల ఖర్చే ,  హాస్పిటల్ బిల్లు లలో అత్యధిక శాతం ఉంటుంది . కాబట్టి , ప్రభుత్వమే  జనరిక్ మందుల దుకాణాలను స్థాపించి చౌకైన మందులను , వైద్య పరికరాల నియంత్రణా చట్టం (medical device regulation act )  ద్వారా సరస మైన ధరలలో వైద్య  పరికరాలు(medical devices/consumables) అందించే ఏర్పాటు .

7. ఆధార్ నంబర్ ప్రక్రియ ను విదేశీ కంపెనీ లు అజమాయిషీ చేస్తూ  ఉండటం వలన మన పౌరుల కి సంబంధించిన సమాచారం విదేశీ సంస్థలకు అందుబాటులో ఉండటం , తద్వారా భారత సమాజానికి ఏదైనా అపకారం కలుగుతుందనే భయాలను పక్కన బెట్టి , ఆధార్ వ్యవస్థను నిరాఘాటం గా నడప డానికి నిర్ణయించు కొన్నట్లుగా సుప్రీం కోర్ట్ కి తెలియ చేయడం ...

8. అస్సాం - బంగ్లా దేశ సరిహద్దుల్లో  అటూ ఇటూ కాకుండా బతుకులు వెల్ల దీస్తున్న లక్ష లాది  మందికి వారు ఏ  దేశం లో ఉండాలో తేల్చు కొనే   స్వయం నిర్ణయాధికారం ఇచ్చే ఒడంబడిక .

9. విదేశీ పాలసీ లో అత్యంత చురుకుగా  అటు  పొరుగు దేశాలతో , ఇటు పెద్ద దేశాలతో చక్కటి సంబంధాలు పెంచు కోవడం ద్వారా , -
 నూక్లియార్ ఇంధన సమస్య కు పరిష్కారం (ఆస్ట్రేలియా,కెనడా  నుండి 500 టన్నుల యురేనియం  ),
విదేశీ పెట్టుబళ్ళ  ప్రవాహం (జపాన్ నుండి సుమారు 35 బిలియన్ డాలర్ల పెట్టుబడి మరియు చైనా నుండి సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి ).
అలాగే నేపాల్ లో ఒక్కటి ,భూటాన్ లో నాలుగు విద్యుత్ ప్రాజక్ట్ లు కట్టి తద్వారా వచ్చే విద్యుత్ ని ఉచితం గా పొందే అవకాశాన్ని దొరక బుచ్చు కోవడం విదేశీ సంబంధాల మానేజ్ మెంట్ లో మోడీ ప్రభుత్వం సాధించిన అత్యంత గొప్ప మలుపు .
వియత్నాం  తో మంచి సంబంధాలను పెంచడంతో , వియత్నాం ని ఒప్పించి ఆయిల్ కాంట్రాక్ట్ ని ONGC   కి ఇప్పించారు . అలాగే దక్షిణ చైనా సముద్రం లో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పడం లో వియత్నాం సాయం పొందే అవకాశం ఉంది .
సౌదీ అరెబియాని ఒప్పించి క్రూడు ఆయిల్ పై ప్రీమియం సుంకాన్ని తీసి వేయించ డం వలన ప్రభుత్వానికి వేల కోట్లు కలిసి వచ్చింది .
అలాగే  అటు అమెరికా వద్దన్నా, ఇరాన్ తో సత్ సంబంధాలు పునురుద్ద రించి , ఆయిల్ ని డాలర్లలో కాకుండా రూపాయలలొ కొని దిగుమతి చేసు కోవడం వలన వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం కలిసి
వచ్చింది . అలాగే పాకిస్తాన్ కి దగ్గరగా ఒక నిర్ణీత ప్రదేశం లో ఉన్న "చాబహార్ పోర్టు" నిర్మాణపు కాంట్రాక్ట్ ని భారత్ దొరక పుచ్చుకోవడం రక్షణ రీత్యా ఒక మంచి మలుపు .
శ్రీలంకలో  నా నాటికీ పెరుగుతున్న చైనా జోక్యానికి అడ్డుకట్ట పడే విధం గా  పావులు కదపడం వల్ల , మళ్ళీ శ్రీలంక ప్రభుత్వం మన దారికి వచ్చింది . దీనితో ,ఇదివరకు "హంబన్ టోట" పోర్టు నిర్మాణపు కాంట్రాక్ట్ ని చైనా కి అప్ప గించిన శ్రీలంక ,ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేసుకొని ఇండియా కి కట్టబెట్టింది .
చైనాకి మనకి మధ్య వాణిజ్య లోటు పెరిగి పోతూ ఉండటం తో, మోడీ  anti-dumping tax వేయడానికి సమాయత్త మవుతున్నట్లు  గా సంకేతాలు ఇవ్వడం తో చైనా ఇప్పుడు మనదేశం లోనే పరిశ్రమలు పెట్టడానికి ఒప్పుకొం టుంది .
చైనాకి మనకి ఉన్న సరిహద్దు వెంబడి రోడ్  లేక పోవడం తో మన సైనికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో సామాన్యులకు అర్ధం కాదు . కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుండో ఆ ఫైల్ ని అణగ  తొక్కి ఉంచింది . మోడీ  ఆ ఫైల్ ని దుమ్ము దులిపి ఈ శాన్య రాష్ట్రాలలో ఉన్న చైనా  సరిహద్దు వెంబడి రోడ్ వేయ డానికి అనుమతి మంజూరు చేయడం వలన మన రక్షణ రంగాల వారికే కాక వాణిజ్య వర్గాల కి కూడా ఎంతో మేలు .
సరైన ఫైటర్ విమానాలు లేక మన వైమానిక రక్షణ దళాలు నిర్వీర్య మవ్వు తుంటే  కాంగ్రెస్ ప్రభుత్వం  సోద్యం చూస్తూ కూర్చుంది .  మోడీ, ఫ్రాన్స్ ప్రభుత్వం తో సంబంధాలు మెరుగు పరిచి 36 రా ఫెల్ జెట్ ఫైటర్  విమానాలు ఇచ్చే టట్లు ఒప్పందం అదీ తక్కువ ధరలో ,ఎ లాంటి దళారులు లేకుండా  కుదుర్చు కొన్నారు .
 అంతే కాదు , ఇప్పటి వరకు రష్యా ,అమెరికా మనకు ఎలాంటి నూక్లియార్ రియాక్టర్ లు అమ్మినా నోరు మూ సు కొని
కొనే వాళ్ళం . కానీ ,  రోజులు మారాయి .  మోడీ స్వయం గా ఫ్రాన్స్ ప్రభుత్వం వారితో మాట్లాడి అత్యంత అధునాతన సాంకేతికత తో పనిచేసే నూక్లియార్ రియాక్టర్  లను మన దేశం లోనే , మన పారిశ్రామిక కంపెనీ ల భాగ స్వామ్యం తో తయారు చేసి మనకు అమ్మే విధం గా  ఒప్పందం కుదుర్చు కొన్నారు .
అమెరికా తో  సత్ సంబంధాలు చరిత్రలోనే ఒక పెద్ద మలుపు . 16 నూక్లియార్ రియాక్టర్ లు , నూక్లియార్  పవర్ ప్లాంట్ లు ఇవ్వడానికి అమెరికాని ఒప్పించారు . ( మనకు సరఫరా చేసే నూక్లియార్  ఇంధనం పై నిఘాని అమెరికా రద్దు చేసింది . బదులుగా , ప్రమాదం సంభ వించి నప్పుడు , అమెరికా కంపెనీలను బాధ్యులుగా చేయ బోమని  ఇండియా కూడా హామీ ఇచ్చింది ) .
ఐక్య రాజ్య సమితి లో భారత్ హవా పెరగడానికి , అలాగే ఇండియా కూడా ఒక స్థానిక శక్తి మాత్రమే కాదు , ప్రపంచం లోనే బలవత్తర మైన దేశమనే భావనను అందరికీ కలిగించడం లో కృత కృత్యు లయ్యారు . దానికి ఓ ఉదాహరణ "బ్రిక్స్ బాంక్ "స్థాపన . అదే ఊపులొ భారతీయ యోగా కి ప్రాచుర్యం కలిగే విధం గా 
 "జూన్ 21-" ప్రపంచ యోగా దినోత్సవం "  గా ప్రకటన చేయించారు . 
అలాగే పొరుగు దేశాలు ఎంత చిన్న వైనా , చిన్న చూపు లేకుండా సార్క్ బాంక్ స్థాపన ,అలాగే సార్క్ దేశాలకు ఉమ్మడి శాటిలైట్ -ఇవన్నీ భారత్ అంటే బిగ్ బ్రదర్ అనే అపోహను తుడిచి వేయడానికి పనికొచ్చాయి . 


10. మన దేశం లో 65 శాతం మంది వయస్సు 35 కన్నా తక్కువే ! వీరిలో అత్యధికం గా  ఎలాంటి  చదువు గానీ ,సంపాదనకి పనికి వచ్చే నైపుణ్యం గాని లేని వారు 65 శాతం మంది ఉన్నారు . అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించినా , ఉపయో గించు కోలేని స్థితి వీరిది . వీరందరికీ ఏదో ఒక వ్రుత్తి సంబంధ మైన నైపుణ్యం నేర్పితే భారత దేశానికి మానవ వనరులే అతి పెద్ద ఎస్సెట్ అవుతాయ నే భావనతో "నైపుణ్య అభివృద్ధి  మిషన్" ఆ రం భించి తగిన బడ్జెట్ ని కూడా కేటా యించారు . 

11. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ పరిధి నుండి పండ్లు ,కాయగూరలను మినహాయించమని రాష్ట్రాలకు సూచించింది . అలా చేయ డం వలన  దళారుల బెడద తగ్గింది .  సరకు ని గిడ్డంగుల్లో దాచి అధిక రేట్ల కు అమ్మే నల్ల బజారు వర్తకులను నిరోధించే అవకాశం కలిగింది .

12. శాస్త్రీయత మిషన్ కి  మరిన్ని నిధులు . రీసెర్చ్ స్కాలర్స్ కి(రూ . 25000/నెలకి ) ,పోస్ట్ డాక్తరల్ స్కాలర్స్ కి (రూ . 40000/నెలకి ) స్తైపెండ్ పెంచి , శాస్త్రీయ ప్రయోగాలకు పెద్ద పీట వేయడం వలన ఎక్కువ మంది విద్యార్ధులు రీసెర్చ్ లోకి రావడానికి అవకాశం ఏర్పడింది . 

13. కాంగ్రెస్ ప్రభుత్వం అటు ధ్వని తరంగాల కుంభ కోణం ద్వారా లక్ష కోట్లు , అప్పనం గా బొగ్గు గనులు అస్మదీయులకు దోచి పెట్టడం ద్వారా 2 లక్షల  కోట్ల ప్రజా ధనం లూటీ చేశారని "కాగ్ " చెబితే ఎక్కువ మంది నమ్మలేదు . కానీ మోడీ ప్రభుత్వం పారదర్సక పద్దతి లో  ధ్వని తరంగాల  మరియు బొగ్గు గనుల వేలం ద్వారా లక్షలాది కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానా లో జమ వేసి అందరినీ ఆశ్చర్య పరిచింది .

14. రైల్వే లో 100% , రక్షణ పరిశ్రమ లలో 49% విదేశీ పెట్టు బళ్ళకు అనుమతి ఇవ్వడం మంచి పరిణామం .

15. మంత్రు ల సంఖ్య  ని ,  మంత్రిత్వ శాఖల ను తగ్గించి వేయడం వలన పరిపాలనా ఖర్చు తగ్గింది . పరిపాలనలో అవినీతి తగ్గింది . ఆఫీసుల్లో టంచన్  గా హాజర్ వేసుకోవడం ,వ్యాపార - ప రిశ్రమాలకు  టంచన్  గా లైసెన్స్ లు జారీ చేయడం చేస్తున్నా , కింది స్థాయిలో ఎలాంటి అవినీతి లేకుండా చూడటం అనేది సాధ్యం కావడం లేదు .

16. సోషల్ మీడియా ని అత్యంత నిపుణత తో ఉపయోగించు కోవడం ద్వారా అటు ప్రజలతో ,ఇటు విదేశీ ప్రభుత్వాలతో , అలాగే మీడియా వారితో అర్ధ వంతమైన సంబంధాల ను బలపరచు కోవడం ద్వారా " ప్రజల వద్దకు  ప్రభుత్వం " సాధ్య పడేటట్లు చేశారు . అలాగే  సామాన్యుడి ఆలోచనలకు విలువ ఇచ్చి పధకాల ప్రణాళిక లో జన బాహుళ్యాన్ని కూడా  పాల్గొనే టట్లు చేయడం వలన ప్రజలలో బాధ్యత , దేశం గురించి ఆలోచన పెరిగాయి .

17. స్టాక్ మార్కెట్ లు ,దేశీయ పారిశ్రామిక సంస్థలు  మోడీ పై ఎన్నో ఆశలు పెట్టు కొన్నాయి . వాటిని ఏ  మాత్రం వమ్ము చేయ కుండా మోడీ పాలన సాగుతుంది . 
డాలర్  -రూపాయ్ మారకం సరైన నిష్పత్తి లో ఉండే విధం గా చేయడానికి నల్ల ధనం ,హవాలా మార్కెట్ , బంగారం దిగుమతి మొదలైన  నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి .
  
18.    ఎన్నో  స్వచ్చంద సంస్థలు ,క్రిస్టియన్ మిషనరీ ల మాదిరి ఏదో సాయం చేసే వంకతో భారత సార్వ భౌమత్వానికి వ్యతిరేక మైన చర్యలు చేయడం అనేది ఎప్పటి నుండో జరుగుతుంది . అలాగే అగ్ర రాజ్యాల పరిశ్రమల కోసం ఎన్నో చేయరాని పనులు ... ఉదాహరణకు కాన్సర్ మందులను భారతీయ పేద వారిపై పరీక్షించి భారతీయులను గినియా పందుల లెక్క చూసిన PATH  సంస్థ , అమెరికా అండతో పేట్రేగి  కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకం గా ఆందోళనలు చేపట్టి నానా గందర గోళం చేసిన గ్రీన్ పీస్ సంస్థ , ఇలా చెప్పు కొంటూ పోతే ఇలాంటి  దుర్మార్గపు దుశ్చర్యలు ఎన్నో . ఈ సంస్థ లేవీ లెక్కలు చూపవు . టాక్స్ లు కట్టవు . ప్రభుత్వానికి కొరకరాని కొయ్యల్లా మారిన ఇలాంటి వేలాది సంస్థలను మూసి వేయించడం మోడీ చేసిన సాహసోపేత చర్య .       

19. నెహ్రు, తర్వాత అదే స్థాయిలో ప్రజలను ఉత్తేజ పరచిన ప్రధాన  మంత్రి  మోడీ.
నమో గంగ ,స్వచ్చ భారత్ ,డిజిటల్ భారత్ , భారత్ తయారీ , జన ధన యోజన , బేటీ బచావో - బేటీ పడావో ,  సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన , బూజు పట్టిన చట్టాల రద్దు , ఇరుగు - పొరుగు లతో సత్  సంబంధాలు ,
ఖాదీ  వాదీ , యోగా  దినొత్సవ్ .... ఇలా ఎన్నో మంచి కార్య క్రమాలతో ప్రజలలో సమాజం పైన ,దేశం పైన బాధ్యతని పెంచి వారు కూడా భాగ స్వామ్యం చెందే విధం గా ప్రోత్స హిస్తున్నారు . 

విచిత్రం ఏమిటీ అంటే ,భారతీయులే కాదు ప్రపంచ మేధావులు ,వ్యాపార సంస్థలు , అలాగే అన్ని దేశాలు ... అగ్ర రాజ్యాలు ,చిట్టి పొట్టి దేశాలు  , ఆయా ప్రభుత్వ అది నేతలు ఒక్కరేమిటి ... ప్రపంచ సమాచార వ్యవస్థ చూపు ని కూడా  భారత్ వైపు తిరిగే టట్లు చేసిన మోడీ  ఒక విచిత్రం !

దేశం లో 70శాతం ఆధార పడి  ఉన్న ప్రాధమిక రంగ మైన వ్యవసాయం , తోటలు , చేపలు ,డైరీ ,పౌల్ట్రీ రంగా లు లాభ సాటిగా మారే ఏర్పాటు ఇంకా ఏమీ చేయ లేదు . నల్ల ధనాన్ని ,అవినీ తిని ఇంకా గట్టిగా అరికట్టే కార్య క్రమాలు చేయ వలసి ఉంది . రాజ్య సభ లో మెజారిటీ లేక పోవడం వలన పాలనా సంస్కరణలు కుంటు బడుతున్నాయి . 
పల్లెల్లో పట్టణ  సౌకర్యాలు ,ఉద్యోగ - ఉపాధి కల్పన , వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు,
 విద్య -వైద్య రంగం లో విప్లవాత్మక మార్పులు రావడానికి  అవసర మైన బడ్జెట్ ,
న్యాయ శాఖలో -పీనల్ కోడ్ లో ,కోర్టుల  పనితీరు లో ఎన్నో మార్పులు చేయ వలసిన అవసరం ఉంది . 
·         రైతుకి గిట్టు బాటు ధర  తను పండించే పంట ను ఎంత ధర కు అమ్ముకోవాలో ,ఎక్కడ అమ్ముకోవాలో నిర్ణ యించు కొనే స్వేచ్చ రైతుకి ఉండాలి . 
·         బంగారం నియంత్రణ చేసినట్లే ,పట్టణ  భూ సంస్కరణలు కూడా చేపట్టాలి . -
మనిషికి (>18 ఏళ్ళు ) వేయి చదరపు గజాల కన్నా ఎక్కువ ఖాళీ స్థలం ఉండకూడదు . 
సంస్థకి  , పరిశ్రమలకు, వారు ఏ ఉద్దేశ్యం తో ఆయా సంస్థలను నెలకొల్పారో  వాటికి వినియోగించ కుండా ఖాళీ గా ఉంచినప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి . 
అంటే పట్టణ ప్రాంతాలలో ,  ఏ భూమీ కూడా ఖాళీ గా ఉండకూడదు . 
అటు వ్యవసాయమో ,పరిశ్రమో ,నివాస లేదా వాణిజ్య భవనమో ఉండాలి . 

ప్రస్తుతం (2015) మన దేశ జిడిపి 2 ట్రిలియన్ ల డాలర్  లలో సుమారు 60శాతం సేవా రంగం నుండే వస్తుంది . కాబట్టి మానవ వనరుల  నైపుణ్యాన్ని పెంచితే జిడిపి ఇంకా పెరిగే అవకాశం ఉంది . 
దేశం అభివృద్ధి చెందడం అంటే , స్మార్ట్ ఫోన్ లు ,డిజిటల్ విప్లవం ,బుల్లెట్ ట్రైన్ లు మాత్రమే కాదు . అంత  కంటే ముందు , అందరికీ నిర్బంధ ప్రాధమిక విద్య ,వైద్యం ,న్యాయం అందించాలి . అంటే , మన జి డి పి లో కనీసం 10 శాతం విద్యకి , 5శాతం వైద్యానికి , మరో 5శాతం న్యాయ వ్యవస్థకి  కేటాయించాలి . అప్పుడే ప్రజలు ఆరోగ్యం తో ,నైపుణ్యం తో , క్రమ శిక్షణ తో ఉంటారు . (విద్య అంటే ఏదైన ఒక రంగం లో నైపుణ్యం ). 
ఈ మూడు లక్షణాలు ఉన్న ప్రజలే మన ఆర్ధిక , హార్దిక వనరులు . మానవ వికాసానికి ఈ మూడు లక్షణాలూ ఉన్న ప్రజలే పునాదులు . కానీ ఒక్క విషయం మారవ కూడదు . విద్య -వైద్య -న్యాయం  కంటే ముందు ప్రతి కుటుంబానికి కూడు -గుడ్డ -కొంప, వీటి  కంటే ముందు స్వచ్చమైన నీరు -గాలి అందాలి . 
 మనకు భూమి లేదు . ప్రక్రుతి వనరులూ  తక్కువే . మనకున్న ఏకైక ఆస్తి మానవ వనరులు . వాటినే మనం పటిష్టం చేసు కోవాలి . 
మంచి నైతిక విలువలు , దేశ మంటే ప్రేమ , చట్టం అంటే గౌరవం  ఉన్న నిపుణు లైన  ఆరోగ్య కర ప్రజా వాహిని ముందు ఎలాంటి స్వర్గ మైనా దిగ దుడుపే !  ఆ తర్వాత వాణిజ్యం . అంటే రోడ్ లు ,పోర్ట్ లు పటిష్టం చేయాలి . పూర్వ కాలం లో నదీ తీరాలె నాగరికతకు ఆలవాలం గా ఉండేవి . ఆ ధునిక కాలం లో హైవే లు ... మంచి రోడ్ లే ఆ పని చేస్తున్నాయి .
ఆ తర్వాత  సమాచార వ్యవస్థ  .  ఆ తర్వాత వినోదం,కళలు . 
ఇలా అభివృద్ధి కి ఏది ముఖ్యమో ,ఏది కీలకమో దానికి ప్రాధాన్యత ఇవ్వడమే ప్రభుత్వానికి ,నాయకులకు పెద్ద సవాల్ . 

మనదేశం లో ఉన్న 20 కోట్ల కుటుంబాలలో సుమారు 50 కోట్ల మంది పని చేస్తున్నారు . వీరిలో సగం శాతం , అంటే 25 కోట్లు వ్యవసాయ రంగం లో , 15 కోట్లు సేవా రంగం లో , మిగిలిన 10 కోట్ల మంది పారిశ్రామిక రంగం లో పనిచేస్తున్నారు .
మనదేశం లో సరాసరి జీతం గంటకి 120/- ,నెలకి 18000/-,ఏడాదికి 2.5 లక్షలు .
మనదేశ తలసరి ఆదాయం  నెలకి 7500/-. 
  
సేవా రంగం లో  పని చేస్తున్న 15కోట్ల మంది జిడిపి లో  60%  సాధిస్తున్నారు . 
వ్యవసాయ రంగం లో పని చేస్తున్న 25 కోట్ల మందికి  నైపుణ్య అభివృద్ధి పరం గా  ఇంకా మంచి శిక్షణ ఇవ్వ వలసిన అవసరం ఉంది . భూసార పరీక్షలు ,పంట దిగుబళ్ళ సమీక్షలు , మార్కెట్ ఒడి దుడుకులు , చిన్న కమతాలను పెద్దవి చేయడానికి కార్పోరేట్ మరియు కమ్మ్యునిటి వ్యవసాయం ,నీటిని ,ఎరువుని ,పురుగు మందులను పొదుపు గా  వాడుకోవడం , మొదలైన చర్యలు యుద్ద ప్రాతిపదిక పై చేపట్ట పోతే ,పేదరికాన్ని రూపు మాప లేము . 
పాత కాలపు వ్యవసాయ రంగాన్ని  ఆధునిక వ్యవసాయ పరిశ్రమగా పునర్ చైతన్య పరచాలి . 

పల్లెకి పట్టణానికి ఉన్న తేడా ఏమిటి ? 
ఉద్యోగ అవకాశాలు , విద్య - వైద్య సదుపాయాలు , రవాణా సౌకర్యాలు , వినోద కాలక్షేపాలు . 
కాబట్టి పల్లెలలో ఉద్యోగ ఉపాధి  అవకాశాలు పెరగాలీ అంటే ,లోకల్ గా దొరికే ముడి ఉత్పత్తుల ప్రాసెస్సింగ్ పరిశ్రమలు స్థాపించాలి . అలాగే మిగతా సౌకర్యాలను కూడ ప్రతి పెద్ద పంచాయితీ లో ఉండే విధం గా ప్లాన్ చసి బడ్జెట్ కేటాయించాలి . స్థానిక పాలన అంటే ఆజమాయిషీ ఒక్కటే కాకుండా ,పన్నులు , పన్నేతర ఆదాయం కూడా స్థానిక సంస్థ లకే దక్కే టట్లు చేసి ,జీత బత్యాలు స్థానిక సంస్థ లే భరా యించే టట్లు చేయాలి . 



మనం కూడా ప్రభుత్వ పాలన ని , అధికార పార్టీ రాజకీయ ఎత్తుగడలను వేర్వేరు గా చూడటం నేర్చు కోవాలి . 
అధికార పార్టీ , ఆయా ప్రాంతాలలో  తమ పార్టీ కి లభ్యత ఉండే విధం గా కొన్ని కార్యక్రమాలు చేయడం అనేది పెద్ద విష్యం కాదు . కానీ దానికీ కొన్ని హద్దు లుంటాయి . అధికార పార్టీ హద్దు దాట కూడదు . ఫెడరల్ వ్యవస్థ పై అన్ని ప్రాంతాల వారికి నమ్మకం బల పడే టట్లు ప్రవర్తించాలి 

కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చే అర్ధ క్రాంతి సంస్కరణలను , పాలనా సంస్కరణలను ప్రతిపక్ష పార్టీ లు ,మీడియా మరియు మధ్య తరగతి మేధావులు,దేశ శ్రేయస్సు దృష్ట్యా  పెద్ద మనస్సు తో  ఆహ్వానించాలి . 
ప్రతిపక్షాలు  పార్లమెంట్ లో పార్టీ సిద్దాంతాలకు ,పార్టీల  రాజకీయ లబ్ది కి అతీతం గా  వాదనలు విన్పించి తగు సవరణలు చేయడానికి ప్రయత్నించాలి గానీ , సభకి అంతరాయం కలగ చేయడం దేశ ద్రోహమే ! 
ప్రతిపక్షాల నోరు నొక్కడానికి అధికార పక్షం ప్రయత్నం చేస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థ , మీడియా మరియు ప్రజా కోర్టు ఉండనే ఉన్నాయి గదా ! 
క పార్టీకి అధికారం కట్ట బెట్టాం  అంటే అర్ధం ఏమిటి ? ఆ పార్టీ కి చెందిన సిద్దాంతాలను ,పాలసీలను అమలు చేయ మనే కదా ?  కాబట్టి సిద్దాంత పరమైన ,పాలసీ పర మైన మార్పులు చేస్తున్న ప్పుడు గుడ్డి గా వ్యతి రేకిం చడం మంచిది కాదు . 
కానీ ,అవినీతితో కుంభ కోణాలు బయట పడినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ,ప్రజలకు  ఉండాలి . 
అప్పుడు పార్లమెంట్ నే కాదు ,ప్రభుత్వ పాలనా వ్యవస్థ ను రీకాల్ చేసే పూర్తీ స్వేచ్చ ప్రజలకు ఉండాలి . 
 From
Dr.C.Srinivasa raju
Eluru –A.P.
9490172569.






Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి