సదాచారం

సదాచారం  అంటే ఏమిటి?

ఆచారం అనేది మనిషి తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తాడనే దానిపై   ఉంటుంది. అలాగే ఒక కుటుంబం లేదా సమాజం లేదా దేశం లోని మనుషులు దేనికి ఎక్కువ విలువ ఇస్తారో అదే ఆచారంగా మారుతుంది. 

"సంపద ఉంటేచాలు మాకెవ్వరి సంబంధ బాంధవ్యాలు అక్కరలేదు."---అని కొందరు  స్వార్ధపూరితులు . 

అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తాం . --- మరొకరు. --- తామస త్రాష్టుడు 

పక్కనోడు ఎండిపోతే చాలు,మేమెలా ఉన్నా ఫర్వాలేదు. ... మాత్సర్యం తో మసకబారిన వాడు. 

స్నేహం కోసం , పొరుగువాడి కోసం సాయం చేస్తాం. --- సాత్వికుడు 

ప్రేమకోసం మేమెలా పోయినా ఫర్వాలేదు. ... త్యాగశీలి!

దేశంకోసం మా ప్రాణాలు సిద్ధం. ...దేశభక్తులు . 

ఇలా మనుషులు రకరకాలుగా  తాము ప్రగాఢంగా నమ్మేవాటికోసం పాటుపడుతూ ఉంటారు. 

ఆచారాన్ని బట్టి ఆయా మనుషులు / దేశం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత నిస్తారో అర్ధం చేసుకోవచ్చు. 

కానీ  మహర్షులు సదాచారం అనగా వ్యక్తికీ, సమాజానికి  శ్రేయోదాయమైన దే తప్ప మరోటి కాదని రకరకాలుగా ప్రవచించారు. 

 బలమైన సంకల్పం తో నైపుణ్యం జోడించి   కృషి చేసి లేదా సోమరితనం తో  లేదా పక్కనోడిని తొక్కి తెగటార్చి గానీ మనిషి రకరకాల స్థాయికి చేరుకొంటాడు. పూర్వ కర్మ పరిపాకం కూడా మనిషి జీవితం లో  కొంత ప్రేరేపణ కలిగిస్తుంది. ఇలా    రకరకాలుగా మనిషి   ధనము, దారిద్య్రం, అధికారం,బానిసత్వం , సుఖదుఃఖాలు  , లాభ నష్టాలు  అనే ద్వందాలతో సతమవుతూ ఉంటాడు. 

విద్యావంతులకు వినయం, ధనికులకు సౌజన్యం, పరాక్రమ వంతులకు ఓర్పుతో మాట్లాడటం అలంకారం. జ్ఞానులకు ఇంద్రియ నిగ్రహం, శాస్త్రపండితులకు వినయం ఆభరణం. సంపన్నులైన వారికి సత్కార్య నిర్వహణ, దానబుద్ధిని కలిగియుండుట అలంకారం. తపఃశక్తి సంపన్నులకు కోపం లేకపోవడం, సర్వ సమర్థులకు సహనం ఉండడం, ధర్మాత్ములకు కపటబుద్ధి లేకపోవడం అలంకారము. పై అన్ని గుణాలకు మూలకారణమైన సత్ప్రవర్తన (సదాచారము) అందరికి శ్రేష్ఠమైన అలంకారము.

సదాచారమునకే సద్వర్తనము, సచ్చరితము, సద్వృత్తము, శీలము, సత్ప్రవర్తన వంటి పర్యాయ పదాలు ఎన్నో వాడుకలో ఉన్నాయి . సంపదలు, అధికారం, భద్రత అనేవి  మనిషికి  అవసరమే! కానీ ఇవే జీవితం కాకూడదు. సాత్విక రాజసిక మార్గంలో వీటిని సాధించుకోవచ్చు. కానీ వీటికోసం తామస బుద్ధితో రాక్షసం గా ప్రవర్తించి వీటిని సాధించినా లోలోపలి మనస్సు కుమిలిపోతూ కమిలి పోతూనే ఉంటుంది.  

అందుకే ఇక చాలు, పొరుగువాళ్ళకోసం పాటుపడదాం  అనే సంతృప్తి సమర్ధత  ఉన్నవాడే నిజమైన  ఐశ్వర్యవంతుడు. 

కాబట్టి సర్వోన్నతమైన అలంకారం సత్ప్రవర్తనయే. 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి