Re-program your sub-conscious mind!

 మీ సుప్తచేతన (sub conscious) కున్న అధ్బుతమైన శక్తి ఎవ్వరూ ఊహించలేరు. 

1) మీ సుప్తచేతన (sub conscious) కున్న శక్తి అంతు లేనిది. మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ప్రేరణ కలగజేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. అది మీ జ్ఞ్యాపకాల గోదామునుంచి మీ గత జీవితంలోంచి ఎన్నో దృశ్యాలను వెలికిదీయగలదు. మీ గుండె చప్పుడును, రక్తప్రసారాన్ని అది నియంత్రించగలదు. మీ జీర్ణశక్తిని, తిన్నది ఒంట బట్టించుకోవటాన్ని, బయటకు పంపటాన్నినియంత్రిస్తుంది. మీరో రొట్టెముక్క తినప్పుడు, మీ సుప్తచేతనాత్మక మనసు దానిని – కణజాలం, కండరాలు, ఎముకలు, రక్తం  రూపాలలోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని అతి పెద్ద తెలివైన వాడికి కూడా తెలియకపోవచ్చు. మీ సుప్త చేతనాత్మక మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను, శరీరధర్మాలను అదుపులో ఉంచుతుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు.

మీ సుప్తచేతనాత్మక మనసు ఎప్పుడూ నిద్రపోదు, విశ్రమించదు. అది అన్ని వేళల పనిచేస్తూనే వుంటుంది. దానికున్న అధ్బుతమైన శక్తిని తెలుసుకోవాలంటే ఒక పని చేయండి. నిద్రపోయేముందు దానితో స్పష్టంగా మీరొక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని అనండి మీరు కోరుకున్న ఫలితానికి దారితీయటం కోసం మీలోనే వున్న ఎన్నో శక్తులను వెలువడడం చూస్తె మీరే  ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. దీని శక్తి, తెలివితేటలు ఎలాంటివంటే అవి సర్వశక్తిసంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా సంపర్కం కలిగిస్తాయి. ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, గ్రహాలన్నీ వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది, సూర్యుణ్ణి ప్రకాశించేలా చేస్తుంది.

2) మీ సుప్తచేతనమే మీ జీవిత గ్రంధం —

మీరు మీ సుప్తచేతనాత్మక మనసుపై ఏ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు, సిద్దాంతాలు, మతవిశ్వాసాలను రాసిన, చెక్కినా, గాడముద్రవేసిన అవన్నీ అనుభవాలు, పరిస్తితులు, సంగటనల రూపాల్లో,భాహ్య లక్షణాలుగానే ప్రకటించబడుతాయి. మీరు లోపలి పక్క రాసుకున్నదంతా మీరు బయట కూడా అనుభవిస్తారు. మీ జీవితానికి రెండు పారాశ్వలున్నాయి, వస్తుగతమైనది ఒకటైతే – వ్యక్తిగతమైనది రెండోది, ఒకటి కనిపిస్తుంది, మరోటి కనిపించదు, ఒకటి ఆలోచన అయితే రెండోది దాని  వ్యక్తీకరణ.

మీ ఆలోచన మీ మెదడులోని వెలుపలిభాగం నరాల ప్రకంపనల రూపంలో చేరుతుంది, అదే మీ చైతన్యవంతమైన తార్కిక మనసు యొక్క అంగం. ఒకసారి మీ చేతనాత్మక, వస్తుగత మనసు ఆ ఆలోచన పూరిగా స్వీకరించక,అది మెదడు యొక్క ఇతరభాగాలకు ప్రసారం చేసింది. ఇది అక్కడ రూపొంది మీ అనుభవంలో మీ వ్యక్తీకరణమవుతుంది.

ఇంతకూ ముందు చెప్పినట్లు, మీ సుప్తచేతనా మీతో వాదించలేదు. దానిపైన మీరు రాసినదాని ప్రకారమే అది నడుచుకుంటుంది. మీ చేతనాత్మక మనసు ఇచ్చిన తీర్పును, అభిప్రాయాన్ని అంతిమంగా భావిస్తుంది. అందుకే మీరు జీవితగ్రంధాన్ని ఎప్పుడూ రాస్తూనేపోతుంటారు. – ఎందుకంటే మీ ఆలోచనలే మీ అనుభవాలు అవుతాయి కనుక, ” రోజంతా తను ఎలా ఆలోచిస్తూ ఉంటాడో. ఆ విధంగానే మనుషుడు తయారవుతాడు”. చేతనాత్మక మనుసుకు ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని, అందులో అనంతమైన జ్ఞ్యానము, అంతులేని తెలివి తేటలు ఉన్నాయి.

ఈ ప్రపంచములో ఇంత గందరగోళము దుఖము ఉండటానికి కారణం ఏంటో మంది ప్రజలు చేతనాత్మక (స్తూల) మనసుకు – సుప్త చేతనాత్మక (సూక్ష్మ) మనసుకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అర్ధం చేసుకోక పోవడమే !

ఇది సాధనలో కొనసాగు సాధకులకు త్వరలో అవగతమవుతుంది మీ నిస్పృహ, నిరాశలు అన్నింటికీ కారణం మీ కోరిక తీరకపోవడమే – వ్యతిరేఖమైన ఆలోచనలు చేయడము ద్వార మనకు మనమే గాయం చేసుకుంటాం – కోపంతో, భయంతో, అసూయతో, పగతో మీరేన్ని సార్లు మిమ్మల్ని గాయపరుచుకున్నారు ? ఇవన్ని విషయాలు మీ సుప్తచేతనాలోకి ప్రవేశిస్తాయి

3) శరీరము చేసే అన్ని కార్యాలను సుప్తచేతన ఎలా నియంత్రిస్తుంది ? -మీరు మేల్కొని ఉన్నా, నిద్ర పోతువున్న, అలసట ఎరుగని మీ సుప్తచేతనత్మకా మనస్సు మీ శరీరము నిర్వర్తించే కర్తవ్యా లన్నింటిని నియంత్రిస్తుంది. ఇందులో మీ చేతనాత్మక(స్థూల) మనసుకు మధ్యలో కలిపించుకునే అవసరమురాదు. మీరు నిదుర పొతున్నపుడు మీ గుండె  లయబద్దంగా కొట్టుకుంటుంది. మీ చాతి, గుండె విభాజక కండరాలు, ఊపిరి తిత్తులను గాలితో నింపటం, బయటకు పంపటం చేస్తుంటాయి. మీ శరీరంలోని జీవకణాలు నిర్వర్తిస్తున్న ఈ కార్యము మూలన బయటకు వదిలే carbondioxide ను మార్చి ఆక్సిజన్ తీసుకోవడానికి అవి పని చేస్తూ పోతుండాలి. మీ సుప్తచేతన మీ జీర్ణశక్తి ప్రక్రియలను, గ్రంధిజనిత స్రావాలను, తదితర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది. మీరు మేల్కున్న, నిద్రలో వున్నా యిదంతా నిరంతరం కొనసాగుతూనే వుంటుంది.

మీరు మీ శరీరము చేసే పనులన్నీ మీ చేతనాత్మక(స్థూల) మనసు ద్వారా చేయాల్సివస్తే, మీరు నిశ్చయంగా అపజయము పాలవుతారు. మీ సుప్తచేతనాత్మక మనసు ఎల్లా వేళలా పనిచేస్తూ ఉందన్నది మీరు మొట్టమొదట గ్రహించవలసిన విషయము. మీరు దానికి పని చెప్పినా ,చెప్పకపోయినా అది పగలు రాత్రి పనిచెస్థూనె ఉంటుంది. మీ సుప్తచేతనే మీ శరీరం యొక్క నిర్మాత, కాని అంతర్గతంగా, మౌనంగా ఉన్నదాన్ని ప్రక్రియలను మీరు స్థూల మనసుతో గమనించలేరు, వినలేరు. ” ఇది భగవంతుని యొక్క సృష్టి ఎంత విచిత్రంగా ఉందో, ఎంత అధ్బుతమైన మేకానిజము ఉందో అర్ధం చేసుకోవాలి.

1) మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే ముఖ్య మైన పనులన్నిటిని నియంత్రిస్తుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు.

2) నిద్ర పోయేముందు, మీ మీ సప్తచేతనాత్మక మనసుని ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి, దానికున్న అద్బుతమైన శక్తిని మీకు మీరు నిరుపించుకోండి.

3) మీరు మీ సుప్త చేతనాత్మక మనసు పై ఏ ముద్రలువేసిన, అవి – పరిస్తితులు, అనుభవాలు, సంగటనల రూపంలో వ్యక్తీకరించబడుతాయి. అందువలన మీ సుప్తచేతనాత్మక మనసులోని అన్ని భావనలనూ, ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి.

4) క్రియ – ప్రతిక్రియ -అనే నియమం విశ్వవ్యప్తమైనది. మీ ఆలోచన – క్రియ దాని ప్రతిక్రియ – మీ సుప్తచేతనాత్మక మనసు తనంతటతానే మీ ఆలోచనకు ప్రతిక్రియ చేయడం.

5) నిరాశకు మూలకారణం తీరనికోరికలు.అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, మీ సుప్తచేతనాత్మక మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మీ మంచిని మీరే అడ్డుకుంటారు.

6) జీవనసిద్దాంతం మీలో లయబద్దంగా సామరస్యంగా ప్రవహిస్తుంటుంది. మీరు బుడ్డి పూర్వకంగా, ” నాకీ కోరికను కలిగించిన సుప్తచేతన యొక్క శక్తి, నా ద్వారా ఆ కోరికను ఫలింపజేస్తుంది,”అని అంటూ నిర్ధారించండి. అన్ని సంఘర్షణలను అది రూ పుమాపుతుంది.

7) మీ గుండె, ఊపిరితిత్తులు, ఇతర అంగాల సామాన్యకార్యాలలో – ఆందోళన, అతురత, భయం ద్వారా – జోక్యం చేసుకోగలరు. సామరస్యం, ఆరోగ్యం, శాంతి గురించిన మంచి ఆలోచనాలతో మీ సుప్తచేతనను నింపండి, అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారుతాయి.

8) మీ చేతనాత్మక మనసులో ఎప్పుడూ సర్వశ్రేష్టమైన  కోరికలను మాత్రమె కలిగి ఉండండి, మీ సుప్త చేతనాత్మక మనసు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది.

9) మీ సమస్య సుఖాంతమైనట్లు, సరైన సమాధానం లభింఛినట్లు ఊహించుకొండి. ఏదో సాధించినట్లు పులకరించిపొండి. మీరు ఊహించినదాన్ని, అనుభూతి చెందిన దాని మీ సుప్తచేతనాత్మక మనసు స్వీకరిస్తుంది, కార్యచరణకు ఉపక్రమిస్తుంది.

POSITIVE AFFIRMATIONS - శాంతి మంత్రాల మననం , బీజమంత్రాల జపం ,ఓం కార నాదాను సంధానం , ధనాత్మక ఆలోచనలు, శాంతి ఆనందకరమైన ఊహలు, లోక కళ్యాణ కారకమైన భావనలు -  ప్రతినిత్యం అభ్యసించాలి. 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి