సంపూర్ణ సత్ చిత్ ఆనందం

ఏది జ్ఞానం ?
ఈ కనిపించే జగత్తు అంతా "మిధ్య " - { incomplete reality /broken reality} అని తెలుసుకోవడమే జ్ఞానం .
ఈ  జగత్ సత్యం కాదు ,మాయ / మిధ్య అని ఎలా చెప్పగలవ్ ?
ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని వదిలి పెట్టి ఇంకా ఏదో ఉంది అనే భావం మనిషి కి ఎందుకు వచ్చింది ?
  
ఈ  విశాల విశ్వమ్ లో ఒక బిందువు , ఒక గీత  ఏక మితి (unidimension) లో ఉంటే , రెండు  గీత ల మధ్య ఉన్న ప్రదేశం రెండు మితులలో (two dimension ) , అదే  ప్రదేశం ఎనిమిది దిక్కులకు వ్యాకో చించినపుడు మూడు మితులలో (three dimension)ఉంటుంది .
మనిషికి ఈ  మూడు మితుల జగత్ మాత్రమే అవగాహనకు వస్తుంది .
కానీ 14 మితుల (14-dimensioned universe) జగత్ ఉందని ఋషులు చెప్పారు .
అందుకే ఈ  మూడు మితుల   జగత్ ని మిధ్యా జగత్ (incomplete universe/ broken truth) అంటారు .
కనపడే జగత్ అంతా  అసంపూర్ణం . చాలా చిన్న కల లాంటి విషయం . అసలైన జగత్ ఇంకా ఎంతో ఉంది . దాని లక్షణం సత్యము , దాని స్థితి ఆనందం .దానికి ఏ రూపమూ ఉండదు . 
అలాగే ఇంకో ఉదాహరణ - భూమి మీద ఉన్న మనకు సూర్యుడు తిరుగుతున్న  ట్లుగా ,భూమి స్థిరం గా ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది .
కాని ,నిజం ఏమిటో అందరికీ తెలుసు .
మన అనుభూతి నిజం కాదు .భ్రమ.
అలాగే ఇంద్ర జాలికుడు మనిషిని ముక్కలుగా చేసినట్టు మనకు భ్రమ కల్పిస్తాడు .
అంటే ఏ  విషయాన్ని అయినా , ముక్కలు ముక్కలుగా చూస్తే మనకు కలిగేది భ్రమే గాని ,సత్యం కాదు .అలాగే మానవ జీవితం కూడ  .
మనం మిధ్యా  జగత్ ( lesser reality)  ని అర్ధం చేసు కోవాలంటే పూర్తి  జగత్ -greater reality ( పూర్ణం ) ని అర్ధం చేసు కోవాలి .
In form, we are many; in essence, we are one!”
రూపాలు ఎన్నో ! కానీ మన ఆత్మ ఒక్కటే !
మనస్సు ని ఎలా నియమితం చేసు కోవాలి ?
ఎపుడైతే   మూడు మితుల ఈ మిధ్యా ప్రపంచాన్ని మనం పట్టించుకొమో అపుడు ద్వందాలపై  మోహం తగ్గుతుంది .
నిత్య జీవితంలొ జరిగే , జరగబోయే ఘటనలతో మనం 
మమేక మవ్వనపుడు బాధా సంతోషాలు   మనం
 అనుభూతి చెందము .
ఉదాహరణకు ,
రాయీ రప్పా చుట్టూ జరిగే విషయాలను పట్టించు కోవు. స్పందించవు  . అనుభూతీ చెందవు .
చెట్టూ చేమా  చుట్టూ జరిగే విషయాల కు స్పందిస్తాయి . కానీ అనుభూతీ చెందవు .
కీటకాలు , నిమ్న జాతి క్షీ రదాలు స్పందించి గుర్తు పెట్టు కొంటాయి . వాటికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ .
కానీ మనిషికి వీటన్నింటి తో పాటు ఉహా శక్తి , మంచి జ్ఞాపక శక్తి , 
తార్కిక శక్తి , సంకల్ప బలం ఉంటాయి .
మనుషలందరికీ ఈ శక్తులు సమాన స్థాయి లో ఉండవు . ఈ  శక్తి నే చైతన్యమని ,కాన్షస్ నెస్ అని అంటాము .
మనిషి కి ఈ చైతన్యమే ప్రధానం .స్థావర జంగ మాల కన్నా ఎక్కువ చైతన్యం మనిషికి ఉంటుంది . అలాగని  మనుషలందరికీ  సమానంగా ఈ  ఎరుక ఉండదు .
ఎరుక ఎంత ఎక్కువ ఉంటే ఈ  విశ్వ శక్తి స్థితిగతుల గూర్చి సంపూర్ణ వాస్తవం అంత  ఎక్కువగా మనకు అవగతం అవుతుంది .
సంపూర్ణ వాస్తవం అనుభూతికి రానంత వరకు మనకు అవగత మయ్యె విషయాలన్నీ అర్ధ సత్యాలు / మిధ్య .
మన జ్ఞానేంద్రియాలు కాంతిని ,ధ్వనిని కొంత వరకే తెలుసు కోగలవు  .
కాంతి ,ధ్వనులను పూర్తిగా తెలుసు కోనంత వరకు మనం మాయ లో ఉన్నట్లే . ఎందు కంటే ఈ  విశాల విశ్వమంతా  శక్తి వివిధ రూపా లైన కాంతి ,ధ్వని తరంగాల సమ్మేళనం . వీటిని సంపూర్ణముగా తెలుసు కోగలిగితే సత్యాన్ని తెలుసు కొన్న ట్లే .

తెలుసు కోవ టం మరెలా సాధ్యం ?మనిషికి అడ్డుగా ఉన్న మనస్సులో ఉన్న చిత్త  వృత్తులను , సంకల్పాలను , రాగ ద్వేషాలను , ఆవేశ  కావేషాలను , ఈ  మిధ్యా ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను నియమితం చేసుకొని మెల్లగా వాటినుండి చిత్తాన్ని శూన్యం ( విశ్వ శక్తి , చైతన్యం , సచ్చిదానందం , సంపూర్ణ సత్యం  ) పై  కేంద్రీక రించి తద్వారా మనస్సుని  శూన్యం  లో లయం చేస్తే   సంపూర్ణ సత్యం అనుభూతికి వస్తుంది .

సంపూర్ణ వాస్తవం తెలుసుకొన్న ఋషులు ఆ విధం గానే సాధన చేసి దర్సనం చేసు కొన్న విషయాలను , రూపాలను ,ధ్వనులను - వేదాలుగా ,దర్శనములుగా ,మంత్రాలుగా ,యంత్రాలుగా మనకు అందించారు .
ఈ ప్రపంచంలో మనం పడే శ్రమ , కష్ట నష్టాలు , సుఖ సంతోషాలు ఇవన్నీ శాశ్వతం కావు ,  అన్నీ మార్పు చెందుతాయి అని మనం గట్టిగా నమ్మితే , ఈ జగత్తులో మనం జరిపే  బాధ్యతలన్నీ సాక్షీ భావంతో నిర్వర్తిస్తాం .

ఈ మిధ్యా ప్రపంచంలో మనం ఎందుకు బాధ్యతలు , కర్మలు చేయాలి ?
 ఊర కే కూర్చోవ చ్చు గదా ?
జీవిత పరమావధి ని చేరా లంటే మనిషికి శరీరం ,మనస్సు ,బుద్ది  అవసరం .
ఇవి నిల బడా లంటే ఆహారం ,నీరు, ప్రాణ శక్తి కావాలి . ఇవి అందా లంటే  వ్రుత్తి , ప్రవ్రుత్తి కి సంబంధించిన కర్మలు చేయాలి . శరీరం ఉంటేనే కర్మల పరిపాకం జరిగి పంచ కోశాల శుద్ది జరుగుతుంది .  కాబట్టి ధర్మ విహిత కర్మలు తప్పక చేయాలి .అప్పుడే కొత్త  కర్మ బీజాలు ఏర్పడవు .

అసలు "మిధ్య " అంటే అర్ధం ఏమిటి ? 

సంపూర్ణ  సత్యం కానిది మిధ్య .ఈ ప్రపంచం లొ మనం పుట్టి పెరిగి సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాం . శరీరం మార్పు చెందుతూ చివరకు మరణిస్తుంది . మన మనస్సు నిరంతరం ఆలోచనలు మార్పు చేసుకొంటూ ప్రాణం పోయిన తర్వాత కొంత కాలానికి ప్రక్రుతిలొ విలీనం అవుతుంది . అంటే మార్పు చెందే దానిని , అసంపూర్ణ మైన దానిని మిధ్య అంటాం .  
   
 చివరకు మిగిలేది ఏది ?   అంటే , మార్పు చెందనిది ఏదైనా ఉంటుందా?
కాన్షస్ నెస్స్ లేదా ప్రజ్ఞ లేదా ఆత్మ లేదా బ్రహ్మ  శాశ్వతం , మార్పు చెందదు - అని రుషులు , శాస్త్రాలు చెప్పుతున్నాయి . అది సత్యమా కాదా అని తెలుసుకోవడమే జ్ఞానం .
ఆ జ్ఞానాన్ని పొందటమే  ప్రతి మానవుడి కర్తవ్యం .
జ్ఞానమే మనిషికి మోక్షం .
మార్పు చెందే ప్రపంచంలో మనిషి ఎలా జీవనం సాగించాలో భోదించేదే సర్వ ఉపనిషద్ సారాంశమైన  భగవద్గీత .


  • పురుషార్ధాలైన అర్ధకామాలను ధర్మంగా సాధించుకోవడమే మోక్షదాయకమని ,
  • ద్వందాలకు అతీతంగా అంటే సుఖ దుఖ భావనలకు లోబడకుండా మన బాధ్యతలను నిర్వికారంగా అహానికి ఆపాదించుకోకుండ నిర్వర్తించడమే మోక్ష మార్గమని ,
  • సంపూర్ణ శరణాగతి తో మన కామ్య కర్మలను , భావనలను ,ద్వందాలను  భగవంతునికి అర్పించడమే మోక్షదాయమని ,
  • విచక్షణ , వివేకాలు పెంచుకొని  విహిత శాస్త్రాలు , ప్రక్రుతి విజ్ఞానం ,  ధర్మం ,సత్యం , మోక్షం గురించిన జ్ఞానాన్ని పొందటం మోక్షమని -  చెప్పిన గీతను ప్రతి రోజూ అధ్యనం చేసి మన జీవితాలలో జరిగే సంఘటనలకు అన్వయిమ్చుకుందాం .జ్ఞానాన్ని మన హృదయం లో సుస్థిరం చేసు కొందాం .


Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి