పరి ప్రశ్నలు

పరి ప్రశ్నలు 

ఈ ప్రపంచము ఏమిటి ? దీని తత్వం ఏమిటి ? దీన్ని పనికట్టుకొని సృష్టించారా ? లేక తనంతట తానె సృష్టి అయిందా ? అసలు మనకు ఇంద్రియగోచరం అవుతున్న  ఈ ప్రపంచం నిజంగా ఉందా ? లేక అది మనకు ఇంద్రియాలు , మనస్సు చేస్తున్న ఇంద్రజాలమా ?

మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి ? అర్ధం ఏమిటి ? అసలు మానవ జీవితానికి ఒక లక్ష్యము , అర్ధము ఉన్నాయా ? నేనెవరిని ? ఎక్కడినుంచి ఈ లోకానికి వచ్చాను ? ఇక్కడి నుంచి ఎక్కడికి  పోతాను ? జననానికి ముందు నేను ఉన్నానా ? మరణాంతరం నేను ఉంటానా ? ఇంతకి నాలోని ఈ “నేను” ఎవరు ? మానవుడు స్వతంత్రుడా ? అస్వతంత్రుడా . అతని నిర్ణయ స్వేచ్చా – free will – ఉందా ?

మన పూర్వులు ఎవరు , ఏం చేశారు . ఎలా జీవించారు , ఏ విజయాలు సాధించారు , ఏ అపజయాలు పొందారు , మనకు ఏ వారసత్వం మిగిల్చి వెళ్లారు అనేది తెలుసుకోవాలి . * మానవుడు స్వభావ సిద్ధంగా వివేచనాశీలి . రేశియోసినేషణ్ (ratiocination ) – వివేచన – అనే లక్షణము అతడిని జంతువుల నుంచి విడదీస్తుంది జంతువులు తమ సహజ సంవేదనల సహాయముతో పనులు చేస్తాయి . మానవుడు మాత్రమే బుద్దిని ఉపయోగించి వివేచిస్తాడు . జంతువులు ప్రశ్నలు వేయవు . మానవుడు ప్రశ్నలు వేస్తాడు .కొన్ని విశ్వాసాలు ఎరుపర్చుకుంటాడు .

ఈ ప్రపంచానికి ఆది ,అంతము ఉన్నాయా ? ప్రాణం అంటే ఏమిటి ? పాపం అంటే ఏమిటి ? పుణ్యము అంటే ఏమిటి ? ఏది తప్పు ? ఏది ఒప్పు ? నా జననానికి ముందు నేను ఉన్నానా ? మరణం తరువాత ఉంటానా ? స్వర్గము , నరకము , పూర్వజన్మ , పునర్జన్మ అంటూ ఉన్నాయా ? లోకములో ఎందుకింత క్రౌర్యము ఉంది ? ఎందుకింత స్వార్ధము , ఇంత నైచ్యం ,ఇంత హైన్యం , ఇంత దైన్యం ? వీటిని పరిహరించి లోకాన్ని ఇంతకంటే మేలైనదిగా తీర్చిదిద్దడానికి వీలున్నదా ?

ఈ మహా సృష్టికి కారణం ఏమిటి ? ఎక్కడనుంచి ఎందుకు మనం జన్మించినాము ? దేని వల్ల మనం జీవిస్తున్నాము? తుదకు మనకు విశ్రాంతి స్తలము ఎక్కడ ? మన సుఖ దుఖాలన్ని ఎవరివల్ల ,దేనివల్ల నిర్ణయం అవుతున్నాయి ? ఏ శాసనాలు మనల్ని నడుపుతున్నాయి ? “పరబ్రహ్మ”  అంటే ఏమిటి? 


1)   మన భారత దేశము పుణ్యభూమి అని ఎందుకు అంటారు ? 

2)   నాలుగు వేదాలు అందించిన సందేశం ఏమి ? 3) ఉపనిషత్హుకారులు చూపిన మార్గము ఏమి ? 4) పురాణాలు , శాస్త్రాలు కథ రూపకంగా సూక్ష్మములో చెప్పిన సాంకేతిక విషయమేమి ? 5) భగవంతుని ముఖారవిందం నుండి జాలు వారిన భగవద్గీత ప్రభోదించిన కర్తవ్యం ఏమి ? 6) నేటి కలియుగ మానవుని దైన్య స్థితికి కారణం ఏమి ? ఈ స్థితి పోవు  మార్గం ఏమి? 7) వీటిని అన్వేషించి అర్ధం చేసుకున్నది ఎంత ? 8) భగవంతుడు అంటే ఏమిటి ? 9) భగవంతుని కృప పొందాలంటే ఎం చేయాలి ? 10) భగవంతుని సేవ అనగానేమి ? 11) నీలోన ఉన్న దైవ శక్తులు ఏమి ? 12) ఆ శక్తులు ఎవరి సొత్తు ? 13) ఎవరివి వారికి సమర్పిస్తున్నమ ? 14) సమర్పించక పోవడం వల్ల నష్టం ఏమి ? 15) మనసు అశాంతికి కారణం ఏమి ? 16)మనసు శాంతి  , ఆనంద స్తితి, మానవుడు ఎలా పొందగలడు ?17) ఆనందం కోసం పూర్వీకులు చూపిన మార్ఘం ఏమి ? ఆ విద్య ఏమి ? ఆ విద్యను ఎం అంటారు ? భగవద్గీతలో చెప్పిన బ్రహ్మ విద్య అనగానేమి ? 

 బ్రహ్మ విద్య ద్వారా ఆ దైవాన్ని దర్శించ వచ్చని అనాదిగా మన పూర్వీకులు , యోగులు , ఋషులు , మునులు , తపస్సులు ఉపనిశాత్హుకారులు మొదలగు వారు ఆచరించి , తరించి ఆనందించి మానవ జన్మ కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని మల్లి మల్లి జన్మలు పొందకుండా చేసుకున్న విషయాన్ని అర్ధం చేసుకొని ఆచరించండి . ఈ విషయాలు అన్ని మీ అందరికి తెలిసినవే . ఈ పిన్నవాడు చెప్పిన దానిలో ఏమైన పొరపాట్లు ఉంటె పెద్ద మనసుతో తెలపగలరని కోరుతున్నాను . 

భాహ్య ప్రపంచాన్ని జయిస్తున్న మానవుడు తన అంతః ప్రపంచాన్ని జయించలేకపోతున్నాడు. తనను తానూ జయించుకోలేకపోతున్నాడు . అదే మానవ జీవిత పరమార్ధము కాదు , మానవుడు తనను తనలో నుంచి తెలుసుకోవాలి , భాహ్యంగా ఎంత తెలుసుకున్నా అది నాణేనికి ఒక వైపు అవుతుంది .రెండవ వైపున ఉన్నదే నీలోని తత్వ వివేచన .

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి